News


డైవర్సిఫై చేయడమే... సరైన నిర్ణయం..!

Thursday 8th November 2018
Markets_main1541654090.png-21785

మోబియస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడు, సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ మార్క్‌ మోబియస్‌ సూచన

స్టాక్‌ మార్కెట్‌ 20 ఏళ్ల చరిత్రను గమనించినట్లయితే, ఇందులో ఉత్తమ ర్యాలీ కనబర్చిన కాలం కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉంటుందని ఇన్వెస్ట్‌మెంట్‌ గురు, మోబియస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడైన మార్క్‌ మోబియస్‌ వ్యాఖ్యానించారు. ఏ దేశ మార్కెట్‌ను పరిశీలించినా ఇదే విధంగా ఉంటుందని వెల్లడించిన ఆయన.. ఇటువంటి ప్రయాణం చేస్తున్న మార్కెట్లకు సరైన విధానం డైవర్సిఫై చేయడమే అని సూచించారు. అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెట్టకూడదనేది సామెతను ఎప్పటికీ మరిపోకూడదని, పెట్టుబడులను వివిధీకరించడం ద్వారా మంచి రాబడిని అందుకోవచ్చని సూచించారు. దీపావళి పండుగ సందర్భంగా ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. భారత మార్కెట్లకు సంబంధించి ఈ మేరకు సూచన చేశారు. ‘మీ పెట్టుబడుల లక్ష్యం ఏంటనే విషయంపై ఆలోచించండి. భారత్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెట్టుబడుల పరంగా ఇక్కడ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి.’ అని వ్యాఖ్యానించారు. ఇక భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతున్న ముడిచమురు విషయానికి వస్తే.. డాలర్‌ పరంగా క్రూడ్‌ ధర మరింత ఖరీదుగా మారిపోతోంది. అయితే ధరల ర్యాలీ మరీ భయపడాల్సినంత దూకుడుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరుగుతుండడం వల్ల మరిన్ని విదేశీ ఆయిల్‌ ఉత్పత్తి కంపెనీలు రంగంలోకి దిగి సప్లైని పెంచుతాయి. ఈ అంశాలను బేరీజు వేసుకుని చూస్తే ధర బాగా పెరిగిన పక్షంలో బ్యారెల్‌ ముడిచమురు ధర 100 డాలర్ల వద్దకు చేరుకోవచ్చని, ఈస్థాయి అనేక ఉత్పత్తి కంపెనీలకు చాలా లాభదాయకంగా ఉంటుందని విశ్లేషించారు. ఇంతస్థాయికి చేరినప్పటికీ.. భారత్‌కు పెద్దగా నష్టమేమీ ఉండదని వివరించారు. భారీ నష్టం ఎందుకు ఉండదనే ప్రశ్నకు.. భారత్‌లో సౌర, విండ్‌ వంటి అనేక ప్రత్యామ్నాయ విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో సరైన పెట్టుబడి నిర్ణయం ఏదని అడిగితే పెట్టుబడులను వివిధీకరించడం అని చెబుతానని, భారత్‌ మార్కెట్‌ కూడా ప్రపంచ మార్కెట్లలో భాగమే కనుక ఈ మార్కెట్‌కు కూడా ఇదే వర్తిస్తుందన్నారయన.You may be interested

అంచనాలను మించిన చైనా వాణిజ్య గణాంకాలు

Thursday 8th November 2018

రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా పేరున్న చైనాలో అక్టోబర్‌ నెల ఎగుమతి, దిగుమతి గణాంకాలు ఆర్థికవేత్తల అంచనాలకు మించి నమోదయ్యాయి. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఎగుమతులు 15.6 శాతం, దిగుమతులు 21.4శాతం వృద్ధిని సాధించినట్లు చైనా కస్టమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. విశ్లేషకులు అక్టోబర్‌లో ఎగుమతులు 11శాతం, దిగుమతులు 14శాతం వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేశారు. అయితే ఇదే అక్టోబర్‌లో వాణిజ్య మిగులు మాత్రం ఆర్థికవేత్తల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ

ఆఫ్‌షోర్‌లో రూపీ రివకరీ

Thursday 8th November 2018

ఇండియన్‌ రూపాయి ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో కోలుకుంది. ఏకంగా 68 పైసలు మేర లాభపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గురువారం ఉదయం 10:23 సమయంలో (భారతీయ కాలమాన ప్రకారం) 72.32 వద్ద ట్రేడవుతోంది. ఒకానొక సమయంలో 72.30 స్థాయికి కూడా బలపడింది. కాగా రూపాయి మంగళవారం 73 వద్ద ముగిసింది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే శుక్రవారం రూపాయి పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా రూపాయి

Most from this category