STOCKS

News


పబ్లిక్‌ వాటా పెంపు నిబంధన అమలు కష్టమే: సెబి

Friday 19th July 2019
Markets_main1563533563.png-27190

తాజా బడ్జెట్లో తీసుకున్న ప్రతిపాదనల వలన తమ పాత్ర తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అభిప్రాయపడింది. నిధుల కోసం ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ... కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను సెబి అమలుచేయడం కష్టమని సెబి అధికారి ఒకరు చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలే కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ను 25 శాతానికి పెంచాల్సిన నిబంధనను ఇప్పటికి వరకు అమలు చేయలేకపోయాయని ఆయన అన్నారు.

ఆర్థిక స్వాతంత్రం సెబీకి అవసరం..
నిధుల కోసం సెబీ ప్రభుత్వంపై ఆధారపడవలసి ఉండడంతో పీఎస్‌యూలు...సెబి నిర్ణయాధికారాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అన్నారు.  రెగ్యులేటర్ తన మిగులు నిధులను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా (సిఎఫ్ఐ) కు బదిలీ చేయవలసి ఉంటుందని, దీని వార్షిక మూలధన వ్యయ ప్రణాళికలకు ముందస్తు ప్రభుత్వ అనుమతి కూడా అవసరమని జులై 5 న ప్రకటించిన బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుత పబ్లిక్‌ హోల్డింగ్‌ స్థాయిలను కూడా అందుకోలేదని ఇలాంటి పరిస్థితుల్లో షేరు హోల్డింగ్‌ ప్రతిపాదనను అమలు చేయడంలో సెబీ ఇబ్బందులు పడవచ్చని విశ్లేషకులు తెలిపారు. ‘ప్రభుత్వంతో సత్సంబంధాల కోసం నియంత్రణ సంస్థల ఆర్థిక స్వాతంత్రం చాలా అవసరం’ అని సెబీ అధికారి తెలిపారు.     ‘నమోదైన ప్రభుత్వ రంగ సంస్థలలో  ప్రభుత్వ, ఇతర ప్రతినిధుల ఉనికిని ప్రభావితం చేయకుండా నియంత్రణ సమ్మతిని అమలు చేయడానికి ఇది చాలా అవసరం’ అని అన్నారు. 

అది నిబంధనలకు విరుధ్దం..
పంజాబ్ నేషనల్ బ్యాంక్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్‌లతో పాటు మొత్తం 31 పీఎస్‌యూలు ఇప్పటి వరకు 25 శాతం కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ నిబంధనను పాటించడం లేదు. సెబీ మిగులు నిధులను బదిలీ చేయడం, ముందస్తు ప్రభుత్వ అనుమతి అవసరం అనే ప్రతిపాదనలు నియంత్రణ సంస్థ ఆర్థిక స్వయంప్రతిపత్తికి ఆటంకమని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి  సీతారామన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘సెబీ చట్టంలో భాగంగా ఈ అంశాలను పార్లమెంటులో చర్చించాలే తప్ప ఆర్థిక బిల్లులో భాగంగా దీనిని ఆమోదించకూడదు. ఆర్థిక బిల్లు ద్వారా సెబీ చట్టానికి ప్రతిపాదిత సవరణలు చేయడం నిబంధనలకు విరుధ్దం. పార్లమెంటులో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి’ అని పరిశీలకులు తెలిపార‘సెబి చట్టానికి ఏదైనా సవరణ చేసే ముందు ఆ సవరణపై  పార్లమెంటులో ముందు చర్చించాలి’ అని అన్నారు. 
     
