STOCKS

News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దూకుడు

Tuesday 30th October 2018
Markets_main1540887607.png-21586

ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు మంగళవారం 16శాతం లాభపడింది. నేడు ఈ షేరు బీఎస్‌ఈలో రూ. 186.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. లిక్విడిటీ కొరత కారణంగా ఇటీవల భారీగా పతనంతో ఈ షేరు కొనుగోలు ధర ఆకర్షణీయంగా ఉండటంతో ఇన్వెస్టర్లు షేరు కొనుగోలుకు మొగ్గచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో 16శాతం ర్యాలీ చేసి రూ.214.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నాం గం.1:20ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.185.2)తో పోలిస్తే 15శాతం లాభంతో రూ.213.55ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.66 కోట్ల వాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవుతోంది.  కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.176.05 రూ.690.00లుగా నమోదయ్యాయి.



You may be interested

రెండోరోజూ తియ్యటి ర్యాలీ..!

Tuesday 30th October 2018

చక్కెర షేర్లు వరుసగా రెండో ట్రేడింగ్‌లోనూ తియ్యటి ర్యాలీ చేస్తున్నాయి. ఈ మార్కెటింగ్‌ సంవత్సరం(అక్టోబర్‌-సెప్టెంబర్‌)లో చక్కెర ఉత్పత్తి తగ్గవచ్చని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ అంచనాలు ర్యాలీకి కారణమయ్యాయి. ఈ ఏడాది దేశంలో చక్కెర ఉత్పత్తి 32 మిలియన్‌ టన్నులుగా ఉండొచ్చని ఐఎస్‌ఎంఏ పేర్కోంది. చక్కెర ఉత్పత్తి తగ్గనుండంతో చక్కెర షేర్లు ర్యాలీ చేయవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు వరుసగా రెండో రోజూ కూడా ఈ చక్కెర కౌంటర్లలో కొనుగోళ్లకు తెరలేపారు.

సీఈఎస్‌ఈ 20శాతం క్రాష్‌

Tuesday 30th October 2018

ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌నకు చెందిన సీఈఎస్‌సీ లిమిటెడ్‌ షేరు మంగళవారం 26శాతం నష్టపోయింది. విద్యుత్‌యేతర బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయడం ఇందుకు కారణమైంది. నేడు సీఈఎస్‌సీ లిమిటెడ్‌ షేరు బీఎస్‌ఈలో రూ.670.15ల వద్ద ప్రారంభమైంది. గతేడాదిలో సీఈఎస్‌సీ యాజమాన్యం విద్యుతేతర వ్యాపారాలను న్యూ రిటైల్‌, వెంచర్‌ కంపెనీలు విడదీసేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా సీఈఎస్‌సీ వాటాదారులకు తమ దగ్గరున్న ప్రతీ 10 షేర్లకుగాను రూ. 5 ముఖ విలువగల

Most from this category