STOCKS

News


డివిడెండ్‌ తారలు... ఈ షేర్లు

Thursday 13th December 2018
Markets_main1544641752.png-22870

డివిడెండ్‌ అనేది ఈక్విటీ ఇన్వెస్టర్లకు అదనపు ఆదాయ వనరు. కొన్న తర్వాత స్టాక్‌ ధర పెరిగితే అది పెట్టుబడిపై లాభం. చాలా మంది దీనిపైనే దృష్టి పెడుతుంటారు. కానీ, స్టాక్స్‌పై వచ్చే డివిడెండ్‌ ఆదాయం గురించి పట్టించుకోరు. దీన్ని బోనస్‌ లాభంగా భావించాల్సి ఉంటుంది. తమ లాభాల నుంచి కంపెనీలు కొంత వాటాను షేరు వారీగా డివిడెండ్‌ రూపంలో పంచుతుంటాయి. కొన్ని కంపెనీలు అసలు డివిడెండ్‌ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించవు. కొన్ని మోస్తరుగా ఇస్తుంటాయి. కానీ, కొన్ని కంపెనీలు  లాభాల్లో సగం మొత్తాన్ని కూడా డివిడెండ్‌ రూపంలో తమ వాటాదారులకు పంచుతుంటాయి. కొన్ని కంపెనీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేసిన వారికి దానికి మంచి డివిడెండ్‌ ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గత ఐదేళ్లుగా డివిడెండ్‌ పంపిణీ మొత్తాన్ని పెంచుతూ వెళుతున్న కంపెనీలను చూసినట్టయితే...

 

బాల్మర్‌ లావ్రీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థ 2018లో షేరువారీగా ఇచ్చిన డివిడెండ్‌ రూ.24. ఈ షేరు తాజా ధర రూ. 395.35. సొనాటా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కూడా షేరు వారీగా ఈ ఏడాది రూ.10.5ను వాటాదారులకు పంచింది. ఈ కంపెనీ షేరు ధర రూ.318.05. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ కూడా ఒక్కో షేరుకు రూ.9.5ను డివిడెండ్‌ కింద పంపిణీ చేసింది. ఈ స్టాక్‌ ధర రూ. 296.60. హిందుస్తాన్‌ జింక్‌ ఒక్కో షేరుకు ఇచ్చిన డివిడెండ్‌ రూ.8. ఈ స్టాక్‌ ధర రూ. 274.70. డీసీఎం శ్రీరామ్‌ ఇండస్ట్రీస్‌ కూడా షేరు ఒక్కింటికీ రూ.8.2ను డివిడెండ్‌గా పంచింది. ఈ స్టాక్‌ ధర రూ.192.85. గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ కంపెనీ ఈ ఏడాది షేరు ఒక్కింటికీ ఇచ్చిన డివిడెండ్‌ రూ.15. ఈ స్టాక్‌ ధర రూ. 774.70. వీటితోపాటు గత ఐదేళ్లుగా డివిడెండ్‌ పంపిణీ మొత్తాన్ని ఏటేటా పెంచిన కంపెనీలను గమనిస్తే... రెడింగ్టన్‌, ట్రిడెంట్‌, క్రిసిల్‌, ఎన్‌బీసీసీ, జమ్నా ఆటో, ఏపీఎల్‌ అపోలో, మారుతి సుజుకి, గ్రాన్యూల్స్‌ ఇండియా, సుందరం ఫైనాన్స్‌, వోల్టాస్‌, లక్ష్మి మెషిన్‌ వర్క్స్‌, గుజరాత్‌ గ్యాస్‌, బెర్జర్‌ పెయింట్స్‌, సోలార్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌, ఇగార్షి మోటార్స్‌ తదితర కంపెనీలు ఉన్నాయి. 



You may be interested

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 13th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 48 పాయింట్ల లాభంతో 10,836 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,783 పాయింట్లతో పోలిస్తే 53 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక

ఈ స్థాయిలో మార్కెట్లు కన్సాలిడేషన్‌: జెమ్‌స్టోన్‌ ఈక్విటీ

Thursday 13th December 2018

నిఫ్టీ బుధవారం మరోసారి కీలకమైన 200 డీఎంఏ 10,752 సమీపంలోకి చేరుకుంది. రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ విజయాన్ని గ్రహించి ఫలితాల ముందు రోజే భారీగా క్రాష్‌ అయిన మార్కెట్లు, ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నిష్క్రమణను, బీజేపీ ఓటమిని జీర్ణించుకుని రెండు రోజుల్లో ఏకంగా 440 పాయింట్ల మేర ర్యాలీ చేసింది. ఇక ఈ స్థాయిలో కాస్త ఊపిరి పీల్చుకుని, నిలదొక్కుకోవచ్చని  జెమ్‌స్టోన్‌ ఈక్విటీ అండ్‌ రీసెర్చ్‌ టెక్నికల్‌

Most from this category