STOCKS

News


8శాతం లాభపడ్డ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు

Friday 17th May 2019
Markets_main1558087489.png-25800

ముంబై: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు శుక్రవారం 4శాతం పెరిగాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ.111.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తన హోల్‌సేల్‌ రియల్‌ఎస్టేట్‌ రుణాలను అమెరికా ఆధారిత​ కంపెనీ ఓక్‌ట్రీ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు 17,000-18,000 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ నాన్‌బిండింగ్‌ ఒప్పందంపై సంతకం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే మరో రెండు నెలల్లో రూ.8400 కోట్ల రుణ, సెక్యూరిటైజేషన్ చెల్లింపులను కూడా చేయబోతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో నేడు 8.25శాతం లాభపడి రూ.116.20ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.3:20ని.లకు షేరు గత ముగింపు ధర (రూ.107.05)తో పోలిస్తే 5.50శాతం లాభంతో రూ. 113.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.97.00 రూ.690.00లుగా నమోదయ్యాయి.



You may be interested

వాల్యూ స్టాకులు ఎప్పటికీ విలువైనవే!

Friday 17th May 2019

గత కొన్నేళ్లుగా మార్కెట్లో కొత్త పెట్టుబడులకు స్టాకుల వాల్యూషన్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. చాలా స్టాకుల వాల్యూషన్లు భారీగా పెరగడంతో వీటిలో పెట్టుబడులకు వెనకాడాల్సిన పరిస్థితి ఉంది. దీనికితోడు ఇంత వాల్యూషన్లకు సరిపడా ఎర్నింగ్స్‌ గ్రోత్‌ కానరాకపోవడం కూడా నెగిటివ్‌గా మారింది. దీంతో కేవలం కొన్ని నాణ్యమైన కంపెనీల్లో మాత్రమే మార్చిమార్చి పెట్టుబడులు పెట్టడం కనిపిస్తోంది. ఇలాంటి బడా కంపెనీలే పోర్టుఫోలియోలకు స్థిరత్వాన్నిస్తున్నాయి. కానీ వీటిలో కూడా వాల్యూషన్లు బాగా

అరబిందో ఫార్మా 8.50శాతం డౌన్‌

Friday 17th May 2019

దేశీయ ఫార్మా దిగ్గజ కంపెనీ అరబిందో ఫార్మా షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 8.50శాతం నష్టపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనిట్‌- 1, యూనిట్‌ X1, యూనిట్‌ 1X తనిఖీలను పూర్తి చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఆయా యూనిట్లకు ఓఏఐ (అఫిషియల్‌ యాక్షన్‌ ఇండికేటెడ్‌) లేఖను జారీ చేసినట్లు కంపెనీ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. యూఎస్‌ఎఫ్‌డీఏ తెలిపిన అభ్యంతరాలకు వివరణ ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఓఏఐ కారణంగా ఈ ప్లాంట్లకు సంబంధించి

Most from this category