STOCKS

News


ఈ 25 షేర్లు.. తారాజువ్వలు..!

Thursday 1st November 2018
Markets_main1541065222.png-21638

- పండుగ సీజన్‌లో పలు బ్రోకింగ్‌ సంస్థ సిఫార్సులు

దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు వర్తకులు బంపర్‌ ఆఫర్లను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఆఫర్ల వర్షం ఆన్‌లైన్‌ అంగళ్లు, రిటైల్‌ షోరూంలోనే కాదు.. దలాల్‌ స్ట్రీట్‌లోనూ కురుస్తోందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అరుణ్ తుక్రాల్ వ్యాఖ్యానించారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టీవ్ ధమాకా డేస్ మాదిరిగా స్టాక్‌ మార్కెట్‌లో ‘గ్రేట్‌ ఇండియన్‌ ఈక్విట్‌ సేల్‌’ ఉందని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆన్‌లైన్‌ కిరాణా ఆఫర్లు ముగిసిపోయినప్పటికీ.. ఈక్విట్‌ సేల్‌ ఆఫర్‌ కొనసాగుతోందని, ముహూరత్‌ ట్రేడింగ్ వరకు ఈ సదావకాశం ఉంటుందని సూచించారు. ఈ ఆఫర్‌ సమయంలో అశోక్ లేలాండ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మిండా ఇండస్ట్రీస్, మోల్డ్-టెక్ ప్యాకేజింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టీల్ స్ట్రిప్ వీల్స్, టైటాన్, ట్రైడెంట్ షేర్లను కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, పరాగ్ మిల్క్, కుమిన్స్‌, అపోలో హాస్పిటల్స్, ఎక్సైడ్, సైయంట్‌,, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హిందూస్తాన్ ఆయిల్, సన్‌ఫార్మా షేర్లను ఈ పండుగ సందర్భంగా సిఫార్సు చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. మరో బ్రోకింగ్‌ సంస్థ రెలిగేర్‌.. అశోక్ లేలాండ్, ఏషియన్‌ పెయింట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, కుమిన్స్‌ ఇండియా, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, మారుతి సుజుకి ఇండియా, వోల్టాస్ షేర్లను సిఫార్సు చేసింది. ఇక కరెన్సీ విలువ బలహీనపడిపోవడం, ముడిచమురు ధరలు గరిష్టస్థాయిలకు చేరుకోవడం వంటి ప్రతికూల అంశాల ప్రభావం తగ్గుతుండడం అనేది ప్రస్తుత మార్కెట్‌లో సానుకూల అంశంగా పరిగణలోనికి తీసుకోవచ్చని ఇన్వెస్కో ఈక్విటీస్ సీఐఓ తాహెర్ బాద్‌షా అన్నారు. ‘ఆగస్టు చివరి వారం నుంచి కొనసాగుతున్న భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టీ వాల్యూయేషన్‌ 24.65 వద్దకు పడిపోయింది. ఐదేళ్ల సగటు స్థాయి అయిన 22.82 వద్దకు సమీపించింది. జీవితకాల గరిష్టస్థాయి నుంచి ప్రధాన సూచీలు 10 శాతం పడిపోయాయి. బీఎస్‌ఈ500 జాబితాలో 282 షేర్లు అక్టోబర్‌ చివరి నాటికి పరిశ్రమ పిఈ కంటే దిగువన ట్రేడవుతున్నాయి. అయితే, దీని అర్థం ఈ షేర్లను వెంటనే కొనుగోలు చేయమని మాత్రం కాదు. నిపుణుల సూచనలు, కంపెనీ పనితీరు ఆధారంగా వీటిలో ఎంపికచేసిన షేర్లను కొనుగోలు చేయవచ్చు. బాటా ఇండియా, మహీంద్రా హాలిడేస్‌, వీఏ టెక్, జస్ట్ డయల్, అజంతా ఫార్మా, నాట్కో ఫార్మా, గ్రాన్యుల్స్ ఇండియా, కోల్గేట్-పామోలివ్, అశోక్ లేలాండ్, డీసీఎం శ్రీరామ్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ర్యాలీస్‌ ఇండియా, కావేరీ సీడ్ షేర్లు ఇండస్ట్రీ పీఈ సగటు కంటే తక్కువ పీఈ వద్ద కొనసాగుతున్నాయి.’ అని వ్యాఖ్యానించారు. 

ఇవి కేవలం మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన. You may be interested

మార్కెట్‌కు అండగా మెటల్‌ షేర్లు

Thursday 1st November 2018

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ అనంతంరం స్తబ్దుగా ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌ షేర్ల ర్యాలీ మార్కెట్‌ పతనాన్ని అడ్డుకుంటుంది. నేటి ఇంట్రాడేలో ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2.50శాతం ర్యాలీ చేసి 3,351.65 గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యహ్నం గం.2:45ని.లకు 2శాతం లాభంతో 3,341.95 ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి మెటల్‌ సూచీలో భాగమైన మొత్తం 13 షేర్లలో 11 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా 2 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

ముహూరత్‌ ట్రేడింగ్ టాప్‌ పిక్స్‌ ఇవే..

Thursday 1st November 2018

- దీపావళి రోజున 5 షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసిన దీపాన్ మెహతా - థామస్ కుక్, క్యాపిటల్ ఫస్ట్, డెల్టా కార్ప్, టాటా ఎలాక్సీ, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు ముంబై: స్థూల ఆర్థిక అంశాలు గాడిలోపడి, రాజకీయ అనిశ్చితులకు పరిష్కార మార్గం లభించిన తరువాత.. ర్యాలీలో ఉండనున్న షేర్లలో ఎంపిక చేసిన స్మాల్‌, మిడ్‌క్యాప్‌లు నిలవనున్నాయని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సభ్యుడు దీపాన్ మెహతా వ్యాఖ్యానించారు. ఈ

Most from this category