STOCKS

News


మార్కెట్‌కు ‘డిఫాల్ట్‌’ గండం

Monday 24th September 2018
Markets_main1537775338.png-20520

ఆసియా ప్రాంతంలోనే ఉత్తమమైన పనితీరు కనబరుస్తూ వస్తున్న ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ను కంపెనీల డిఫాల్ట్‌ భయాలు వెంటాడుతున్నాయి. గత నాలుగు సెషన్లలోనూ పడిపోతూ వస్తున్న ఇండెక్స్‌లు ఐదో రోజూ సోమవారం కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాల చెల్లింపుల పరంగా విఫలమైనట్లు వెల్లడికావడంతో నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) లిక్విడిటీకి సంబంధించి ఆందోళనలు ఏర్పడటం వల్ల శుక్రవారం మార్కెట్లు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారిపోయిన విషయం తెలిసిందే. ఇండియన్‌ స్టాక్స్‌ మార్కెట్లు, ఫారెక్స్‌ మార్కెట్లు, బాండ్‌ మార్కెట్లు తీవ్రమైన ఒదిదుడుకులు ఎదుర్కొన్నాయి.

కంపెనీల డిఫాల్ట్‌ భయాల వల్ల ఇండియన్‌ మార్కెట్‌లలో ఆందోళనలు నెలకొన్నాయి. సోమవారం మధ్యాహ్నాం 12:28 సమయంలో సెన్సెక్స్‌ 433 పాయింట్ల (1.18 శాతం) నష్టంతో 36,408 వద్ద, నిఫ్టీ 139 పాయింట్ల (1.25 శాతం) నష్టంతో 11,003 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా శుక్రవారం రోజు సెన్సెక్స్‌ ఇంట్రాడేలో భారీగా పతనమైంది. గత నాలుగేళ్లలో ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ చెల్లింపులు నిర్వహించకపోవడం వల్ల ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీకి సంబంధించి ఆందోళనలు ఏర్పడటం దీనికి ప్రధాన కారణం. దీంతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. 
లిక్విడిటీ తగ్గుతుండటంతో ఫైనాన్షియల్‌ కంపెనీలపై ఒత్తిడి పెరిగిందని మీర్‌ అసెట్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ రాహుల్‌ చదా తెలిపారు. వచ్చే 6-9 నెలలు మార్కెట్లు రేంజ్‌బౌండ్‌లో ఉండొచ్చని అంచనా వేశారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం ఉదయం ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ అందుబాటులో ఉంచుతామని భరోసానిచ్చినప్పటికీ ఈక్విటీ మార్కెట్లు పడిపోతున్నాయి. అలాగే శుక్రవారం దేశీ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిన నేపథ్యంలో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ను పెంచేందుకు ఫైనాన్షియల్‌ మార్కెట్లను అతి దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఒక ప్రకటన విడుదల చేశాయి. అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి. అయినా కూడా స్టాక్‌ మార్కెట్‌ పడిపోవడం గమనార్హం. 

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో శుక్రవారం బాధకారమైన రోజని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జగనాథం తునుగుంట్ల తెలిపారు. మార్కెట్లు భారీగా పతనమయ్యాయని పేర్కొన్నారు. 
శుక్రవారం యస్‌ బ్యాంక్‌ షేరు క్షీణతతో స్టాక్‌ మార్కెట్‌ పతనం ప్రారంభమైంది. తర్వాత ఐల్‌ఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డెట్‌ డిఫాల్ట్‌ ఇతర ఎన్‌బీఎఫ్‌సీలకు విస్తరిస్తుందోమేననే ఊహగానాల వల్ల డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్టాక్‌ కుప్పకూలడంతో మార్కెట్‌ క్రాష్‌ అయ్యింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పతనం ప్రభావం ఇతర ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు విస్తరించడం తీవ్ర ‍ప్రతికూల ప్రభావం చూపింది. కాగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ తమ వద్ద రూ.19,700 కోట్ల లిక్విడిటీ ఉందని ప్రకటించడంతో సోమవారం ఈ స్టాక్‌ 25 శాతానికిపైగా పెరిగింది.  

