STOCKS

News


నెలరోజుల్లో ఎన్నికల కాక తగులుతుంది!

Tuesday 7th August 2018
Markets_main1533637992.png-19020

మార్కెట్లపై సమీర్‌ అరోరా అంచనా
ప్రస్తుతం దేశీయ సూచీల్లో రిలీఫ్‌ర్యాలీ నడుస్తోందని, కొంత కాలం పోతే కానీ సూచీలకు ఎన్నికల కాక తగిలి పతనాభిముఖంగా పయనిస్తాయని హీలియోస్‌ క్యాపిటల్‌ మేనేజర్‌, మార్కెట్‌ నిపుణుడు సమీర్‌ అరోరా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశీయ ఈక్విటీ సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు అటుఇటుగా తిరుగుతునానయి. ఎర్నింగ్స్‌పై ఆశలతో సూచీలు పాజిటివ్‌గా రియాక్టవుతున్నాయని సమీర్‌ చెప్పారు. క్రమంగా మరో నెల రోజుల్లో సూచీల చూపు ఎన్నికలపై పడుతుందన్నారు. ఎన్నికలంటేనే అస్థిరతకు పునాది అని, అందువల్ల క్రమంగా సూచీల్లో కరెక‌్షన్‌, కన్సాలిడేషన్‌ రావచ్చని చెప్పారు. 
రంగాలవారీగా..
- టెలికం రంగంలో ఇబ్బందులు దాదాపు 70 శాతం వరకు తొలగినట్లే... అయితే ఈ రంగంపై రియలన్స్‌ జియో ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. అందువల్ల టెల్కోలు సతమతమవుతూనే ఉంటాయి.
- ఫైనాన్షియలైజేషన్‌, ఫార్మలైజేషన్‌ థీమ్స్‌ ప్రస్తుతం చాలా బుల్లిష్‌గా ఉన్నాయి. పీఎస్‌బీల తలనొప్పులు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ప్రభుత్వ బ్యాంకుల షేర్లను కొనడం లేదన్నారు. ఇవి ఇంకా బలహీనంగానే కనిపిస్తున్నాయని చెప్పారు. 
- కన్జూమర్‌ స్టేబుల్‌ రంగంలోని స్టాకులు భారీ వాల్యూషన్ల వద్ద ఉన్నాయి. ఈ రంగంలో నెస్లెను పరిశీలించవచ్చు. 
- ఏసీలు, మీడియా రంగంలో స్టాకులపై పాజిటివ్‌గా ఉండొచ్చు.
- చమురు మార్కెటింగ్‌ రంగంలో పెద్ద సంస్కరణలేవీ కనుచూపుమేరలోలేవు. అందువల్ల ఓఎంసీలకు దూరంగా ఉండడం బెటర్‌.
- టాటామోటర్స్‌ లాంటి అంతర్జాతీయ కంపెనీల కన్నా దేశీయ విపణిపై దృష్టి పెట్టే ఆటో రంగ స్టాకులను ఎంచుకోవచ్చు. 
- ఐటీ రంగంలో లాభాలను రూపాయి బలపడడం దెబ్బతీస్తోంది.
- ఫార్మా రంగంలో పెద్దగా మార్పులేమీ రాలేదు. ప్రభుత్వం ఇప్పటికీ ధరల నియంత్రణకు యత్నిస్తూనే ఉంది. ఇది ఆందోళన కలిగించే అంశం.You may be interested

మిశ్రమంగా ముగిసిన మార్కెట్‌

Tuesday 7th August 2018

11400 దిగువకు నిఫ్టీ ముంబై:- మార్కెట్‌ మంగళవారం మిశ్రమంగా ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్‌ 26 నష్టంతో 37,665 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 11389 వద్ద ముగిసింది. మెటల్‌, అటో షేర్లు అండగా మార్కెట్‌కు నిలువగా, ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు నష్టాల్లో ముగిశాయి. సూచీలు ఇంట్రాడే మరో సరికొత్త జీవితకాల గరిష్టాలను అధిరోహించాయి. సెన్సెక్స్‌ 290 పాయింట్ల రేంజ్‌లో ట్రేడ్‌ అవ్వగా, నిఫ్టీ 68 పాయింట్ల

టీవీఎస్‌ మోటార్‌ లాభం రూ.146 కోట్లు

Tuesday 7th August 2018

దేశీ నాలుగో అతిపెద్ద టూవీలర్‌ కంపెనీ టీవీఎస్‌ మోటార్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.146.6 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ లాభం రూ.129.5 కోట్లుగా ఉంది. ఈ క్యూ1లో కంపెనీ టూవీలర్‌ విక్రయాలు 14 శాతం వృద్ధితో 8,92,754 యూనిట్లకు పెరిగాయి.

Most from this category