News


ఎన్నికల ఫలితాలపై మార్కెట్లేమంటున్నాయ్‌!

Thursday 6th December 2018
Markets_main1544093646.png-22709

స్టాక్‌మార్కెట్లకు అస్థిరత అస్సలు నచ్చదు. దేశ రాజకీయ రంగంపై ఎలాంటి సందిగ్ధత కనిపించినా మార్కెట్లు భారీగా భయపడుతుంటాయి. ఎన్నికల సీజన్‌లో మార్కెట్లలో ఆటుపోట్లు ఎక్కువ. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటి ఫలితాలపై మార్కెట్లు ఏమనుకుంటున్నాయి, ఎలా ప్రతిస్పందిస్తాయనేది ఆసక్తికరమైన అంశం. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న విడుదల కానున్నాయి. ఐదు రాష్ట్రాల్లో మూడు హిందీబెల్ట్‌ రాష్ట్రాల ఫలితాలు అత్యంత కీలకం. ప్రస్తుతానికి ఈ మూడింటిలో రాజస్తాన్‌లో కాంగ్రెస్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, మధ్యప్రదేశ్‌లో హోరీహోరీ అనంతరం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని మార్కెట్లు అంచనాకు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఒపినియన్‌ పోల్స్‌ కూడా ఇదే అంశాన్ని బలపరుస్తున్నాయి. ఇందుకు తద్భిన్నంగా జరిగితే మార్కెట్లో మూడ్‌ మారిపోనుంది. 
స్కోరెంత?
‘‘బీజేపీ హిందీబెల్ట్‌ రాష్ట్రాలు(ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌; రాజస్తాన్‌) మూడింటిని నిలబెట్టుకుంటే మార్కెట్లో భారీ ర్యాలీ ఉండవచ్చు. కనీసం 2-1 స్కోరైనా మార్కెట్లు పెద్దగా ఆందోళన పడవు. అదే పరిస్థితి తారుమారై 1-2 లేదా 0-3 స్కోరు కనిపిస్తే మాత్రం మార్కెట్లో భారీ పతనం తప్పదు.’’ అని కోటక్‌ సంస్థ అంచనా వేసింది. ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను మరింత దెబ్బతీస్తుందని మార్కెట్లు భావిస్తాయి. అయితే బీజేపీ ఈ రాష్ట్రాల్లో ఓడినా, స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగుపడుతున్నందున మార్కెట్లో అనవసర పతనం ఉండకపోవచ్చని కొందరి అంచనా. కానీ స్థూల ఆర్థిక గణాంకాలు అనూహ్యంగా మారుతుంటాయని, చమురు ధరల్లో అనుకోని కదలికలు రూపాయిని, క్యాడ్‌ని అతలాకుతలం చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల మాక్రోనెంబర్లు మార్కెట్‌ను చల్లబరచలేవని, బీజేపీ కనుక మెజార్టీ రాష్ట్రాల్లో ఓడితే మార్కెట్లు తట్టుకోవని హెచ్చరిస్తున్నారు. 
సాధారణ ఎన్నికలపై ప్రభావం
రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పెద్దగా మార్కెట్‌ను ప్రభావితం చేయవనేది నిజమేనని, కానీ ప్రస్తుత ఎన్నికలు మాత్రం సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం తప్పక చూపుతాయని ఈక్వినోమిక్స్‌ చెబుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి వచ్చే ఎన్నికల్లో రిపీటవుతుందని భావించవచ్చని తెలిపింది. అలాగే ప్రధాన పార్టీల బదులు ఐదారు పార్టీల కూటమి లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సాధించినా ఇబ్బందిలేదని, అదే కలగూరగంపలాగా 10- 15 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే మార్కెట్లు అంగీకరించవని విశ్లేషించింది. కలగూరగంప ప్రభుత్వాలు కఠినమైన సంస్కరణలను అమలు చేయలేవు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లో ఏ ఒక్క పార్టీకి కనీసం 230కు పైగా సీట్లు వస్తే సుస్థిర ప్రభుత్వం వస్తుందని, కానీ ఈ పార్టీలు 200 సీట్లకు లోపే పరిమితమైతే మార్కెట్లో పతనం గ్యారెంటీ అని నిపుణుల అంచనా. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నందున ఇన్వెస్టర్లు సాధ్యమైనంత వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Friday 7th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:46 సమయంలో 59 పాయింట్ల లాభంతో 10,683 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,626 పాయింట్లతో పోలిస్తే 57 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక

సెన్సెక్స్‌ నష్టం 572 పాయింట్లు

Thursday 6th December 2018

181 పాయింట్లను కోల్పోయిన నిఫ్టీ ప్రపంచమార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్‌ వరుసగా మూడోరోజూ నష్టాలతోనే ముగిసింది. ఆయిల్‌, మెటల్‌ షేర్లు సూచీల భారీ పతనానికి కారణమయ్యాయి. వచ్చేవారం వెలువడనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, నేడు ఆస్ట్రేలియాలో జరగనున్న ఒపెక్‌ దేశాల సమావేశాల సందర్భంగా ఇన్వెస్టర్ల అప్రమత్తత కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 527 పాయింట్లు నష్టపోయి 35,312 వద్ద, ఎన్‌ఎస్‌సీ నిఫ్టీ 182 పాయింట్ల

Most from this category