STOCKS

News


ఈ వారం ఎలా ఉండొచ్చు?

Saturday 5th January 2019
Markets_main1546686620.png-23437

గత వారం మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లు చవిచూశాయి. నిఫ్టీ అధోముఖ వాలు రేఖ వద్ద పదే పదే నిరోధాన్ని ఎదుర్కొంది. వారమంతా యత్నించినా సూచీలు భారీ అప్‌మూవ్‌ జరపలేకపోయాయి. అయితే వారం మొత్తం మీద డెరివేటివ్స్‌లో భారీగా షార్ట్స్‌ పెరిగాయి. కానీ షార్ట్‌ కవరింగ్‌ మాత్రం జరగలేదు. ఈ వారం షార్ట్స్‌లో కవరింగ్‌కు ఛాన్సులున్నాయి. నిఫ్టీ గతవారాన్ని తన 50 రోజుల డీఎంఏ స్థాయి 10753 పాయింట్లకు దిగువన ముగించింది. ఇదే స్థాయిల వద్ద పైన చెప్పిన అధోముఖ వాలురేఖా నిరోధం ఉంది. ఈ వారాన్ని సూచీలు పాజిటివ్‌గా ఆరంభించే ఛాన్సులున్నాయి. పాజిటివ్‌నెస్‌ కొనసాగాలంటే ముందు ఇందాక చెప్పిన 10753 పాయింట్ల పైన నిఫ్టీ స్థిరంగా ఉండాలి. ప్రస్తుతానికి నిఫ్టీ స్వల్ప శ్రేణిలో ఊగిసలాడేలా ఉంది. ఈ శ్రేణి నుంచి భారీ కదలిక ఎటువైపైనా ఉండొచ్చు. 


ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌ న్యూట్రల్‌గా ఎంఏసీడీ బుల్లిష్‌గా కనిపిస్తున్నాయి. చార్టుల్లో ఎంగల్ఫింగ్‌ బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పడింది. డౌన్‌ట్రెండ్‌లో ఈ క్యాండిల్‌ ఏర్పడడం ట్రెండ్‌ రివర్సల్‌ ఛాన్సులను చూపుతోంది. ఏది ఏమైనా కొత్తవారంలో మరోమారు సూచీలు గత నిరోధాలను దాటే యత్నాలు గట్టిగా చేయవచ్చు. అయితే నిఫ్టీ 10900- 11000 పాయింట్లపైన బలంగా క్లోజయితేనే అప్‌మూవ్‌ కొనసాగుతుంది. గత వారపు కనిష్ఠం 10628 పాయింట్ల స్థాయి ఈ వారానికి గట్టి మద్దతుగా నిలబడనుంది. ఈ స్థాయిని కోల్పోతే సూచీలు బాగా బలహీనపడతాయి. కానీ ఈ వారం డౌన్‌సైడ్‌ కదలికలకు ఆస్కారం తక్కువగా కనిపిస్తోంది. షార్ట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దిగువ స్థాయిల్లో కొనుగోళ్లు ఉంటాయని అంచనా. నిఫ్టీ ట్రెండ్‌ నిర్ధారితమయ్యేవరకు తక్కువ పొజిషన్లతో ట్రేడ్‌చేస్తూ చేతిలో మిగులు ధనం ఉంచుకోవడం మంచిది. వీలయినంతవరకు షార్ట్స్‌కు దూరంగా ఉండాలని, దిగువస్థాయిల్లో కొనుగోళ్లు చేయాలని, మొత్తం మీద అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచన. You may be interested

ట్రంప్‌ దిగమన్నా దిగను!

Saturday 5th January 2019

ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ఫెడ్‌ విధానాలపై అసంతృప్తితో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనను రాజీనామా చేయమన్నా, తాను చేయనని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యానించారు. వడ్డీరేట్ల పెంపుదలపై ఇకనుంచి ఓపిగ్గా ఉంటామని భరోసా ఇచ్చారు. మార్కెట్ల డౌన్‌సైడ్‌ రిస్కులను దృష్టిలో ఉంచుకొని ఇకమీదట సున్నితంగా వ్యవహరిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో యూఎస్‌ మార్కెట్లు ఒక్కమారుగా ఎగిశాయి. ఫెడ్‌ దూకుడుతో అమెరికా ఎకానమీ మరోమారు మందగమనం బాట పట్టవచ్చని భావిస్తున్న

ఈసీఎల్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీడీ ఇష్యూ పూర్తి

Saturday 5th January 2019

హైదరాబాద్‌: ఎడెల్‌వీజ్‌ గ్రూపునకు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఈసీఎల్‌ ఫైనాన్స్‌... సెక్యూర్డ్‌ ఎన్‌సీడీల ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్లకు పైగా నిధులను సమీకరించింది. రిటైల్‌ విభాగంలో అధిక స్పందన లభించింది. ఈ విభాగం నుంచే రూ.500 కోట్లు లభించాయి. 1.78 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. హై నెట్‌వర్త్‌ ఇన్వెస్టర్ల విభాగం నుంచి రూ.230 కోట్లు సమకూరాయి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో తమ ఎన్‌సీడీ ఇష్యూకు వచ్చిన స్పందన అద్భుతంగా

Most from this category