News


ఈసారి దీపావళికి మార్కెట్‌ ఎటూ..?

Wednesday 31st October 2018
Markets_main1540975710.png-21615

- గడిచిన 10 ఏళ్లలో 5 సార్లు మాత్రమే లాభాలు
- అక్టోబర్‌ 2011 దీపావళి నెలలోనే అత్యధికంగా 10 శాతం రాబడి

ముంబై: మార్కెట్‌ పరంగా దీపావళీ అంటే అదో సెంటిమెంట్‌. లక్ష్మీదేవి కటాక్షం కోరుతూ ప్రత్యేక పూజలు జరిగే సందర్భం. పలు ప్రాంతాలలో కొత్త పుస్తకాలతో వ్యాపారం మొదలయ్యే ఈరోజును అనేక మంది ఇన్వెస్టర్లు నూతన సంవత్సరంగా కూడా భావిస్తుంటారు. ఇంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి దీపావళి సమయంలో ఈసారి ఇన్వెస్టర్లు లాభాలను కళ్ల చూస్తారా అంటే, ఇందుకు సమాధానం అటూ ఇటుగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే, గడిచిన 10 ఏళ్లలో కేవలం 5 సార్లు మాత్రమే దీపావళి నెలలో లాభాలు వచ్చాయి కనుక. ఐదు సార్లు లాభాలు వచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా లాభాలే వస్తాయా.. లేదంటే, 5 సార్లు నష్టాలను ఇచ్చాయి కదా అని ఈసారి పండుగ నెలలో కూడా నష్టాలే మిగులుతాయా? అనే విషయంపై ఎన్నికల అంశమే త్వరలో క్లారిటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

 

గడిచిన 10 దిపావళి నెలల్లో మార్కెట్‌ రాబడి

దీపావళి నెల   రాబడి శాతం (వృ/క్షీ)
అక్టోబర్‌ 2008 -25.03
అక్టోబర్‌ 2009 -7.23
నవంబర్‌ 2010  -4.10
అక్టోబర్‌ 2011 9.62
నవంబర్‌ 2012  4.19
నవంబర్‌ 2013 0.00
అక్టోబర్‌ 2014 4.88
నవంబర్‌ 2015  -1.56
అక్టోబర్‌ 2016  -1.11
అక్టోబర్‌ 2017 5.45


రానున్నది రాష్ట్రాల ఎన్నికలు, సాధారణ ఎలక్షన్స్‌ సమయం కావడం వల్ల ఈ అంశమే మార్కెట్‌కు సమీపకాలంలో అత్యంత కీలకం కానుందని యాక్సిస్‌ డైరెక్ట్‌ పేర్కొంది. ఎన్నికల అంశం ఆధారంగానే 2018 దీపావళి నెల రాబడి ఇస్తుందా? లేదంటే, నష్టాలనే మిగులుస్తుందా అనేది నిర్ణయం అవుతుందని వ్యాఖ్యానించింది. కరెక్షన్‌ సమయంలో మంచి యాజమాన్యం కలిగిన కంపెనీల షేర్లను కొనుగోలు చేయవచ్చని సూచించింది. దీర్ఘకాలంలో మార్కెట్లు మంచి లాభాలను ఇస్తాయని భావిస్తున్నట్లు వెల్లడించింది. 

వచ్చే ఏడాది దీపావళి నిఫ్టీ టార్గెట్‌ 15,000 పాయింట్లు..
ప్రస్తుతం కొనసాగుతున్న కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ మార్కెట్‌కు సానుకూలంగా ఉండనుందని భావిస్తున్నట్లు ఇండియ‌న్ ఇన్ఫోలైన్ లిమిటెడ్‌(ఐఐఎఫ్ఎల్‌) వెల్లడించింది. వచ్చే మూడేళ్లలో ఎర్నింగ్స్‌ వృద్ధిరేటు 30 శాతం ఉంటుందన్న అంచనా ఆధారంగా వచ్చే ఏడాది దీపావళి నాటికి నిఫ్టీ టార్గెట్‌ 15,000 పాయింట్లుగా అంచనా వేసినట్లు సంస్థ అనలిస్ట్‌ సంజీవ్ భాసిన్ తెలిపారు.
 

 You may be interested

టాటా మోటార్స్‌ నష్టం రూ. 1,049 కోట్లు

Wednesday 31st October 2018

 టాటా గ్రూప్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ తాజాగా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,049 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో క్యూ1లో ప్రకటించిన రూ. 1,800 కోట్ల నష్టంకంటే ఇది తక్కువ. కాగా గతేడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో కంపెనీ రూ. 2,483 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీకి చెందిన యూరప్‌ సబ్సిడరీ జాగ్వర్‌ లాండ్‌రోవర్‌ (జెఎల్‌ఆర్‌) కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నష్టాల్లోకి

ఆర్‌బీఐ స్వతంత్రతను గౌరవిస్తాం: కేంద్రం

Wednesday 31st October 2018

ఆర్‌బీఐ, కేంద్రం మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కేంద్రం వ్యవహారశైలితో  విసుగు చెందుతున్న ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయవచ్చన్న వార్తలు సైతం వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం కేంద్రం హుటాహుటిన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆర్‌బీఐకి గల స్వతంత్ర ప్రతిపత్తి గౌరస్తాం. నియమ నిబంధనలకు లోబడి ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి విఘాతం కలగనీయం’’ అని తెలిపింది. కొన్ని

Most from this category