2001 కేసులో సెబీకి మద్ధతుగా సుప్రీం..
ఆర్థిక బిల్లుకు కేవలం దిగువ సభ అమోదం ఉంటే సరిపోతుంది. ఈ సభలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆధిక్యత ఉన్న విషయం తెలిసిందే. మిగులు నిధులను సిఎఫ్‌ఐకి బదిలీ చేసే ఏ చర్య అయినా ఇన్వెస్టర్లు, వ్యాపారులపై రుసుము ద్వారా పన్నులను వసూలు చేసినట్టేనని సెబీ అభిప్రాయపడింది. రెగ్యులేటర్, బీఎస్‌ఈ బ్రోకర్స్ ఫోరం మధ్య 2001లో చెలరేగిన  కేసులో సుప్రిం కోర్టు సెబీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ కేసులో సెబీ రుసుము పేరుతో పన్నులను వసూలు చేస్తుందని, ఇది రుసుము కంటే అధికంగా ఉందని  బీఎస్‌ఈ బ్రోకర్స్‌ ఫోరం సుప్రిం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.  సెబీ మార్కెట్‌ను నియంత్రించడానికి, ఇన్వెస్టర్ల ఆసక్తిని కాపాడటానికి నిధులు అవసరమని అప్పుడు సుప్రీంకోర్టు పేర్కొంది. సెబీ మార్కెట్‌కు అందించే సేవలకు గాను రెగ్యులేటరీ ఫీజు వసూలు చేయవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఫీజులను పెంచే, తగ్గించే సౌలభ్యాన్ని సెబీ కలిగి ఉంది. కానీ బడ్జెట్ ప్రతిపాదన అమలైతే  ఈ సౌలభ్యానికి పరిమితులు ఏర్పడతాయి.‘ కాగ్‌ (కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్) ప్రతి ఏడాది సెబీ ఖాతాలను ఆడిట్ చేస్తుంది.  ఏ ఏడాదిలోనైనా మునుపటి ఏడాది కంటే ఫీజు ఆదాయం తక్కువగా ఉంటే, సెబీ ఖజానాకు నష్టాన్ని కలిగించిందన్న భావన వుంటుందని, అధిక ఫీజులు వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచాలన్న ఒత్తిడి ఉంటుంది’ అని సెబీ అధికారి తెలిపారు. 

 



You may be interested

రెండు నెలల కనిష్టానికి సూచీల పతనం

Friday 19th July 2019

  560 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 177 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ  దేశీయ ఈక్విటీ మార్కెట్‌ శుక్రవారం ఆర్థిక సంవత్సరపు రెండో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. అన్నిరంగాలకు చెందిన షేర్లు అమ్మకాల సునామితో  సెన్సెక్స్‌ 560.45 పాయింట్లు నష్టపోయి 38,337 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు క్షీణించి 11,419.25 వద్ద స్థిరపడ్డాయి. ఈ సూచీలకు ఇది రెండునెలల గరిష్టస్థాయి అత్యధికంగా అటో, బ్యాంకింగ్‌, ఫార్మా, ఆర్థిక రంగ షేర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంకింగ్‌ రంగ

మూడేళ్ల కనిష్ఠానికి నిఫ్టీ ఆటో

Friday 19th July 2019

మరింత కుంగవచ్చంటున్న నిపుణులు తగ్గిపోతున్న విక్రయాలు, బలహీన రుతుపవనాలు, వ్యవస్థలో నగదు సన్నగిల్లడం, ఎకానమీలో మందగమన సంకేతాలు... ఆటో సూచీని కుంగదీస్తున్నాయి. వినిమయ విభాగంలో ఆటో రంగం నెగిటివ్‌ సెంటిమెంట్‌ దెబ్బకు విలవిలలాడుతోంది. గత కొంతకాలంగా నేలచూపులు చూస్తున్న నిఫ్టీ ఆటో సూచీ తాజాగా మూడేళ్ల కనిష్టానికి చేరింది. ఇంతటితో పతనం ముగియలేదని, మరింత అధ్వాన్నం ముందుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్యు1లో ఆటో విక్రయాలు గత ఐదేళ్లలో లేనంత వేగంగా క్షీణించాయి.

Most from this category