STOCKS

News


అనిశ్చిత పరిస్థితుల్లో ఆదుకునే స్టాక్స్‌!

Friday 5th April 2019
Markets_main1554486080.png-24992

సెన్సెక్స్‌, నిఫ్టీ రికార్డు గరిష్ట స్థాయిలకు చేరాయి. మార్కెట్లు నూతన గరిష్ట స్థాయిలకు చేరినప్పుడల్లా అధిక బీటా స్టాక్స్‌ ముందుగా ర్యాలీ చేస్తాయి. కనుక ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో ఈ తరహా స్టాక్స్‌ మాత్రమే కాకుండా, మంచి డివిడెండ్‌ ఇచ్చే కంపెనీలను కూడా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లలో అస్థిరతలు పెరిగిన సమయంలో ఇవి పెట్టుబడుల పరంగా కాస్త సురక్షితంగా నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్లు ఎప్పుడూ గరిష్టాల్లోనే ట్రేడ్‌ కావన్నది అందరికీ తెలిసిందే. మరి మార్కెట్‌ పతనాల్లో డివిడెండ్‌ రావడం వల్ల నష్టాలు పరిమితం అవుతాయన్నది గుర్తు పెట్టుకోవాలి. డివిడెండ్‌ అన్నది కంపెనీలు ఆర్జించే లాభంలో ఒక భాగం. లాభాల్లోంచి కొంత మొత్తాన్ని ప్రతీ షేరుకు ఇంత చొప్పున కంపెనీలు ఏటా పంపిణీ చేస్తుంటాయి. డివిడెండ్‌ రూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల ఆదాయం వచ్చినా పన్ను చెల్లించక్కర్లేదు. ఇదొక అదనపు ప్రయోజనం. 

 

ఇలా డివిడెండ్‌ పంపిణీ చేసే కంపెనీలు మంచి వ్యాపార నమూనా, పటిష్టమైన బ్యాలన్స్‌ షీటు, అధిక మార్కెట్‌ వాటా, సంబంధిత రంగంలో దీర్ఘకాలంగా ఉన్నవి అయితే మంచిది. ‘‘పెట్టుబడి వృద్ధికి అదనంగా డివిడెండ్‌ రావడం అన్నది మొత్తం రాబడుల్లో ఒక భాగం. దీర్ఘకాలంలో పోర్ట్‌ఫోలియో కాంపౌండ్‌ అవ్వాలంటే ఇది తప్పనిసరి’’ అని 5నాన్స్‌ సీఈవో దినేష్‌ రోహిరా పేర్కొన్నారు. ఈక్విటీలకు సహజంగా స్వల్పకాలంలో ఆటుపోట్ల రిస్క్‌ ఉంటుందని, వృద్ధి, డివిడెండ్‌ చెల్లించే స్టాక్స్‌తో కూడిన వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో ఉండడం మంచి స్ట్రాటజీగా తెలిపారు. 

 

ఐడీబీఐ టాప్‌ 10 స్టాక్స్‌
ఐడీబీఐ అధిక డివిడెండ్‌ ఈల్డ్‌తో కూడిన స్టాక్స్‌తో ఓ జాబితా రూపొందించింది. అందులో కోల్‌ ఇండియా, అసెల్యా కాలే సొల్యూషన్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌, వీఎస్‌టీ టిల్లర్స్‌ ట్రాక్టర్స్‌, హీరో మోటోకార్ప్‌, స్వరాజ్‌ ఇంజన్స్‌, సొనాటా సాఫ్ట్‌వేర్‌, క్యాస్ట్రాల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, హిందుస్తాన్‌జింక్‌, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌, కేర్‌ రేటింగ్స్‌, భారత్‌ డైనమిక్స్‌ ఉన్నాయి. 

 

క్రమం తప్పకుండా డివిడెండ్‌ చెల్లించే మంచి పేరున్న కంపెనీలను తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాలని, తమ మొత్తం పెట్టుబడుల్లో 25 శాతాన్ని అధిక డివిడెండ్‌ ఇచ్చే కంపెనీలకు కేటాయించుకోవాలన్నది నిపుణుల సూచన. పెట్టుబడుల వృద్ధిని ఊహించలేము కానీ, డివిడెండ్‌ చెల్లింపులను అంచనా వేయవచ్చన్నది గుర్తు చేస్తున్నారు. ‘‘అధిక వృద్ధి రేటు ఉండే స్టాక్స్‌కు ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తారు. కానీ, ఇన్వెస్టర్లకు బ్యాలన్స్‌డ్‌ పోర్ట్‌ఫోలియో అవసరం. అధిక డివిడెండ్‌ చెల్లించే కంపెనీ వాటాలను కొనుగోలు చేసే ముందు, కన్సాలిడేటెడ్‌ రుణ భారం ఎంతుందో తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసనుకోవాలి’’ అని ఫెయిర్‌వెల్త్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌హెడ్‌ ప్రకాష్‌ పాండే సూచించారు. 

 

దీర్ఘకాలంలో చక్కని డివిడెండ్‌ చెల్లింపుల రికార్డును పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగే, కంపెనీ ఫండమెంటల్స్‌ కూడా బలంగా ఉన్నాయా అని చెక్‌ చేసుకోవాలి. కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, ఐవోసీ తదితర కంపెనీలను దినేష్‌ రోహిరా సూచించారు. ఫెయిర్‌వెల్త్‌ సెక్యూరిటీస్‌కు చెందిన పాండే.. ఇన్ఫోసిస్‌, హీరో మోటోకార్ప్‌, కోల్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ, ఆర్‌ఈసీ, క్యాస్టా‍్రల్‌ను సూచించారు. You may be interested

టెలికం కంపెనీల నుంచి మంచి ఫలితాలు!?

Saturday 6th April 2019

క్యు4పై బ్రోకరేజ్‌ల అంచనాలు దాదాపు 11 నెలల తర్వాత తొలిసారి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ రెవెన్యూలు గణనీయమైన వృద్ధి నమోదు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మినిమం రిచార్జ్‌ ప్లాన్లు, అధిక వాయిస్‌, డేటా ప్యాక్‌ల విక్రయాల్లో జోరు.. టెల్కోలకు క్యు4లో కలిసివస్తాయని అంచనా. ఆరంభం నుంచి అదరగొడుతున్న జియో ఇన్ఫోకామ్‌ ఎప్పటిలాగే ముందంజలో ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. జియో ఆరంభించిన ధరల యుద్ధంతో కుదేలైన ఇతర

స్మాల్‌క్యాప్స్‌ ఇప్పటికీ బేర్‌ గుప్పిట్లోనే!?

Friday 5th April 2019

ఈక్విటీ మార్కెట్లలో 27 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.15 లక్షల కోట్ల మేర పెరిగింది. కానీ, రిటైల్‌ ఇన్వెస్టర్లు పెద్దగా సంపాదించింది లేదు. కారణం... స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఇప్పటికీ కనిష్ట ‍స్థాయిల నుంచి చూస్తే పెద్దగా పుంజుకున్నది లేదు. రిటైల్‌ ఇన్వెస్టర్లు అంటే మార్కెట్‌ పరిభాషలో ఒక కంపెనీలో రూ.2 లక్షల కంటే తక్కువ పెట్టుబడి ఉన్న వారు.    897 కంపెనీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లకు 20 శాతానికి పైనే వాటాలు ఉన్నాయి.

Most from this category