News


మోదీ మంత్రం వినిపించడంలేదు!

Saturday 5th January 2019
Markets_main1546684481.png-23426

మార్కెట్‌కు సుస్థిర ప్రభుత్వం కావాలి
అంబరీశ్‌ బాలిగా
గత ఎన్నికల సందర్భంగా కనిపించిన మోదీ మాయాజాలం ఈ దఫా కనిపించడంలేదని మార్కెట్‌ నిపుణుడు అంబరీశ్‌ బాలిగా చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ బాగా పుంజుకుందన్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సుస్థిర ప్రభుత్వం ఏర్పడడమే మార్కెట్లకు కావాలన్నారు. కొత్త ఏడాదిపై తాను పాజిటివ్‌గా ఉన్నానని, కొత్త ప్రభుత్వం ఎకానమీకి మద్దతుగా నిలుస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాలు బీజేపీని పునరాలోచనలో పడేశాయన్నారు. ఈ ఎన్నికలతో మోదీ పాపులారిటీ పడిపోయిందన్న సంగతి తెలుస్తోందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు స్వల్ప వ్యవధి ఉన్నందున బీజేపీ ప్రభుత్వం తప్పులు దిద్దుకునే యత్నాలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలతో మోదీ వేవ్‌ లేకున్నా మోదీ వ్యతిరేక వేవ్‌ రాకుండా చూసుకునే వీలుందన్నారు. ఈసారి ఎన్నికల అనంతరం బీజేపీ లేదా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నడిచే భాగస్వామ్య ప్రభుత్వం వచ్చేఛాన్సులున్నాయని, బలహీన సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశాలు తక్కువని చెప్పారు. మొత్తం మీద వచ్చే ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయని అంచనా వేశారు. వ్యాపారానికి వ్యతిరేకం కాని ఏ ప్రభుత్వమైనా మార్కెట్లకు రుచిస్తుందని తెలిపారు. ఈ దఫా ఎవరు ఎన్నికైనా వారికి దీటైన ప్రతిపక్షం కూడా ఉండొచ్చన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదన్నారు. 
టార్గెట్‌ 12,500
కొత్త సంవత్సరాంతానికి నిఫ్టీ టార్గెట్‌ 12,500 పాయింట్లుగా ఉండొచ్చని బాలిగా చెప్పారు. స్థిరప్రభుత్వం ఏర్పాటైతే సూచీల్లో ఉత్సాహం వస్తుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఎర్నింగ్స్‌లో మరింత మెరుగుదల ఉండొచ్చని దీంతో మార్కెట్ల పరుగులకు మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. అంతర్జాతీయ పరిస్థితులు చూస్తే చమురు కొన్నాళ్లు దిగువ స్థాయిల్లోనే ఉండే ఛాన్సులున్నాయని చెప్పారు. రూపాయి మారకంలో చెల్లింపులు జరిపేందుకు వీలు కలిగించేలా పలు ప్రభుత్వాలతో కుదుర్చుకుంటున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు రూపాయిని బలపరుస్తాయని అంచనా వేశారు. యూఎస్‌, చైనా వాణిజ్యయుద్ధం కూడా సమసిపోవచ్చన్నారు. బ్రెగ్జిట్‌పై ఈ ఏడాది ఆరంభంలోనే ఒక స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు. 

 You may be interested

రూపాయి... తీవ్ర ఒడిదుడుకులు!

Saturday 5th January 2019

 48 పైసలు లాభంతో 69.72కు రికవరీ ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ శుక్రవారం 48 పైసలు బలపడి 69.72 వద్ద ముగిసింది. బుధ, గురు వారాల్లో రూపాయి విలువ 77 పైసలు బలహీనపడి 69.43 నుంచి 70.20కి పడిపోయింది. శుక్రవారం మళ్లీ 48 పైసలు రికవరీతో 70.20 నుంచి 69.72కు చేరింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల రికవరీ,  ఆరు

కొత్త నిబంధనలకు గడువు పొడిగించండి..

Saturday 5th January 2019

కేంద్రాన్ని కోరనున్న ఈ కామర్స్ సంస్థలు న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి కొత్త నిబంధనల అమలుకు గడువును పొడిగించాలంటూ బడా ఈ కామర్స్ సంస్థలు.. కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిసింది. మార్పులు అమలు చేసేందుకు కనీసం 4- 5 నెలలు పడుతుందని, కాబట్టి అంత వరకూ సమయం ఇవ్వాలని అభ్యర్థించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వాస్తవానికి ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనల

Most from this category