STOCKS

News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మరో 14 శాతం క్రాష్‌

Friday 7th June 2019
Markets_main1559901545.png-26160

మూడోరోజూ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్ల పతనం కొనసాగుతుంది. గత ట్రేడింగ్‌లో 15శాతం క్షీణించిన ఈ షేర్లు నేడు తాజాగా మరో 14శాతం నష్టపోయాయి. డిబెంచర్లపై రుణాలను చెల్లించడంలో విఫలం అవుతుండటం, ద్రవ్య నిల్వలు రోజురోజూకు అడుగంటిపోతున్న తరణంలో ఇక్రా, క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థలు కంపెనీ విడుదల చేసిన రూ.850 కోట్ల విలువైన కమర్షియల్‌  పేపర్లపై ఇక్రా, క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థలు రేటింగ్‌ ‘‘ఎ4’’ నుంచి ‘‘డిఫాల్ట్‌’’కు డౌన్‌గ్రేడ్‌ చేశాయి. ఫలితంగా షేరు వరుసగా మూడోరోజు పతమైనంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.91.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో షేర్లు 14.50శాతం నష్టపోయి రూ.80.10ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఈ ధర షేరు తాజా ఏడాది కనిష్టస్థాయి కావడం గమనార్హం. ఈ మూడు ట్రేడింగ్‌ సెషన్స్‌లో షేర్లు 25.66శాతం క్షీణించాయి. మధ్యాహ్నం గం.3:20ని.లకు షేరు గత ముగింపు ధర(రూ. 93.95 )తో పోలిస్తే 11.28 శాతం నష్టంతో రూ.83.35 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.80.10 రూ.690.00లుగా నమోదయ్యాయి. 
ఇక సమయానికి సెన్సెక్స్‌ 52 పాయింట్లు లాభంతో 39582.45 వద్ద, నిఫ్టీ 16.60 పాయింట్ల స్వల్ప లాభంతో 11860.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఆర్‌ఐఎల్‌, అరామ్‌కో డీల్‌ ఆగినట్లేనా?

Friday 7th June 2019

భారత్‌కు చెందిన దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు, సౌదీకి చెందిన అరామ్‌కోకు మధ్య రిఫైనరీ వాటా విక్రయ డీల్‌కు అడ్డంకులు వచ్చాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జామ్‌నగర్‌ రిఫైనరీలో 25 శాతం వాటా చేతులు మారేందుకు ఇరు కంపెనీలు ఒక డీల్‌పై చర్చలు జరుపుతున్నాయి. కానీ తాజాగా వాల్యూషన్ల విషయంలో ఈ చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిందని ఎకనమిక్‌ టైమ్స్‌ వెల్లడించింది. డీల్‌కు సంబంధిచిన కంపెనీ కోర్‌వ్యాపారాన్ని మార్కెట్‌ వర్గాలు దాదాపు

కొనసాగుతున్న అనిల్‌ అంబానీ షేర్ల పతనం

Friday 7th June 2019

అనిల్‌ అంబానికి చెందిన అడాగ్‌ షేర్ల పతనం శుక్రవారం  కొనసాగుతుంది. ఈ గ్రూప్‌నకు చెందిన షేర్లు దాదాపు 15శాతం క్షీణించాయి. అత్యధికంగా రిలయన్స్‌ ఇన్ప్రాస్ట్రక్చర్స్‌ షేర్లు 14శాతం నష్టపోయాయి. వాటితో పాటు రిలయన్‌ క్యాపిటల్‌ 12శాతం, రిలయన్స్‌ హోమ్స్‌ 10శాతం, రిలయన్స్‌ పవర్‌ 10శాతం, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌4శాతం, రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌ షేర్లు 3శాతం క్షీణించాయి.  15ఏళ్ల కనిష్టానికి రిలయన్స్‌ ఇన్ప్రాస్ట్రక్చర్స్‌:- నేడు ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో రూ.83.60ల

Most from this category