STOCKS

News


ఆటుపోట్లలో డివిడెండ్‌ ఇచ్చే స్టాక్స్‌ నయం

Monday 22nd October 2018
Markets_main1540148141.png-21333

ఈ ఏడాది మొదట్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లలో మొదలైన అస్థిరతలు కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల వరకు మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగొచ్చని అత్యధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌ అస్థిరతల్లో వాటాదారులకు డివిడెండ్‌ ఎక్కువగా పంచే స్టాక్స్‌ మెరుగైన ఆప్షన్‌ అన్నది తెలిసిందే. కనుక మరోసారి డివిడెండ్‌ ఈల్డ్‌ ఎక్కువగా ఉన్న స్టాక్స్‌పై దృష్టి సారించేందుకు అనువైన సమయంగా కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. 

 

ఆటుపోట్లతో కూడిన మార్కెట్లలో పోర్ట్‌ఫోలియోకు రక్షణ అవసరమని, పోర్ట్‌ఫోలియోలో 15-20 శాతాన్ని మించకుండా అధిక డివిడెండ్‌ చెల్లింపులు కలిగిన, మంచి వ్యాపారాలతో కూడిన కంపెనీలకు కేటాయించుకోవచ్చని 5నాన్స్‌ వ్యవస్థాపకుడు దినేష్‌రోహిరా సూచించారు. మార్కెట్‌ పరిస్థితులతో సంబంధం లేకుండా రాబడి అందుకోవచ్చన్నారు. అయితే, ఇది గ్యారంటీ కాదన్నదీ గుర్తుంచుకోవాలన్నారు. అందుకే దీర్ఘకాల దృష్టితో, బలమైన ఫండమెంటల్స్‌ కలిగిన వాటినే పోర్ట్‌ఫోలియోకు యాడ్‌ చేసుకోవాలని సూచించారు. 

గత ఐదేళ్లలో సెన్సెక్స్‌ ఏటా 12.6 శాతం చొప్పున వృద్ధి చెందిందని, అదే సమయంలో డివిడెండ్‌ను తిరిగి ఇన్వెస్ట్‌ చేయడం వల్ల 14.1 శాతం రాబడులు వచ్చేవన్నది కార్వీ విశ్లేషణ. ‘‘ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బ్యాంకు ఎఫ్‌డీలపై రాబడి 6-7 శాతం మధ్య ఉంది. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారు అధిక డివిడెండ్‌ ఈల్డ్‌ కలిగిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని మేం సూచిస్తున్నాం. అధిక డివిడెండ్‌ ఈల్డ్‌ కలిగిన 10 స్టాక్స్‌తో జాబితాను అందిస్తున్నాం’’ అని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ తన నివేదికలో పేర్కొంది. జీఐసీఆర్‌ఈ, గ్రాఫైట్‌ ఇండియా, ఐవోసీ, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, మనప్పురం ఫైనాన్స్‌, ఎన్‌హెచ్‌పీసీ, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు, సన్‌టీవీ నెట్‌వర్క్‌, వేదాంత లిమిటెడ్‌ను కార్వీ తన జాబితాలో పేర్కొంది. 

‘‘ఓ కంపెనీకి ఓ ఏడాది రూ.100 కోట్ల లాభం వస్తే అందులో రూ.40 కోట్లను డివిడెండ్‌గా ఇస్తే అది 40 శాతం డివిడెండ్‌ పే అవుట్‌ రేషియో అవుతుంది. డివిడెండ్‌ ఈల్డ్‌ అన్నది పెట్టుబడి విలువపై వచ్చే డివిడెండ్‌ శాతం. దీన్ని అధిక ఈల్డ్‌, తక్కువ ఈల్డ్‌గా పేర్కొంటారు. అధిక ఈల్డ్‌ స్టాక్‌ అంటే ఉదాహరణకు ఐటీసీ. లాభాల్లో గణనీయంగా తిరిగి వాటాదారులకు చెల్లిస్తుంది. ఇది ఆదాయాన్నిచ్చే స్టాక్‌. తక్కువ ఈల్డ్‌ అంటే తక్కువ డివిడెండ్‌ ఇచ్చి, మిగిలిన దాంట్లో అధిక భాగం విస్తరణ, వ్యాపార వృద్ధి కోసం వినియోగించేవి. రిస్క్‌ తీసుకునే వారు అయితే, అధిక డివిడెండ్‌ చెల్లింపు రేషియో ఉన్న వాటిపై దృష్టి సారించొచ్చు. సంప్రదాయ విధానాన్ని అనుసరించే వారు అధిక ఈల్డ్‌, అధిక డివిడెండ్‌ పేఅవుట్‌ రేషియో ఉన్న స్టాక్స్‌ను పరిశీలించొచ్చు’’ అని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫానదీ పేర్కొన్నారు.You may be interested

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Monday 22nd October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:46 సమయంలో 22 పాయింట్ల లాభంతో 10,347 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,303 పాయింట్లతో పోలిస్తే 44 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక

ఈ మూడు స్టాక్స్‌పై కన్నేయండి!

Monday 22nd October 2018

మధ్యస్థం నుంచి దీర్ఘకాలానికి మంచి రాబడులకు అవకాశం ఉన్న మూడు స్టాక్స్‌ను ఈక్విటీ99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బల్గియాన్‌ సూచించారు.   అమరజ్యోతి స్పిన్నింగ్‌ మిల్స్‌ తిరుపూర్‌ మార్కెట్‌కు మెలాంజ్‌ యార్న్‌ను సరఫరా చేసే అతిపెద్ద కంపెనీ ఇది. డైడ్‌ ఫైబర్‌ యార్న్‌, డైడ్‌ కాటన్‌ యార్న్‌, పీసీ యార్న్‌ రూపంలో మార్కెట్‌ వాటాను పెంచుకుంటోంది. మొదటి త్రైమాసికంలో మంచి ఫలితాలను ప్రకటించింది. విక్రయాలు 7.4 శాతం, నికర లాభం 24 శాతం పెరిగాయి. ఈక్విటీ

Most from this category