STOCKS

News


ఐపీవోకు దొడ్ల డెయిరీ

Friday 10th August 2018
Markets_main1533896714.png-19131

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పాలు, పాల ఉత్పత్తుల విక్రయ కంపెనీ దొడ్ల డెయిరీ ఐపీవోకు రానుంది. ఈ మేరకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా  రూ.150 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితోపాటు కంపెనీ షేర్‌హోల్డర్లు టీపీజీ దొడ్ల డెయిరీ హోల్డింగ్స్‌, దొడ్ల దీపా రెడ్డి 95,43,770 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయిస్తారు. ఐపీవో సైజు సుమారు రూ.500 కోట్లు ఉండొచ్చని అంచనా. ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా, కార్వీ కంప్యూటర్‌ షేర్‌ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తారు. ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో లిస్ట్‌ కానున్నాయి.You may be interested

4 శాతం తగ్గిన ఫ్యూచర్‌ రిటైల్‌ లాభం

Friday 10th August 2018

 న్యూఢిల్లీ: బిగ్‌బజార్‌ రిటైల్‌ అవుట్‌లెట్‌లను నిర్వహించే ఫ్యూచర్‌ రిటైల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.153 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.148 కోట్లతో పోల్చితే 4 శాతం వృద్ధి సాధించామని ఫ్యూచర్‌ రిటైల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,707 కోట్ల నుంచి రూ.4,542 కోట్లకు తగ్గిందని పేర్కొంది. గత ఏడాది జూలై నుంచి

12 శాతం తగ్గిన అరబిందో లాభం

Friday 10th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో అరబిందో ఫార్మా నికరలాభం క్రితంతో పోలిస్తే 12 శాతం తగ్గి రూ.455.7 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు 15.5 శాతం అధికమై రూ.4,250 కోట్లకు ఎగసింది. ఎబిటా 18.3 శాతంగా ఉంది. యూఎస్‌, యూరప్‌ మార్కెట్‌ జోష్‌ కంపెనీకి తోడైంది. యూఎస్‌ ఫార్ములేషన్ అమ్మకాలు 11.5 శాతం అధికమై రూ.1,890 కోట్లు, యూరప్‌ ఫార్ములేషన్‌ విక్రయాలు 30.7 శాతం వృద్ధితో రూ.1,199

Most from this category