STOCKS

News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై కేంద్ర దర్యాప్తు?...షేరు మరో 20 శాతం డౌన్‌

Thursday 31st January 2019
Markets_main1548916496.png-23921

ముంబై:- దాదాపు రూ.31వేల కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలపై కార్పోరేట్‌ అఫైర్స్‌ మంత్రిత్వ(ఎం సీ ఏ) శాఖ విచారణకు సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో దివాన్‌ హౌసింగ్‌  షేరు వరుసగా మూడోరోజైన గురువారం కూడా భారీ పతనాన్ని చవిచూసింది. వరుసగా రెండు రోజులపాటు 20 శాతం వరకూ పడిపోయిన ఈ షేరు తాజాగా మరో20శాతం నష్టపోయింది. వివిధ షెల్ కంపెనీల సాయంతో ఆ కంపెనీకి చెందిన ప్రధాన ప్రమోటర్లు రూ.31,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కోబ్రాపోస్ట్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కంపెనీపై వెలువడిన ఆరోపణలను విచారించేందుకు ఎంసీఏ శాఖ గురువారం నుంచి దర్తా‍్యపు ప్రారంభిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విచారణ అంశంపై స్పందించేందుకు ఎంసీఎ నిరాకరించగా, డీఎల్‌ఎఫ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ అధికారులు అందుబాటులోకి రాలేదు. ఈ ప్రతికూల వార్తలతో నేడు బీఎస్‌ఈలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు దాదాపు 20శాతం క్షీణించి రూ.129.60ల కనిష్టానికి పతనమైంది. ఉదయం గం.11:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.161.6)తో పోలిస్తే 14.50శాతం నష్టంతో రూ.137.95ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 129.60 రూ.690.00లుగా ఉన్నాయి.You may be interested

సేవల విస్తృతిపై అపోలో దృష్టి

Thursday 31st January 2019

అపోలో జాయింట్‌ ఎండీ సంగీత రెడ్డి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆసుపత్రుల విస్తరణ కంటే సేవల విస్తృతిపైనే ఈ ఏడాది ఎక్కువగా ఫోకస్‌ చేస్తామని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఫిక్కీ సమావేశంలో పాల్గొన్న ఆమె ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఆసుపత్రుల పరంగా దేశంలో మేమే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం. అవసరమైన చోట హాస్పిటల్‌, ఫార్మసీల

మార్కెట్‌ నిపుణుల ట్రేడింగ్‌ ఐడియాలు

Thursday 31st January 2019

స్వల్పకాలానికి ఇరువురు నిపుణులు మొత్తం నాలుగు ట్రేడింగ్‌ ఐడియాలను అందిస్తున్నారు. 1. మానస్‌జైస్వాల్‌: - ఆర్‌ఐఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1265. స్టాప్‌లాస్‌ రూ. 1200. - ఇన్ఫోసిస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 760. స్టాప్‌లాస్‌ రూ. 734. 2. కునాల్‌బత్రా: - శోభా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 500. స్టాప్‌లాస్‌ రూ. 467.  - బీఈఎంఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 860. స్టాప్‌లాస్‌ రూ. 795.

Most from this category