STOCKS

News


నవంబర్‌ 5న గోల్డ్‌ ఈటీఎఫ్‌ ట్రేడింగ్‌ వేళల పెంపు

Thursday 25th October 2018
Markets_main1540445590.png-21466

న్యూఢిల్లీ: ధన్‌తేరాస్‌ సందర్భంగా నవంబర్‌ 5న గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, సార్వభౌమ బంగారం బాండ్లలో ట్రేడింగ్‌ వేళలను సాయంత్రం 7 గంటల వరకు పెంచుతున్నట్టు దేశీ స్టాక్‌ ఎక్సే‍్ఛంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రకటించాయి. 3.30 గంటలకు మార్కెట్లు యథావిధిగా క్లోజవుతాయని... తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి 7 గంటల వరకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, సార్వభౌమ బంగారం బాండ్లలో ట్రేడింగ్‌ ఉంటుందని తెలిపాయి. దీపావళికి ముందు వచ్చే త్రయోదశి రోజును ధన్‌తేరాస్‌గా పరిగణిస్తారు. ఆ రోజున బంగారం కొనుగోలు చేస్తే కలిసొస్తుందని హిందువుల నమ్మకం. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు ఒక గ్రాము బంగారానికి డిజిటల్‌ రూపంలో ఎక్సేంజ్‌ల్లో ట్రేడవుతాయి. సార్వభౌమ బంగారం బాండ్లు సైతం ఒక గ్రాము బంగారానికి సమాన విలువను కలిగి ఉంటాయి. ఇక దీపావళి లక్ష్మీ పూజను పురస్కరించుకుని నవంబర్‌ 7వ తేదీన సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు గంటపాటు ఇరు ఎక్సేంజ్‌ల్లో మూరత్‌ ట్రేడింగ్‌ ఉంటుంది. ఈ మేరకు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ వేర్వేగా ప్రకటనలు జారీ చేశాయి. 



You may be interested

జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ బంపర్‌ ఫలితాలు

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: డామినోస్‌ పిజ్జా, డంకిన్‌ డోనట్స్‌ బ్రాండ్లపై ఫుడ్‌ స్టోర్లను నిర్వహించే జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 60 శాతం పెరిగి రూ.77.67 కోట్లకు చేరుకుంది. డామినోస్‌ పిజ్జా స్టోర్ల నుంచి అధిక అమ్మకాలు లాభాల వృద్ధికి తోడ్పడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.48 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం సెప్టెంబర్‌ త్రైమాసికంలో 22

పెరిగిన వ్యాపార విశ్వసనీయత

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: భారత వ్యాపార విశ్వసనీయత అక్టోబర్‌–డిసెంబర్‌ కాలానికి స్వల్పంగా పెరిగింది. ఈకాలంలో డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్ కాంపోజిట్ బిజినెస్‌ ఆప్టిమిసమ్‌ ఇండెక్స్‌ 3.6 శాతం వృద్ధి చెంది 79.5 శాతానికి చేరింది. ప్రస్తుతం కొనసాగుతున్నది పండుగల సీజన్‌ కావడం, కరీఫ్‌ పంటకు కనీస మద్ధతు ధర పెరగడం, 7వ వేతన సంఘం సిఫార్సులు అమలుకావడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో వ్యాపారంపై విశ్వసనీయత పెరిగినట్లు డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా

Most from this category