STOCKS

News


వాటా విక్రయ వార్తలతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్ల ర్యాలీ

Monday 18th February 2019
Markets_main1550484491.png-24248

గృహ రుణ సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్ప్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం 10శాతం లాభపడ్డాయి. బారింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ, బైన్‌ క్యాపిటల్‌, హీరోపిన్ కార్ప్‌ కంపెనీలు వివిధ మార్గాల ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీలోని 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. వాటా విక్రయ వార్తలతో నేడు బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 10శాతం ర్యాలీ చేసి రూ.135.40ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే ఈ కథనం వివరణ ఇచ్చేందుకు ఇరువర్గాలు అందుబాటులోకి రాలేదు. మధ్యాహ్నం గం.3:15ని.లకు షేరు గతముగింపు(రూ.123.15) ధరతో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.129ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రాపర్టీ లోన్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు రూపంలోని సుమారు రూ.31వేల కోట్ల ప్రజల సొమ్మును డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ ప్రమోటర్లు దారీ మళ్లించారనే ఆరోపణలతో కంపెనీ షేర్లు గత నెలరోజుగా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న సంగతి తెలిసిందే. గతంవారంలో కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా హర్షిల్‌ మెహతా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కపిల్‌ వాధ్వాన్‌ కంపెనీ ఛైర్మన్‌, మేనిజింగ్‌ డైరెక్టర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించారు. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 97.00, రూ.690.00లుగా నమోదయ్యాయి.



You may be interested

ఎనిమిదో రోజూ నష్టాలే..!

Monday 18th February 2019

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా 8వ రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 10650 మార్కును కోల్పోయింది. ముడిచమురు ధరలు ఈ ఏడాది గరిష్టాన్ని తాకడం, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగడం, దేశీయ మార్కెట్లో నెలకొన్న బలహీన ధోరణి, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్‌, అటో రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరగడంతో సెన్సెక్స్‌

ఆర్‌బీఐ హెచ్చరిక: యస్‌ షేర్ల పతనం

Monday 18th February 2019

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరికతో యస్‌ బ్యాంక్‌ షేర్లు సోమవారం 8శాతం నష్టపోయాయి. యస్ బ్యాంక్‌కు సంబంధించి 2017-18లో ఆస్తుల వర్గీకరణ, కేటాయింపుల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని ఆర్‌బీఐ గతవారం ధ్రువీకరించింది. రహస్యంగా ఉంచాల్సిన ఆర్‌ఏఆర్‌ నివేదికను యస్ బ్యాంక్‌ను బహిర్గతం చేసింది. ఇది నిబంధనలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని, అందుకు తగిన చర్యలు తర్వలో తీసుకుంటామని ఆర్‌బీఐ యస్‌ బ్యాంక్‌ను హెచ్చరించింది. ఆర్‌బీఐ హెచ్చరికత

Most from this category