ఊహాగానాలకు కారణం: డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ గతవారం దివాన్‌ హౌసింగ్‌ బాండ్లను డిస్కౌంట్‌ రేటుతో విక్రయించింది. సెప్టెంబర్‌లో మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గుతుందనే అంచనాలతో ఈ ఫండ్‌ మేనేజర్‌.. బాం‍డ్లను విక్రయించి నిధులు సమీకరించాలని భావించింది. ఈ విషయాన్ని డీఎస్‌పీ ప్రెసిడెంట్‌ కల్పెన్‌ పరేఖ్‌ తెలిపారు. ఈ ఫండ్‌ రూ.300 కోట్ల విలువైన బాండ్లను విక్రయించింది. తాము ఏటువంటి చెల్లింపులోనూ డిఫాల్ట్‌ కాలేదని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ కపిల్‌ వధావన్‌ తెలిపారు. వచ్చే ఆరు నెలల కాలంలో చెల్లింపులు నిర్వహించేందుకు తమ వద్ద నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. 

మార్కెట్లో ప్రస్తుతం తలెత్తిన ఒడిదుడుకులు సమీప కాలంలోనూ కొనసాగుతాయని డబ్ల్యూజీసీ వెల్త్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ రాజేశ్‌ చెరువు తెలిపారు. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల స్టాక్స్‌పై తీవ్రమైన ఒత్తిడి నెలకొని ఉందని, దీనికి అధిక వ్యాల్యుయేషన్స్‌కు కారణమని పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌కు కూడా విస్తరించొచ్చని తెలిపారు. కాగా బ్లూమ్‌బర్గ్‌ డేటా ప్రకారం చూస్తే.. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ ఫైనాన్స్‌ ఇండెక్స్‌ తన భవిష్యత్‌ పీఈ రేషియో అంచనాలకు 19.6 రెట్లు వద్ద ట్రేడవుతోంది. గత ఐదేళ్ల సగటు 17.8 రెట్లుతో పోలిస్తే ఎక్కువ స్థాయిలో ఉంది.

బుల్లిష్‌గా మనీ మేనేజర్లు..
ప్రస్తుత పరిస్థితుల్లోనూ కొందరు మనీ మేనేజర్లు ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రైవేట్‌ రంగ బ్యాంకులను ప్రాధాన్యమిస్తున్నామని బీఎన్‌పీ పారిబాస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఆసియా పసిఫిక్‌ ఈక్విటీస్‌) హెడ్‌ అర్థర్‌ వాంగ్‌ తెలిపారు. ప్రైవేట్‌ రంగ బ్యాంకుల స్టాక్స్‌ను కలిగి ఉన్నామని, తామేమీ భయపడటం లేదని జేవో హంబ్రో క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ మనీ మేనేజర్‌ జేమ్స్‌ సైమ్‌ పేర్కొన్నారు. ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌ను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని బ్లాక్‌రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చీఫ్‌ మల్టీ అసెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఇసబెల్లా తెలిపారు. ఫండమెంటల్‌గా బలంగా ఉన్నా స్టాక్స్‌ను పడిపోతున్నప్పుడు కొనుగోలు చేయవచ్చని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ తెలిపారు. 

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ల ర్యాలీ ఇక అయిపోయిందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇటీవలనే తెలిపింది. వ్యాల్యుయేషన్స్‌ పెరిగిపోవడం, ఆర్థిక వృద్ధి మందగించ్చొనే అంచనాలు, రానున్న ఎన్నికలు వంటి వాటి వల్ల సెన్సెక్స్‌, నిఫ్టీ ఇండెక్స్‌లు తక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని తన నివేదికలో పేర్కొంది. అలాగే భారత్‌ రేటింగ్‌ను బై నుంచి హోల్డ్‌కి తగ్గించింది. 
 You may be interested

షార్ట్‌టర్మ్‌ కోసం పది స్టాకులు

Monday 24th September 2018

నెల రోజుల్లో సుమారు 15 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.  ఏంజల్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు- 1. బీపీసీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 394. స్టాప్‌లాస్‌ రూ. 351. ఏడాది ఆరంభం నుంచి ఓఎంసీ స్టాకులు కిందామీదాపడుతున్నాయి. రికార్డు గరిష్ఠాల నుంచి దాదాపు 25- 30 శాతం పతనమై ఇప్పుడిప్పుడే రికవరీ చూపుతున్నాయి. వీటిలో బీపీసీఎల్‌లో రికవరీ బాగుండే సూచనలున్నాయి. చార్టుల్లో బుల్లిష్‌ ఐలాండ్‌ రివర్సల్‌ పాటర్న్‌

జోరుగా ఐటీ షేర్ల ర్యాలీ

Monday 24th September 2018

ముంబై:- మిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌ భారీగా నష్టపోయినప్పటికీ.., ఐటీ షేర్లు మాత్రం జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ మరోసారి బలహీనపడటం ఇందుకు కారణవుతోంది. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఇంట్రాడేలో 72.73 స్థాయికి చేరుకుంది. రూపాయి బలహీనతతో డాలర్ల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ఐటీ కంపెనీ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ

Most from this category