STOCKS

News


ఈ షేర్లు వజ్రాల్లాంటివి

Saturday 29th September 2018
Markets_main1538200830.png-20692

ముంబై: యస్‌బ్యాంక్‌ షేర్లు వజ్రాల్లాంటివని ఆ బ్యాంక్‌ సీఈఓ రాణా కపూర్‌ వ్యాఖ్యానించారు. యస్‌బ్యాంక్‌లో తనకున్న వాటాను విక్రయించబోనని స్పష్టంచేశారు. ఎమ్‌డీ, సీఈఓగా ఈ బ్యాంక్‌ నుంచి వైదొలిగినప్పటికీ, ఎప్పటికీ, ఈ షేర్లను అమ్మే ప్రశ్నే లేదని ఆయన ట్వీట్‌ చేశారు. 
ఈ షేర్లు అమూల్యం...
రాణా కపూర్‌ పదవీ కాలాన్ని ఆర్‌బీఐ కుదించిన నేపథ్యంలో గత ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో యస్‌బ్యాంక్‌  షేర్‌ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ‘‘యస్‌బ్యాంకులో ప్రమోటర్‌గా నాకున్న షేర్లు అమూల్యమైనవి. నా వాటాను నా ముగ్గురు కుమార్తెలకూ అందజేస్తా. ఈ షేర్లలో ఏ ఒక్క షేర్‌నూ విక్రయించకూడదని వీలునామాలో నా కుమార్తెలను కోరుతా’’ అని వివరించారు. కాగా ప్రమోటర్లలో ఒకరైన దివంగత అశోక్‌ కపూర్‌ భార్య మధు కపూర్‌ 0.04 శాతం వాటాకు సమానమైన ఏడు లక్షల షేర్లను విక్రయించారు. ఈ నెల 21న ఓపెన్‌ మార్కెట్‌ వ్యవహారాల ద్వారా ఈ షేర్లను అమె అమ్మేశారు. ఈ వాటా విక్రయం కారణంగా మధు కపూర్‌ వాటా 9.28 శాతానికి తగ్గింది. మరోవైపు రాణా కపూర్‌ వాటా 10.66 శాతంగా ఉంది.



You may be interested

రంగాల వారీగా ఎక్స్‌పోజర్‌పై ఎస్‌బీఐ సమీక్ష

Saturday 29th September 2018

కోల్‌కతా: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ, వివిధ రంగాల వారీగా క్రెడిట్‌ ఎక్స్‌పోజర్‌కు సంబంధించి మధ్యంతర సమీక్ష నిర్వహించనుంది. ఓ రుణానికి సంబంధించి డిఫాల్ట్‌ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?, దాన్ని మంజూరు చేయాలా? లేదా అన్నది ఈ సమీక్షలో నిర్ణయించడం జరుగుతుందని ఎస్‌బీఐ ఎండీ దినేష్‌ ఖరా చెప్పారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. బ్యాంకు రుణాల్లో కార్పొరేట్‌ రంగానికి ఇచ్చినవి ప్రస్తుతం

4న ఐడీబీఐ బ్యాంక్‌ బోర్డ్‌ భేటీ

Saturday 29th September 2018

ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ కీలకమైన బోర్డ్‌ సమావేశం వచ్చే వారం (అక్టోబర్‌ నాలుగు- గురువారం) జరగనుంది. బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపాదికన 51 శాతం వాటా షేర్లను కేటాయించే విషయమై సమావేశంలో చర్చిస్తారని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ లేదా ఓపెన్‌ ఆఫర్‌ మార్గంలో సాధించడానికి ఎల్‌ఐసీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఇటీవలే తమకు రాసిన

Most from this category