STOCKS

News


సెల్లింగ్‌ సప్తపది

Saturday 29th December 2018
Markets_main1546076596.png-23314

ఎప్పుడు అమ్మేయాలో తెలుకోండి
స్టాక్‌ మార్కెట్లో విజయం సాధించాలంటే రెండు మౌలిక సూత్రాలు తప్పక తెలిసుండాలి. ఒకటి సరైన సమయంలో కొనడం, రెండు సరైన సమయంలో అమ్మడం. చాలామంది ఆచితూచి కొనుగోలు చేసినా ఎప్పుడు అమ్మాలో తెలియక బొక్కబోర్లాపడుతుంటారు. అందుకే మన వద్ద ఉన్న స్టాకులను ఎప్పుడు విక్రయించాలో తెలుసుకోవడం కీలకం. ఇందుకు నిపుణులు కొన్ని సంకేతాలను సూచిస్తున్నారు...
1. 20 శాతం లాభాలు: సాధారణంగా ఒక కీలక నిరోధాన్ని దాటిన తర్వాత స్టాకులు కనీసం 20- 25 శాతం వరకు ర్యాలీ చేస్తుంటాయి. అందువల్ల మన వద్ద ఉన్న స్టాకు కనీసం 20 శాతం ర్యాలీ జరిపగానే ప్రాఫిట్‌ బుకింగ్‌ చేయాలి. అయితే సదరు స్టాకు కేవలం 3, 4 వారాల్లోనే 25 శాతం ర్యాలీ జరిపితే మాత్రం దాన్ని అట్టిపెట్టుకోవచ్చు. ఈ సందర్భాల్లో సదరు స్టాకు మరింత ముందుకు పోయే అవకాశాలు ఎక్కువ. ఇలాంటివాటిని కనీసం 8 వారాలు అట్టిపెట్టుకోవచ్చు.
2. 8 శాతం నిబంధన: ఒక మంచి ర్యాలీ జరిపిన స్టాకు అలుపు తీర్చుకునేందుకు కాస్త వెనకడుగు వేస్తుంది. దాన్ని కరెక‌్షన్‌గా భావించనక్కర్లేదు. అయితే ఈ వెనకంజలో స్టాకు కొనుగోలు పైవట్‌ పాయింట్‌ కన్నా 8 శాతానికి మించి పతనమైతే అప్పుడు దాన్ని వదిలించుకోవాలి. మంచి ర్యాలీ అనంతరం 8 శాతానికి పైగా పడిపోవడమంటే స్టాకులో పరుగు సాధించే సత్తా అయిపోయిందని తెలుసుకోవాలి. 
3. కొత్త గరిష్ఠాలు, అల్పవాల్యూంలు: కొన్ని స్టాకులు ఎప్పటికప్పుడు కొత్త శిఖారాలు అధిరోహిస్తూ ఉంటాయి. కానీ వీటి ట్రేడింగ్‌ వాల్యూంలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిపై బడా ఇన్వెస్టర్లు మక్కువ చూపడంలేదనేందుకు ఇదే నిదర్శనం. వీటిని వెంటనే వదిలించుకోవాలి.
4. రోజువారి కనిష్ఠానికి దగ్గర క్లోజింగ్‌: చాలా రోజుల పాటు ఒక స్టాకు ఇంట్రాడేలో దాని డైలీ కనిష్ఠానికి దగ్గరగా క్లోజవుతుంటే ఆ స్టాకు సత్తా ముగిసిందని తెలుసుకోవాలి.
5. 200 డీఏంఎ: స్టాకు తన 200 రోజుల డీఎంఏ స్థాయికి చాలా పైన అంటే సుమారు 70- 100 శాతం పైన ట్రేడవుతుంటే భారీ ఓవర్‌బాట్‌గా గుర్తించి విక్రయించాలి. 
6. పడిపోతున్న రోజులు: నిర్ధిష్ట కాలంలో స్టాకు పైకి మూవ్‌ అయిన ట్రేడింగ్‌ రోజుల కన్నా పడిపోతున్న ట్రేడింగ్‌ రోజులు ఎక్కువగా ఉంటే స్టాకు పతనానికి రెడీగా ఉందని అర్ధం.
7. ఆర్‌ఎస్‌ఐ: రెలిటివ్‌ స్ట్రెంగ్త్‌ ఇండెక్స్‌(ఆర్‌ఎస్‌ఐ) సూచీ క్రమానుగత అధోముఖ ధోరణి చూపుతుంటే స్టాకులో సెల్లింగ్‌ పెరుగుతోందని తెలుసుకోవాలి. 
వీటితో పాటు స్టాక్‌ విక్రయించే సందర్భాన్ని సూచించే పలు సంకేతాలు కనిపిస్తుంటాయి. వీటిని గుర్తించి సరైన సమయంలో ప్రాఫిట్‌బుకింగ్‌ చేసి బయటపడాలి. You may be interested

సిమెంట్‌ షేర్లకు దూరంగా ఉండండి: కోటక్‌

Saturday 29th December 2018

దేశవ్యాప్తంగా సిమెంట్‌ ధరలు దిగివస్తున్న నేపథ్యంలో అధిక వ్యాల్యూవేషన్‌ కలిగిన సిమెంట్‌రంగ షేర్లకు దూరంగా ఉండటమే మంచిదని కోటక్‌ సెక్యూరిటీ అభిప్రాయపడుతోంది. ప్రతి సిమెంట్‌ బస్తాపై ధర రూ.3ల మేరకు తగ్గుముఖం పట్టడంతో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు 1శాతం నుంచి 3శాతం వరకు తగ్గవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. పెట్‌కోక్‌ వ్యయాల క్షీణత సిమెంట్‌ ధరలపై ఒత్తిడిని కలిగించినప్పటికీ.., వచ్చే త్రైమాసికంలో ధరలు,

ఎంఎఫ్‌ మదుపరులకు పాఠాలు

Saturday 29th December 2018

ఈ సంవత్సరం మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు మిశ్రమ ఫలితాలు అందాయి. 2018లో ఎంఎఫ్‌ మార్కెట్‌ మదుపరులకు మూడు పాఠాలు నేర్పింది. 1. టాప్‌ అప్‌ మరువద్దు: మార్కెట్లు వెనుకంజ వేసిన తరుణంలో ఎంఎఫ్‌ పోర్టుఫోలియోను టాప్‌ అప్‌ చేసుకున్నవాళ్లకు ఈ ఏడాది మంచి రాబడులే వచ్చాయి. కేవలం మొదట పెట్టిన పెట్టుబడితో ఆగిన వాళ్లు నష్టాలను చవిచూశారు. 2. లాంగ్‌టర్మ్‌ మంత్రం: దీర్ఘకాలిక ధృక్పథం, పోర్టుఫోలియోలో వైవిధ్యత ఉన్న మదుపరులే ముందుంటారని ఈ

Most from this category