STOCKS

News


కోబ్రాపోస్ట్‌ కలకలం : డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మరో 10శాతం డౌన్‌

Wednesday 30th January 2019
Markets_main1548827394.png-23896

నగదు బదిలీ ఆరోపణలపై కంపెనీ సీఈవో వివరణ ఇచ్చినప్పటికి దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) షేరు బుధవారం ట్రేడింగ్‌లో మరో 10శాతం పతనమైంది. వివిధ షెల్ కంపెనీల సాయంతో ఆ కంపెనీకి చెందిన ప్రధాన ప్రమోటర్లు రూ.31,000 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని కోబ్రాపోస్ట్‌ మంగళవారం ఆరోపణలు చేసింది. కాగా, కోబ్రాపోస్ట్‌ కథనాన్ని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఖండించింది. ఆరోపణలన్నీ దురుద్దేశంతో చేసినవేనని, కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు కంపెనీ సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితంగా నిన్నటి ట్రేడింగ్‌లో కంపెనీ షేరు షేరు  8.01 శాతం నష్టంతో  రూ.170.05 వద్ద ముగిసింది. నేడు షేరు రూ.167.10ల వద్ద ప్రారంభించింది. కంపెనీ కుంభకోణంపై వివరణ ఇచ్చినప్పటికి నేటి ఇంట్రాడేలో 10శాతం నష్టపోయి రూ. 153.50ల కనిష్టానికి పతనమైంది. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.170.05)తో పోలిస్తే దాదాపు 6శాతం నష్టపోయి రూ.161.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.153.50 రూ.690.00లుగా నమోదయ్యాయి.



You may be interested

యాక్సిస్‌బ్యాంక్‌ షేరును ఏంచేద్దాం?

Wednesday 30th January 2019

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ క్యు3లో రూ. 1681 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు 130 శాతం అధికం. అనలిస్టులు 50- 110 శాతం వరకు లాభంలో వృద్ధి ఉండొచ్చని అంచనా వేశారు. మంచి ఫలితాల నేపథ్యంలో బుధవారం షేరు దూసుకుపోతోంది,. ఈ షేరుపై ప్రముఖ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి. 1. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు. టార్గెట్‌ను రూ. 800 నుంచి రూ.840కి పెంచింది. ఎర్నింగ్స్‌

ఓరియంటల్ బ్యాంక్ లాభం రూ. 145 కోట్లు

Wednesday 30th January 2019

- ఈఎస్‌పీఎస్‌ కింద 2.61 కోట్ల షేర్ల జారీ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.145 కోట్ల నికర లాభం ప్రకటించింది. అసెట్ క్వాలిటీ, వ్యాపార నిర్వహణ సామర్ధ్యాలు మెరుగుపడటం ఇందుకు తోడ్పడ్డాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఓబీసీ రూ. 1,985 కోట్ల నష్టాలు నమోదు చేసింది. మరోవైపు, మొత్తం ఆదాయం రూ. 4,756 కోట్ల

Most from this category