STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కన్నా ఐసీఐసీఐ బెటర్‌!

Friday 21st September 2018
Markets_main1537514848.png-20438

దేవాంగ్‌ మెహతా
వచ్చే 6- 9 నెలల కాలానికి వాల్యూషన్ల పరంగా, వృద్ధి పరంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు కన్నా ఐసీఐసీఐబ్యాంకు షేరు బాగుందని సెంట్రమ్‌ ఇండియా అనలిస్టు దేవాంగ్‌ మెహతా అభిప్రాయపడ్డారు. సమీప భవిష్యత్‌లో ఇన్వెస్టర్ల దృష్టి క్రమంగా ఐసీఐసీఐ బ్యాంకు వైపునకు మరులుతుందన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కౌంటర్లో రద్దీ ఎక్కువని, అందువల్ల కొందరు ఇన్వెస్టర్లు క్రమంగా వ్యూహాత్మకంగా ఐసీఐసీఐ బ్యాంకు కౌంటర్‌కు మరలిపోతారని చెప్పారు. ఐసీఐసీఐ పద్దు పుస్తకాల ప్రక్షాళన క్రమంగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందన్నారు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరును అమ్మవచ్చని రికమండ్‌ చేయడం లేదని వివరించారు. ఐదేళ్ల కాలానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును కొనుగోలు చేయవచ్చని చెప్పారు. దీర్ఘకాలానికి ఐసీఐసీఐ బ్యాంకు షేరు పరిస్థితిని అంచనా వేయలేమని స్వల్పకాలానికి మాత్రం మంచి పురోగతి ఉండొచ్చని తెలిపారు. 
పీఎస్‌బీలకు దూరం
ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లకు ప్రస్తుతానికి దూరంగా ఉన్నట్లు మెహతా చెప్పారు. క్రమంగా పీఎస్‌బీల ఫలితాలు మెరుగుపడుతున్నాయని, అయితే ఎన్‌పీఏల సమస్య తగ్గుముఖం పట్టేవరకు ఈ కౌంటర్‌ను తాము పరిశీలించమని తెలిపారు. పీఎస్‌యూ బ్యాంకుల విలీనం అనంతరం పరిస్థితి ఎలామారుతుందనే విషయమై స్పష్టత రావాల్సిఉందన్నారు. అందువల్ల ప్రస్తుతానికి పీఎస్‌యూ బ్యాంకు కౌంటర్లు సందిగ్ధ స్థితిలో ఉన్నాయని, అందువల్ల వీటిని తాము రికమండ్‌ చేయడం లేదని తెలిపారు. అదే సమయంలో ప్రైవేట్‌ బ్యాంకు షేర్లు బాగున్నాయని, వీటిలో కాస్త కరెక‌్షన్‌ వచ్చినా కొనుగోలు చేయవచ్చని సూచించారు. 



You may be interested

ట్రెండ్‌ రివర్స్‌: మార్కెట్‌ డౌన్‌

Friday 21st September 2018

గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నాం వరకు అదే జోరును కొనసాగించాయి. అయితే తర్వాత ఇండెక్స్‌లు ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. మధ్యాహ్నాం 1:12 సమయంలో సెన్సెక్స్‌ 248 పాయింట్ల నష్టంతో 36,872 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 149 పాయింట్ల నష్టంతో 11,085 పాయింట్ల వద్ద ఉంది. నిఫ్టీ మళ్లీ 11,200 మద్దతు స్థాయి దిగువకు పతనమైంది.   ఇక నిఫ్టీ-50లో ఐఓసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 2 శాతానికిపైగా.. ఐటీసీ, హిందుస్తాన్‌

చక్కెర షేర్లకు సీసీఐ చేదు వార్త..!

Friday 21st September 2018

ముంబై:- కేంద్రం ఇథనాల్‌ ధర పెంపు కారణంగా గతవారంలో స్వీట్‌ ర్యాలీ చేసిన చక్కెర షేర్లకు కాంపీటీషన్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలకు ఇథనాల్‌ సరఫరా చేసే విషయంలో చక్కెర సంఘాలతో కుమ్మక్కుకావడంతో 18 చక్కెర మిల్లులపై రూ.38 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు సీసీఐ గురువారం తెలిపింది. ఈ కుమ్మక్కులో అధిక పాత్ర ఉన్న బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌ కంపెనీ మొత్తం జరిమానాలో రూ.12.35

Most from this category