STOCKS

News


పటిష్ట క్యూ2 ఫలితాలతో దివీస్‌ దూకుడు..!

Monday 29th October 2018
Markets_main1540807280.png-21565

క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో పటిష్ట ఫలితాలను సాధించడంతో  దివీస్‌ లేబొరేటరీస్‌ షేరు సోమవారం ఇంట్రాడేలో 52వారాల గరిష్టానికి చేరుకుంది. ఈ క్యూ2లో రూ.398 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో నికరలాభం రూ.రూ. 207 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1285 కోట్లను సాధించింది. ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేయడంతో యాక్సిస్‌ క్యాపిటల్‌, ఈక్వెరస్‌ లాంటి బ్రోకరేజ్‌ సంస్థలు షేరు టార్గెట్‌ ధరను పెంచాయి. ఈ సానుకూల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేరు కొనుగోలుకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు బీఎస్‌ఈలో 16శాతం లాభపడి రూ.1450.40 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గత ముగింపు ధర (రూ.1253.9)తో పోలిస్తే 15శాతం లాభంతో రూ.1444 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ 851.00లు రూ.1450.40లుగా నమోదయ్యాయి.



You may be interested

క్యు2 ఎర్నింగ్స్‌ ఎలా ఉన్నాయ్‌?

Monday 29th October 2018

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల విశ్లేషణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీలు మిశ్రమ ఫలితాలు ప్రకటించాయి. - ఇప్పటివరకు నిఫ్టీ 50లో 27 కంపెనీలు క్యు2 రిజల్ట్స్‌ వెలువరించాయి. - ఇందులో 16 కంపెనీల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండగా ఐదు కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించాయి. - ఆరు కంపెనీలు పేలవ ఫలితాలిచ్చాయి. ఈ దఫా అంచనాలను అందుకోని ఫలితాలు ప్రకటించినవాటిలో ఫైనాన్షియల్‌ సేవల రంగాలకు చెందిన

ఐసీఐసీఐ బ్యాంక్‌పై ఎలాంటి వ్యూహం అనుసరించాలి?

Monday 29th October 2018

సోమవారం ట్రేడింగ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు దాదాపు 9 శాతం దూసుకుపోయింది. బ్యాంకు క్యు2 ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో కొనుగోళ్లు పెరిగాయి. బ్యాంకు ఆస్తుల నాణ్యత ఈ త్రైమాసికంలో మెరుగుపడింది. జీఎన్‌పీఏలు 8.54 శాతానికి దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు బ్యాంకు షేరుపై ఎలాంటి సిఫార్సులు చేస్తున్నాయో చూద్దాం... 1. మోర్గాన్‌ స్టాన్లీ: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 460. కీలక పీపీఓపీ వృద్ది కొనసాగిస్తోంది. ఎన్‌ఐఎంలు విస్తరించడం

Most from this category