STOCKS

News


షేర్‌ఖాన్‌ దిపావళీ స్టాక్స్‌

Wednesday 24th October 2018
Markets_main1540362123.png-21438

దీపావళి వస్తోందంటే ప్రముఖ బోకరేజీ సంస్థల నుంచి స్టాక్స్‌ సిఫారసుల మోత మోగిపోతుంటుంది. రానున్న ఏడాది కాలంలో మంచి రాబడులకు అవకాశం ఉన్న స్టాక్స్‌ జాబితాను అవి ప్రకటిస్తుంటాయి. అన్నీ సక్సెస్‌ అవుతాయన్న నమ్మకం అయితే లేదు... కానీ, ఆయా సిఫారసుల్లోని మంచి స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవడం ఇన్వెస్టర్లు చేయాల్సిన అసలైన పని. షేర్‌ఖాన్‌ ఈ సారి అందరికంటే ముందే సంవత్‌ 2075 పేరుతో స్టాక్స్‌ జాబితాను ప్రకటించేసింది. నిజానికి 2017 మార్కెట్‌ ర్యాలీ సమయంలో ఇన్వెస్టర్లు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వకుండా తక్కువ నాణ్యత కలిగిన వాటి వెంట పడ్డారు. కానీ, రాబడులకు కంపెనీల నాణ్యతే కీలకమైనదన్న అంశాన్ని మర్చిపోవద్దు. అయితే, గతానికి, 2018 దీపావళికి కొంచెం వ్యత్యాసం ఉంది. ఈ సారి స్టాక్స్‌ వ్యాల్యూషన్లు చాలా అందుబాటు, తక్కువ స్థాయిలకు చేరాయి. మంచి నాణ్యమైన స్టాక్స్‌ను తక్కువ ధరల్లోనే సొంతం చేసుకునే అవకాశం ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఉండడం గమనార్హం. మంచి వృద్ధి అవకాశాలు, పారదర్శకమైన యాజమాన్యం, తక్కువ విలువల వద్ద ఉన్న వాటినే ఎంచుకోవాలన్న అంశాన్ని మర్చిపోరాదు. 

ఆర్తి ఇండస్ట్రీస్‌

ప్రముఖ ఫార్మా, స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ. పదేళ్ల కాలానికి రూ.4,000 కోట్లు, 20 ఏళ్ల కాలానికి రూ.10,000 కోట్లతో అంతర్జాతీయ క్లయింట్ల నుంచి రెండు ఆర్డర్లను సంపాదించుకుంది. చైనా నుంచి స్పెషాలిటీ కెమికల్స్‌ సరఫరా తగ్గిపోయిన నేపథ్యంలో కంపెనీకి కలసి రానుంది.

బ్రిటానియా ఇండస్ట్రీస్‌

రానున్న సంవత్సరాల్లో కంపెనీ రెండకెల వృద్ధి సాధిస్తుందని, అధిక మార్జిన్లతో కూడిన ఉత్పత్తులను విడుదల చేయనుందని షేర్‌ఖాన్‌ పేర్కొంది. కేక్‌లు, రస్క్‌లు తదితర విభాగంలోనూ మార్జిన్లను పెంచుకోనుందని తెలిపింది. 

దివిస్‌ ల్యాబ్స్‌

రూపాయి బలహీనత నేపథ్యంలో అంచనాల కంటే దివిస్‌ ల్యాబ్స్‌ వృద్ధి ఎక్కువగా ఉంటుందని షేర్‌ఖాన్‌ అంచనా వేస్తోంది. దీంతో రానున్న నెలల్లో కంపెనీ వ్యాల్యూషన్లు పలు రెట్లు పెరగొచ్చని పేర్కొంది. ఒకటి సామర్థ్య విస్తరణ, మరొకటి చైనా నుంచి అవకాశాలు రానుండడం దివిస్‌ ల్యాబ్స్‌కు కలిసొచ్చే అంశాలుగా తెలిపింది. 

ఐసీఐసీఐ బ్యాంకు

క్యాపిటల్‌ రిస్క్‌ అసెట్స్‌ రేషియో 18.3 శాతం ఉండడం, టైర్‌1 క్యాపిటల్‌ నిధులు 15.8 శాతంగా ఉండడంతో రిటైల్‌, కార్పొరేట్‌ రుణాల విభాగంలో కంపెనీకి విస్తృత అవకాశాలున్నాయని షేర్‌ఖాన్‌ పేర్కొంది. మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్లు 50.5 శాతంగా ఉండడం... నిధుల వ్యయాల పరంగా బ్యాంకుకు కలిసి వస్తుందని, నికర వడ్డీ మార్జిన్లకు దోహదపడతాయని షేర్‌ఖాన్‌ అంచనా వేస్తోంది.

జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌

దేశంలో అతిపెద్ద ఆహార సేవల సంస్థ. వినియోగదారుల సంతృప్తిని చూరగొనడంపై దృష్టి పెట్టింది. మరింత మెరుగైన, డబ్బుకు తగ్గ విలువైన ఉత్పత్తులను కస్టమర్లకు అందించాలన్నది కంపెనీ లక్ష్యం. విచక్షణారహిత ఖర్చు చేసే అలవాట్ల ద్వారా ప్రయోజనం పొందనుంది.

ఇంకా ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సుందరం ఫాస్ట్‌నర్స్‌, అరవింద్‌ స్టాక్స్‌ను షేర్‌ఖాన్‌ తన జాబితాలో పేర్కొంది. You may be interested

మంచి ‘ఫండ్స్‌’ ఎంపికకు వీటిని చూడాల్సిందే

Wednesday 24th October 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారి సంఖ్య ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. ముఖ్యంగా సిప్‌ మార్గంలోకి ఎక్కువ మంది అడుగుపెడుతున్నారు. మరి వందలాది ఫండ్స్‌ పథకాల్లో ఎంపిక ఆచితూచి ఉంటేనే, రాబడులు అంత మెరుగ్గా ఉంటాయని మర్చిపోవద్దు. ఎంత కాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తారు, పథకంలో ఉండే రిస్క్‌ స్థాయి ఇలా ఎన్నో అంశాలను చూడాల్సి ఉంటుంది.  పనితీరు, పోటీ పథకాలతో సమీక్ష ఓ పథకం రాబడులన్నవి... ప్రారంభ ఎన్‌ఏవీ ధర, ముగింపు

కొచర్‌కు క్లీన్‌చిట్‌ చెల్లదన్న ఐసీఐసీఐ బ్యాంకు

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూపునకు రుణం జారీ వెనుక ప్రయోజనం పొందారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటూ, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో పదవుల నుంచి తప్పుకున్న చందాకొచర్‌ విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమెపై వచ్చిన బంధుప్రీతి ఆరోపణల్లో ఏ మాత్రం సత్యం లేదంటూ 2016 డిసెంబర్‌లో క్లీన్‌చిట్‌ ఇచ్చిన న్యాయ సేవల సంస్థ సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌, తన నివేదికను ఉపసంహరించుకున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది.

Most from this category