STOCKS

News


కోలుకున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ..!

Monday 24th September 2018
Markets_main1537775966.png-20522

ముంబై:- గతవారం చివరి ట్రేడింగ్‌ రోజైన శుక్రవారం భారీగా నష్టపోయి దివాన్‌ హౌసింగ్‌ పైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) షేరు సోమవారం ట్రేడింగ్‌లో రికవరీ బాట పట్టింది. లిక్విడిటీ సంక్షోభం, రుణ చెల్లింపుల్లో విఫలమవ్వడం, నిధుల కొరత ఎదుర్కోంటుందనే వార్తలతో శుక్రవారం ఈ షేరు 42శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కంపెనీ సీఎండీ కపిల్‌ వాధ్వాన్‌ మాట్లాడుతూ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ ఎలాంటి రుణ చెల్లింపుల్లో విఫలం కాలేదని, కంపెనీ ఫండమెంటల్స్‌ బలంగా ఉన్నాయని స్పష్టత నిచ్చారు. అలాగే రుణాల ప్రణాళికలో భాగంగా వాణిజ్య పేపర్లను ఓపెన్‌ మార్కెట్లో అమ్మకాన్ని తగ్గించడంతో పాటు హెడ్జింగ్‌ కార్యకలాపాలను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రూ. 386.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 25శాతం ర్యాలీ చేసి రూ.438.75 చేరుకుంది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గతముగింపు(రూ.351.55)తో పోలిస్తే 12శాతం లాభంతో రూ.393.25ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది రూ.246.25 రూ.690.00లుగా ఉన్నాయి.



You may be interested

బేర్స్‌ పంజా..

Monday 24th September 2018

లాభాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిసే ట్రెండ్‌ను సోమవారం కూడా అనుసరిస్తోంది ఇండియన్‌ స్టాక్‌మార్కెట్‌.  సూచీలు బేర్స్‌ గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి వెళ్లిపోయాయి. సెన్సెక్స్‌ ఏకంగా 500 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్లు పతనమయ్యాయి. మధ్యాహ్నాం 1:30 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 525 పాయింట్ల (1.43 శాతం) నష్టంతో 36,316 వద్ద, నిఫ్టీ 175 పాయింట్ల (1.57 శాతం) నష్టంతో 10.967 పాయింట్ల వద్ద

షార్ట్‌టర్మ్‌ కోసం పది స్టాకులు

Monday 24th September 2018

నెల రోజుల్లో సుమారు 15 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.  ఏంజల్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు- 1. బీపీసీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 394. స్టాప్‌లాస్‌ రూ. 351. ఏడాది ఆరంభం నుంచి ఓఎంసీ స్టాకులు కిందామీదాపడుతున్నాయి. రికార్డు గరిష్ఠాల నుంచి దాదాపు 25- 30 శాతం పతనమై ఇప్పుడిప్పుడే రికవరీ చూపుతున్నాయి. వీటిలో బీపీసీఎల్‌లో రికవరీ బాగుండే సూచనలున్నాయి. చార్టుల్లో బుల్లిష్‌ ఐలాండ్‌ రివర్సల్‌ పాటర్న్‌

Most from this category