STOCKS

News


డిసెంబర్‌లో మార్కెట్‌పై పట్టు ఎవరిది..?

Tuesday 4th December 2018
Markets_main1543906640.png-22616


ముంబై: గతనెలలో ప్రధాన సూచీలు 5 శాతానికి మించి లాభాలను నమోదుచేశాయి. సెన్సెక్స్‌ 36,000 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 11,000 మార్కుకు సమీపించింది. ఇక నెలలో మార్కెట్‌ ట్రెండ్‌ ఏ విధంగా ఉంటుందనే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా డిసెంబర్‌ నెలలో మార్కెట్‌ బుల్స్‌ పట్టులోనే ఉంటుందనేది గడిచిన 10 ఏళ్లలో మార్కెట్‌ నడిచిన తీరును చూస్తుంటే అర్థమవుతోందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. 2008 నుంచి గడిచిన 10 ఏళ్లలో 7 సార్లు డిసెంబర్‌ నెలలో బుల్స్‌ పట్టుసాధించాయి. ఈ డేటా ఆధారంగా అయితే పాజిటీవ్‌గానే ఉండేందుకు అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అయితే, భారీ ఒడిదుడుకులకు అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడికానుండడం.. ద్రవ్య, పరపతి విధాన నిర్ణయానికి సంబంధించి ఆర్‌బీఐ మూడు రోజల సమావేశం సోమవారం ప్రారంభంకావడం, అమెరికా ఫెడ్‌ సమావేశం కూడా ఇదే నెలలో ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఒడిదుకులు ఉండేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు.

నెల మార్పు
డిసెంబర్‌-2008 9.13
డిసెంబర్‌-2009 1.55
డిసెంబర్‌-2010  3.32
డిసెంబర్‌-2011 -6.25
డిసెంబర్‌-2012 0.63
డిసెంబర్‌-2013 1.30
డిసెంబర్‌-2014  -3.71
డిసెంబర్‌-2015 -0.20
డిసెంబర్‌-2016 0.25
డిసెంబర్‌-2017 3.75

టెక్నికల్‌ అనలిస్టుల అభిప్రాయలు..
డిసెంబర్‌లో నిఫ్టీ 11,000 మార్కును తాకేందుకు అవకాశం ఉందని ఇండియానివాస్‌ సెక్యూరిటీస్‌ రీటైల్‌ రీసెర్చ్‌ ధర్మేష్ కంత్‌ అన్నారు. ముడిచమురు ధరలు 30 శాతం వరకు తగ్గడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం వంటి సానుకూల అంశాల ఆధారంగా చూస్తే.. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

నిఫ్టీ 10,950–11,100 స్థాయి వరకు ర్యాలీ చేసేందుకు ఆస్కారం ఉందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ అరుణ్ కుమార్ విశ్లేషించారు. స్వల్పకాల ఆసిలేటర్లు పాజిటీవ్‌గా ఉన్నట్లు చెప్పారు. మీడియం టెర్మ్‌ ఆసిలేటర్లు మిశ్రమంగా ఉండగా.. దీర్ఘకాలానికి సెల్‌ మోడ్‌లో ఉందన్నారు. ఇక ప్రస్తుతం 70 స్థాయిలో ఉన్నటువంటి డాలర్‌తో రూపాయి మారకం విలువ మీడియం టెర్మ్‌లో 68.50–69.20 స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్నారు. ముడిచమురు ధర 60 డాలర్ల సమీపంలో ఉన్నంత వరకు ఇబ్బంది లేదని వివరించారు.

గడిచిన పదేళ్లలో డిసెంబర్‌ నెలలో ఎఫ్‌ఐఐ, మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) పెట్టుబడుల వివరాలు ఇలా ఉన్నాయి.
నెల     ఎఫ్‌ఐఐ (రూ.కోట్లలో) ఎంఎఫ్‌ (రూ.కోట్లలో)
డిసెంబర్‌-2017     -4,747    8,333
డిసెంబర్‌-2016    -8,494    9,178
డిసెంబర్‌-2015    205    4,544
డిసెంబర్‌-2014    -864    7,037
డిసెంబర్‌-2013    15,425    -411
డిసెంబర్‌-2012    24,299    -2,698
డిసెంబర్‌-2011    -128    580
డిసెంబర్‌-2010    1,476    1,376
డిసెంబర్‌-2009    10,367    -1,761
డిసెంబర్‌-2008    1,330    340You may be interested

ఎదురీదుతున్న ఐటీ షేర్లు

Tuesday 4th December 2018

మార్కెట్‌ నష్టాలకు ఐటీ షేర్లు ఎదురీదుతున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత అందుకు సహకరిస్తుంది. రెండురోజులుగా ముడిచమురు ధరలు ర్యాలీ చేయడం, ప్రధాన కరెన్సీల్లో డాలర్‌ బలపడటం తదితర కారణాలతో దేశీయ ఫారెక్స్‌ రూపాయి క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. రూపాయి కరిగిపోవడంతో డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీలకు కలిసొస్తుంది. అందుకు అనుగుణంగానే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం ర్యాలీ చేసింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం

ఓయోలో రూ.700 కోట్ల గ్రాబ్‌ పెట్టుబడులు!

Tuesday 4th December 2018

న్యూఢిల్లీ: ఆతిధ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓయో సంస్థలో సింగపూర్‌ దేశానికి చెందిన రవాణా సేవలందించే సంస్థ, గ్రాబ్‌ రూ.700 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈ వారంలోనే ఈ డీల్‌ కుదరవచ్చని సమాచారం. గ్రాబ్‌, ఓయో కంపెనీలు తమ కీలక మార్కెట్లుగా ఇండోనేషియాను, ఆగ్నేయాసియాలను గుర్తించాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండోనేషియాలో కార్యకలాపాలు ప్రారంభించిన ఓయో... విస్తరణలో భాగంగా

Most from this category