STOCKS

News


నిఫ్టీ 11,000 పాయింట్లు దాటకపోవచ్చు!

Tuesday 1st January 2019
Markets_main1546324506.png-23344

సమీప భవిష్యత్‌లో నిఫ్టీ 11,000 పాయింట్లను దాటలేకపోవచ్చని ప్రముఖ అనలిస్టు శుభమ్‌ అగర్వాల్‌ అంచనా వేశారు. జనవరి సీరిస్‌లో నిఫ్టీకి 10,500 పాయింట్ల వద్ద మద్దతు దొరుకుతుందన్నారు. ఎగువన 11,000 పాయింట్ల వద్ద నిరోధం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బేర్‌ పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం అనుసరించాలని సూచించారు. ఇది ఒక బేరిష్‌ వ్యూహం. ఇందులో ఒక లాట్‌ ఎట్‌ ద మనీ పుట్‌ను కొనుగోలు చేసి, ఒక లాట్‌ లోయర్‌ స్ట్రైక్‌ ప్రైస్‌ పుట్‌ను విక్రయించాలి. దీంతో నష్టాలు పరిమితంగా ఉంటాయి. అనుకున్న కదలికలు వస్తే లాభం మరింత ఉంటుందని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఇండియా ఒలటిలిటీ సూచీ 15కు పైన కొనసాగుతోంది. జనవరిలో ఆటుపోట్లను ఇది సూచిస్తోంది. పలు స్టాకుల్లో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ తగ్గుతూ వస్తోంది. దీన్ని బట్టి ట్రేడర్లు లాంగ్స్‌పై పెద్దగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. కన్జూమర్‌ గూడ్స్‌(హెచ్‌యూఎల్‌, బాటా), ఎన్‌బీఎఫ్‌సీ(ముత్తూట్‌, రెప్కో) షేర్లలో లాంగ్స్‌ పెరిగాయి. టెక్స్‌టైల్‌(ఎస్‌ఆర్‌ఎఫ్‌, అరవింద్‌), ఫార్మా(సన్‌, ఆరో) షేర్లలో షార్ట్స్‌ కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రైవేట్‌ బ్యాంకుల్లో పాజిటివ్‌ కదలికలున్నా, పొజిషన్లు పెద్దగా క్యారీఫార్వర్డ్‌ కాలేదన్నారు. 



You may be interested

మూడు రంగాలు ఆకర్షణీయం

Tuesday 1st January 2019

మార్కెట్‌ నిపుణుడు జీతెన్‌ పరమార్‌ సలహా ఒక కంపెనీ షేరు దాని ఇంట్రెన్సిక్‌ విలువ కన్నా బాగా తక్కువగా ఉన్నప్పుడు దాన్ని కొనుగోలు చేయవచ్చని ప్రముఖ అనలిస్టు జీతెన్‌ పరమార్‌ సూచించారు. ఇలాంటి కాంట్రా ఇన్వెస్టింగ్‌ చాలా సార్లు మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. మార్కెట్లో నిరాశా పూరిత వాతావరణం ఉన్నప్పుడు ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ తరహా కాంట్రా పెట్టుబడితో రెట్టింపు లాభాలు పొందవచ్చన్నారు. కొత్త సంవత్సరానికి క్యాపిటల్‌ గూడ్స్‌,

కొత్త ఏడాదికి ఐసీఐసీఐ డైరెక్ట్‌ సిఫార్సులు

Tuesday 1st January 2019

నూతన సంవత్సరంలో మంచి రాబడులిచ్చే ఏడు స్టాకులను ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండ్‌ చేస్తోంది. 1. యాక్సిస్‌ బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 755. స్టాప్‌లాస్‌ రూ. 569. నాలుగు సంవత్సరాల సౌష్ఠవాకార త్రిభుజాకృతి పాటర్న్‌ నుంచి పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. ప్రస్తుతం రూ. 580 వద్ద బలమైన మద్దతు స్థాయి ఏర్పరుచుకుంది. గత అప్‌మూవ్‌కు 123.6 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి 770 రూపాయల వరకు అప్‌మూవ్‌ కొనసాగవచ్చు. 2. బ్రిటానియా ఇండస్ట్రీస్‌: టార్గెట్‌ రూ.

Most from this category