STOCKS

News


స్టాక్‌ బాగా పడిందని ఇన్వెస్ట్‌ చేయొద్దు: డీకే అగర్వాల్‌

Sunday 28th October 2018
Markets_main1540750009.png-21542

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుదల, యూరోప్‌ యూనియన్‌లో వివాదాలు వెరసి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌, ఎండీ డీకే అగర్వాల్‌ పేర్కొన్నారు. అధిక వడ్డీ రేట్లు కఠినమైన ఆర్థిక పరిస్థితులకు దారితీయవచ్చని, దాంతో వృద్ధి రేటు దెబ్బతినొచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయన్నారు. అమెరికా ఆర్థిక వృద్ధి పెరుగుదల ఆరంభంమైన దగ్గర్నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకెళుతున్నారని అగర్వాల్‌ చెప్పారు. దీనికి తోడు అమెరికాలో బాండ్‌ ఈల్డ్స్‌ కూడా సానుకూలంగా మారడం, డాలర్‌ బలపడడం కూడా కారణాలుగా పేర్కొన్నారు. దేశీయంగా ఆగస్ట్‌ వరకు ఆసియాలోనే మంచి జోరు మీదున్న మన మార్కెట్లను పెరిగిన చమురు ధరలు, రూపాయి పతనం, అంతర్జాతీయంగా ఆర్థిక ఆందోళనలు, ఎన్‌బీఎఫ్‌సీల్లో క్రెడిట్‌ సంక్షోభం పతనం బాట పట్టేలా చేశాయన్నారు. 

 

రూపాయిలో బలహీనత, డాలర్‌ బలపడడం, బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల, చమురు ధరలు మన దేశ ఆర్థిక రంగంపై ఒత్తిళ్లను పెంచినట్టు అగర్వాల్‌ తెలిపారు. ఈ ఏడాది డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇంతవరకు 13 శాతం క్షీణించినట్టు చెప్పారు. ఇక త్వరలో కీలక రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో జరిగే సాధారణ ఎన్నికల ఫలితాల పట్ల ఆందోళనలు ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ఏడు నెలల ముందే కసరత్తు మొదలైందన్నారు. దీంతో దేశీయ మార్కెట్లు చాలా ఆత్రుతతో ఉన్నట్టు చెప్పారు. మోదీ సర్కారు తీసుకున్న పెద్ద సంస్కరణలు ఇంకా అమలు క్రమంలోనే ఉన్నట్టు అగర్వాల్‌ గుర్తు చేశారు. ‘‘నిస్సందేహంగా రాబోయే ఎన్నికలు కర్టెన్‌ రెయిజర్‌ వంటివే. రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చే ఫలితాలు 2019 సాధారణ ఎన్నికల ధోరణిని నిర్ణయించనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 65 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం తిరిగి 2019లో కేంద్రంలో అధికారంలోకి వస్తే  అది సానుకూలత అవుతుంది. ముఖ్యంగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు. ప్రభుత్వం చేపట్టిన కీలకమైన సంస్కరణలు మధ్యలోనూ, అమలు ముగింపులోనూ ఉన్నాయి. అవి కచ్చితంగా పూర్తి కావాలి. దాంతో ఆర్థిక రంగంలో భిన్న రంగాలకు సానుకూలత ఏర్పడుతుంది. మోదీ ప్రభుత్వం జీఎస్టీ, మానిటరీ పాలసీ నిర్మాణంలో సంస్కరణ, బ్యాంకుల్లో ఎన్‌పీఏల ప్రక్షాళన, ఐబీసీ, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను చేపట్టింది. వృద్ధి రేటు నిలబడాలంటే ఇవి కొనసాగడం అవసరం’’ అని అగర్వాల్‌ తెలిపారు.

 

ఓ స్టాక్‌ ధర బాగా పడిపోయిందని ఇన్వెస్ట్‌ చేయడం సరికాదని ఇన్వెస్టర్లకు  అగర్వాల్‌ సూచించారు. దీనికి బదులు వ్యాపార ఆర్థిక మూలాలు బలంగా ఉన్న కంపెనీలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అధిక చమురు ధరలు, దేశీయ కరెన్సీ విలువ తగ్గడం వల్ల కొన్ని కంపెనీల విక్రయాల వృద్ధి తగ్గడంతోపాటు లాభాలు కూడా తగ్గుముఖం పట్టొచ్చని చెప్పారు. కనుక ఈ స్టాక్స్‌ ధరలు పడిపోవడం అన్నవి విలువల సర్దుబాటుగానే చూడాలని ఇన్వెస్టర్లకు సూచించారు.  You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 55 పాయింట్లు అప్‌

Monday 29th October 2018

గత శుక్రవారం అమెరికా సూచీలు భారీగా తగ్గినప్పటికీ, సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు స్థిరంగా ట్రేడవుతున్న నేపథ్యంలో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 గంటల సమయానికి 55 పాయింట్ల పెరుగుదలతో 10,110 పాయింట్ల వద్ద కదులుతోంది. ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుగుణంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గత శుక్రవారం 10,055 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా స్పాట్‌ నిఫ్టీ 10,030 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సోమవారం ఆసియాలోని

బలమైన హెచ్‌ఎఫ్‌సీలు, ఎన్‌బీఎఫ్‌సీలు పోటీలో నిలబడతాయి: సుదీప్‌ దుగార్‌

Sunday 28th October 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ రుణ చెల్లింపుల్లో విఫలం అయిన తర్వాత మార్కెట్లో లిక్విడిటీ సమస్య విషయమై ఆందోనలు నెలకొనగా... ఈ ప్రభావం హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు), ఎన్‌బీఎఫ్‌సీల కంపెనీలపై తీవ్రంగా పడింది. సంబంధిత కంపెనీల షేర్లు భారీగా నష్టపోవం కూడా చూశాం. వాస్తవానికి ఈ కంపెనీల షేర్ల విలువలు గరిష్ట స్థాయికి చేరడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశమని స్టివార్ట్‌ అండ్‌ మ్యాక్‌రిచ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ సుదీప్‌ దుగార్‌

Most from this category