STOCKS

News


నిఫ్టీ 10,000 దిగువకు అసాధ్యం

Friday 21st September 2018
Markets_main1537511898.png-20436

ఎన్నికలకు ముందు ఏడాదిలో ద్రవ్యలోటు పెరుగుదల భయాలు ఉండటం సహజమేనని షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌ దువా తెలిపారు. అయితే కేం‍ద్ర ప్రభుత్వం 2018-19 ద్రవ్యలోటు లక్ష్యానికి పరిధిలోనే ఉండాలని భావిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రానున్న కాలంలో జీఎస్‌టీ పన్ను వసూళ్ల మీద అ అంశం ఎక్కువగా ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
మార్కెట్‌ స్వల్ప కాలంలో ఎలా ఉంటుందో చెప్పడం కష్టమని గౌరవ్‌ దువా తెలిపారు. అయితే చరిత్రను పరిశీలిస్తే.. నిఫ్టీ, సెన్సెక్స్‌ బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌లు గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి 10-12 శాతం మేర కరెక‌్షన్‌కు గురయ్యాయని తెలిపారు. 2015లో ఫెడ్‌ దశాబ్ద కాలంలోనే తొలి సారి రేట్ల పెంచినప్పుడు, 2016లో డీమోనిటైజేషన్‌, 2018లో అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు తలెత్తినప్పుటికీ ఇదే ట్రెండ్‌ ఉందని గుర్తుచేశారు. అందువల్ల నిఫ్టీ ఎప్పటికీ 10,000 పాయింట్ల దిగువకు పడిపోదని స్పష్టం చేశారు. 
ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్‌ బలోపేతం వల్ల రూపాయి ప్రధానంగా క్షీణించిందని గౌరవ్‌ దువా పేర్కొన్నారు. అందువల్ల రూపాయిపై ఒత్తిడి నెలకొని ఉందని తెలిపారు. సమీప కాలంలో ఇదే ట్రెండ్‌ కొనసాగవచ్చని అంచనా వేశారు. దీనివల్ల ఈక్విటీ మార్కెట్ల పెరుగుదల పరిమితంగా ఉంటుందని పేర్కొన్నారు. 
కన్సూమర్‌ డిస్క్రీషనరీ, ఐటీ సర్వీసెస్‌, ఫార్మా స్టాక్స్‌పై ఓవర్‌వెయిట్‌తో ఉండొచ్చని గౌరవ్‌ దువా సిఫార్సు చేశారు. కార్పొరేట్‌ లెండింగ్‌ బ్యాంక్స్‌ షేర్లలోనూ పొజిషన్లను తీసుకోవచ్చని తెలిపారు. వ్యాల్యుయేషన్స్‌తో సంబంధం లేకుండానే ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలపై పాజిటివ్‌గా ఉన్నామని పేర్కొన్నారు. 



You may be interested

చక్కెర షేర్లకు సీసీఐ చేదు వార్త..!

Friday 21st September 2018

ముంబై:- కేంద్రం ఇథనాల్‌ ధర పెంపు కారణంగా గతవారంలో స్వీట్‌ ర్యాలీ చేసిన చక్కెర షేర్లకు కాంపీటీషన్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలకు ఇథనాల్‌ సరఫరా చేసే విషయంలో చక్కెర సంఘాలతో కుమ్మక్కుకావడంతో 18 చక్కెర మిల్లులపై రూ.38 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు సీసీఐ గురువారం తెలిపింది. ఈ కుమ్మక్కులో అధిక పాత్ర ఉన్న బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌ కంపెనీ మొత్తం జరిమానాలో రూ.12.35

స్వల్పకాలానికి నిపుణుల సిఫార్సులు

Friday 21st September 2018

దేశీయ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వల్పకాలం కోసం ప్రముఖ బ్రోకరేజ్‌ నిపుణులు కొన్ని సిఫార్సులు అందిస్తున్నారు. చార్ట్‌ అడ్వైజ్‌ సీకే నారాయణ రికమండేషన్లు:  - గెయిల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 397. స్టాప్‌లాస్‌ రూ. 378. - ఎస్కార్ట్స్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 710. స్టాప్‌లాస్‌ రూ. 738. కునాల్‌ బాత్ర రికమండేషన్లు: - జేఎస్‌డబ్ల్యు స్టీల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 430. స్టాప్‌లాస్‌ రూ. 408. - బలరామ్‌పూర్‌ చిని: కొనొచ్చు. టార్గెట్‌

Most from this category