STOCKS

News


డాలీఖన్నా పోర్టుఫోలియో రివ్యూ

Wednesday 24th October 2018
Markets_main1540369700.png-21445

మిడ్‌క్యాప్‌ మొగల్‌గా పేరొందిన డాలీఖన్నా సెప్టెంబర్‌ త్రైమాసికంలో పలు కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో దాదాపు 50 శాతం వరకు పతనమైన పలు కంపెనీలను ఎంచుకొని డాలీ ఖన్నా వాటాలు కొనుగోళ్లు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం డాలీ పోర్టుఫోలియోలో పలు స్టాకులు పది శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.

క్యు2లో డాలీ ఖన్నా పోర్టుఫోలియోలో వచ్చిన మార్పులు...
- ఐఎఫ్‌బీ ఆగ్రో ఇండస్ట్రీస్‌, మత్తూట్‌ క్యాపిటల్‌, నోసిల్‌, రాడికో ఖైతాన్‌, రైన్‌ ఇండస్ట్రీస్‌; రుచిరా పేపర్స్‌, సెలాన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కంపెనీల్లో వాటాలను పెంచుకున్నారు. సమీక్షా కాలంలో మత్తూట్‌ క్యాపిటల్‌, నోసిల్‌, రాడికో ఖైతాన్‌, రైన్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 5- 24 శాతం క్షీణించాయి. రుచిరా పేపర్‌ 18 వాతం, సెలాన్‌ 10 శాతం, ఐఎఫ్‌బీ ఆగ్రో ఒక్క శాతం లాబపడ్డాయి. 
- మణుప్పురం ఫైనాన్స్‌, ఆర్‌ఎస్‌డబ్ల్యయెం, శ్రీకాళహస్తి పైప్స్‌, స్టెర్లింగ్‌ టూల్స్‌, టాటా మెటాలిక్స్‌లో డాలీ ఖన్నా వాటాలను తగ్గించుకున్నారు. ఈ షేర్లు సమీక్షా కాలంలో దాదాపు 4- 29 శాతం పతనమయ్యాయి.
- ఇదే సమయంలో బటర్‌ఫ్లై గంధిమతిలో డాలీ వాటా యథాతధంగా ఉంది. సమీక్షా కాలంలో ఈ షేరు దాదాపు 50 శాతం క్షీణించింది. 



You may be interested

వెలుగులో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు

Wednesday 24th October 2018

ముంబై:- అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో బుధవారం పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో తాజాగా సౌదీ అరేబియా తగినంత చమురును ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. పలితంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి విలువ పడటం కూడా పెట్రోరంగ షేర్లకు కలిసోస్తుంది. ఈ రంగలో ప్రధాన షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీల్‌, ఐఓసీ షేర్లు 6నుంచి 5శాతం

కోటక్‌ మహీంద్రా లాభం 21% అప్‌

Wednesday 24th October 2018

ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. వార్షికంగా చూస్తే కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.1,747 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.1,441 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గ్రూప్‌ మొత్తం అసెట్స్‌ క్యూ2 చివరి నాటికి 18 శాతం వృద్ధితో రూ.1,99,382

Most from this category