STOCKS

News


వచ్చే వారం ఎలా ఉండొచ్చు?

Saturday 15th December 2018
Markets_main1544876244.png-22976

ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా వారాంతానికి దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. దీంతో రాజకీయ అంశాలు మార్కెట్లపై తాత్కాలిక ప్రభావాన్ని మాత్రమే చూపుతాయని మరోమారు నిరూపితమైంది. ఈ వారం చివరకు నిఫ్టీ దాదాపు ఒక శాతం లాభంతో 10805 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం 10333పాయింట్ల కనిష్ఠం నుంచి నిఫ్టీ దాదాపు 500 పాయింట్ల ర్యాలీ జరిపింది. అయితే ఇప్పటికీ నిఫ్టీ తాత్కాలిక టాప్‌ 10940 పాయింట్ల దిగువనే ఉంది. ఈ స్థాయి ఇకపై నిరోధంగా పనిచేయవచ్చు. వచ్చే వారం సూచీలు స్తబ్దుగా ఆరంభమైనా వారం మొత్తం తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయని అంచనా.
పైస్థాయిలో 10940 పాయింట్లను దాటితే 11100, 11275 పాయింట్ల వద్ద నిరోధాలు ఎదురవుతాయి. దిగువన 10710, 10600 పాయింట్లు మద్దతుగా నిలుస్తాయి.

గత వారం కన్నా ఈ వారం నిఫ్టీ రేంజ్‌ మరింత విస్తృతంగా ఉండే ఛాన్సులున్నాయి. చార్టుల్లో ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ స్వల్ప బేరిష్‌నెస్‌ చూపుతున్నాయి. అందువల్ల నిఫ్టీ తక్షణం 10940 పాయింట్లను అధిగమించకుంటే క్రమంగా మరోమారు నేల చూపులు చూడవచ్చు. ట్రేడర్లు కచ్ఛితమైన స్టాప్‌లాస్‌తో అ‍ప్రమత్తంగా వ్యవహరించాలి.
ఆటో రంగంలో ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఆటో, ఎన్‌బీఎఫ్‌సీల్లో కెన్‌ఫిన్‌హౌస్‌, ఐబీ హౌసింగ్‌, ఎఫ్‌ఎంసీజీల్లో ఐటీసీ, డాబర్‌ షేర్లను పరిశీలించవచ్చు. 



You may be interested

జీవిత బీమా పాలసీల్లో భారీ వృద్ధి

Sunday 16th December 2018

జీవిత బీమా పాలసీల ప్రాధాన్యతను మన దేశీయులు బాగానే అర్థం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సూచికగా సగటు టికెట్‌ సైజు గత పదేళ్ల కాలంలో 2.45 రెట్లు పెరిగిందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఓ సగటు రిటైల్‌ కస్టమర్‌ నుంచి వసూలు చేసే రెగ్యులర్‌ ప్రీమియం రూ.9,942 ఉండగా, 2017-18 సంవత్సరంలో ఇది రూ.22,549కి పెరిగినట్టు పేర్కొంది. టికెట్‌ సైజు పెరగడం అంటే

పెట్టుబడి నిరంతర ప్రక్రియ!

Saturday 15th December 2018

ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది ఒకసారి చేసి అపే ప్రక్రియ కాదు. మన మనుగడ బాగుండాలంటే నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగించాలి. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని గుర్తించి పెట్టుబడి ప్రక్రియను మరవకుండా కొనసాగించాలి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్‌కు లక్ష్యం తప్పనిసరి. లక్ష్యం లేకుంటే ఎంత కాలం మదుపు చేయాలి, ఎంత మొత్తం చేయాలన్న స్పష్టత ఉండదు. భవిష్యత్తు అవసరాలే లక్ష్యం అయితే ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా అధిక రాబడులను అందుకోవచ్చు. అదే స్వల్ప

Most from this category