STOCKS

News


నిఫ్టీ 2019 టార్గెట్‌ 11,300!

Wednesday 9th January 2019
Markets_main1547013859.png-23481

బోఫాఎంఎల్‌ అంచనా
ఈ ఏడాది చివరి నాటికి నిఫ్టీ టార్గెట్‌ 11300 పాయింట్లని బోఫాఎంఎల్‌ అంచనా వేసింది. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు చేపట్టిన లిక్విడిటీ ఇంజెక‌్షన్‌ కార్యక్రమాలు నెగిటివ్‌గా మారాయని అభిప్రాయపడింది. చమురు ధరల తరుగుదలతో ఎర్నింగ్స్‌ అప్‌గ్రేడ్స్‌ ఏమీ ఉండకపోవచ్చని, ఇప్పటికే ఎర్నింగ్స్‌ పెరుగుదల ప్రైస్‌ఇన్‌ అయిందని తెలిపింది. భారత బిజినెస్‌ సైకిల్‌కి ఎన్నికలు పట్టించుకోదగ్గ అంశం కాదని, కాకపోతే ఈ సంవత్సరానికి మాత్రం కీలక సంఘటనని తెలిపింది. నిఫ్టీ పీఈ గరిష్ఠస్థాయిల వద్దే ఉండొచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది కూడా దేశీయ మార్కెట్లు కఠిన పరిస్థితులే ఎదుర్కుంటాయని బోఫాఎంఎల్‌ భారత వ్యూహకర్త సంజయ్‌ మూకిమ్‌ చెప్పారు. ఎర్నింగ్స్‌లో కొద్దిపాటి పెరుగుదలే ఉంటుందని, దీంతో పలు స్టాకుల పీఈలు దెబ్బతింటాయని తెలిపారు. ఇటీవల కాలంలో పీఈల పెరుగుదల కారణంగా స్టాకుల్లో అనూహ్య ర్యాలీలు వచ్చాయన్నారు. అయితే ఇకపై ఈ పరిస్థితి ఉండబోదన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు కూడా రిస్కీగా మారుతున్నాయని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నిఫ్టీ ఈపీఎస్‌ 24 శాతం ఉండొచ్చని అంచనా వేశారు. 
నిఫ్టీలో పెరుగుదల కేవలం నాలుగు బడా స్టాకులు(హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్‌) కారణంగా వచ్చిందన్నారు. గతేడాది మిడ్‌క్యాప్స్‌ భారీగా పతనమయ్యాయని, కానీ ఇంకా అవి అధిక వాల్యూషన్ల వద్దే ఉన్నాయని చెప్పారు. లార్జ్‌క్యాప్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్స్‌ ఇప్పటికీ 80 శాతం ప్రీమియంతో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఫైనాన్షియల్స్‌పై ఓవర్‌వెయిట్‌గా ఉన్నామని సంజయ్‌ చెప్పారు. గతంలో ఎన్‌పీఏల కారణంగా ఏర్పడ్డ రిస్కులు క్రమంగా తొలగిపోయాయన్నారు. ఎన్‌బీఎఫ్‌సీల నుంచి బ్యాంకులు మార్కెట్‌ వాటా అందిపుచ్చుకుంటాయని అంచనా వేశారు. బ్యాంకులతో పాటు ద్విచక్రవాహన ఉత్పత్తి కంపెనీలు, సిమెంట్‌ కంపెనీలపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రజాకర్షక విధానాలను ప్రవేశపెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. You may be interested

ఇన్ఫోసిస్‌కు బైబ్యాక్‌ బూస్టింగ్‌

Wednesday 9th January 2019

3శాతం ర్యాలీ చేసిన షేర్లు షేర్ల బై బ్యాక్‌ అంశం తెరపైకి రావడంతో సాంకేతిక సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ షేర్లు బుధవారం 3శాతం లాభపడ్డాయి. ఇన్వెస్టర్ల, ప్రమోటర్లు నుంచి ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియ(బై బ్యాక్‌) అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు జనవరి 11న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు మంగళవారం మార్కెట్‌ ముగింపు అనంతరం ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా నేడు బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌

రూ.999లకే ఎయిర్‌ ఏషియా టికెట్‌

Wednesday 9th January 2019

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ సందర్భంగా ఎయిర్‌ ఏషియా ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీ రూట్లలో కేవలం రూ.999 లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. జనవరి 21 నుంచి 31 వరకు జరిగే ఒకవైపు ప్రయాణాలపై ఆఫర్‌ వర్తిస్తుండగా.. ఇందుకు సంబంధించిన బుకింగ్స్‌ జనవరి 7 నుంచి 20 వరకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 19 గమ్యస్థానాలకు డిస్కౌంట్‌ అమల్లో ఉంది. ఈ జాబితాలో బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై,

Most from this category