News


బ్యాంకు నిఫ్టీలో ‘రేషియో కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం’

Monday 7th January 2019
Markets_main1546834899.png-23444

నిపుణుల సూచన
గతవారం బ్యాంకు నిఫ్టీ వారాంతంలో కోలుకొని పాజిటివ్‌గా ముగిసింది. బ్యాంకునిఫ్టీలో లాంగ్‌ అన్‌వైండింగ్‌ ఎక్కువగా కనిపించింది. ఓపెన్‌ఇంట్రెస్ట్‌ కొత్తగా ఏర్పడినట్లు కనిపించలేదు. ఎంపిక చేసిన బ్యాంకు స్టాకుల్లో లాంగ్స్‌ పెరిగాయి. ఈ పరిస్థితిని గమనిస్తే కొత్త వారానికి బ్యాంకునిఫ్టీలో మరికొంత పుల్‌బ్యాక్‌ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ అప్‌మూవ్స్‌ ఉండకపోయినా 27,500 పాయింట్ల వరకు పైకి ఎగిసే ఛాన్సులున్నాయని అంచనా. ఈ సమయంలో బ్యాంకు నిఫ్టీలో రేషియో కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 


ఈ వ్యూహంలో ఏటీఎం కాల్స్‌లో లాంగ్‌ పొజిషన్‌ తీసుకొని అధిక స్ట్రైక్‌ ప్రైస్‌ల వద్ద ఉన్న రెండు కాల్స్‌ను షార్ట్‌ చేయడం జరగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిమిత డౌన్‌సైడ్‌ ఉంటుందని భావిస్తే ఈ వ్యూహం సత్ఫలితాలు ఇస్తుంది. అయితే అప్‌సైడ్‌లో నష్టం ఓపెన్‌గా ఉండడం ఈ వ్యూహంలో నెగిటివ్‌ అంశం. 



You may be interested

టైటాన్‌పై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Monday 7th January 2019

వివిధ విభాగాల నుంచి రెవెన్యూ గైడెన్స్‌ బాగుంటుందన్న అంచనాలిచ్చిన టైటాన్‌పై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో టైటాన్‌ షేరు దాదాపు 4 శాతం లాభపడింది. మోర్గాన్‌స్టాన్లీ: రేటింగ్‌ ఓవర్‌వెయిట్‌. టార్గెట్‌ రూ. 1250. క్యు3పై కంపెనీ మేనేజ్‌మెంట్‌ అంచనాలు బలంగా ఉన్నాయి. జువెలరీ విభాగంలో అనూహ్యమైన ఆపరేటింగ్‌ మార్జిన్‌ అప్‌మూవ్‌ ఉండొచ్చు. మొత్తం ఆర్థిక సంవత్సరానికి 22 శాతం రెవెన్యూ గ్రోత్‌ ఉంటుందని మేనేజ్‌మెంట్‌ అంచనా వేసింది. వాచీల

భారీ గ్యాప్‌అప్‌...సెన్సెక్స్‌ 276 పాయింట్లు జంప్‌

Monday 7th January 2019

నిఫ్టీ 78 పాయింట్లు అప్‌ ప్రపంచ ట్రెండ్‌ సానుకూలత కారణంగా సోమవారం భారత్‌ మార్కెట్‌ భారీ గ్యాప్‌అప్‌తో మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఒక్కసారిగా276 పాయింట్ల లాభంతో 35,971 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 10, 805పాయింట్ల వద్ద మొదలయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్లు భారీగా జంప్‌చేసాయి. వేదాంత, టాటా స్టీల్‌, హిందాల్కోలు 2-3 శాతం మేర పెరిగాయి. బ్యాంకింగ్‌ షేర్లు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌,

Most from this category