STOCKS

News


సెన్సెక్స్‌ 400 పాయింట్ల డౌన్‌

Wednesday 2nd January 2019
Markets_main1546418005.png-23369

10800 దిగువకు నిఫ్టీ ఇండెక్స్‌
మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి ఇంట్రాడే కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అటో, మెటల్‌ రంగ షేర్లలో అ‍మ్మకాలు సూచీలను నష్టాల బాట పట్టించాయి. అలాగే ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌తో పాటు యూరప్‌, అమెరికా మార్కెట్లకు చెందిన ఫ్యూచర్ల నెగిటివ్‌ ట్రేడింగ్‌ సైతం మార్కెట్‌పై ప్రభావాన్ని చూపుతున్నాయి.  అలాగే మార్కెట్లో అధిక షేర్లు ఎక్కువగా వాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవుతుండంతో పాటు ఇటీవల కొన్ని షేర్లు తమ గరిష్టాల వద్ద ట్రేడ్‌ అవుతుండంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. మధ్యాహ్నం గం.1:30ని.లకు నిఫ్టీ ఇండెక్స్‌ 150 పాయింట్లు నష్టపోయి 10770ల వద్ద, సెన్సెక్స్‌ 400 పాయింట్లను కోల్పోయి 35850 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా మెటల్‌, అటో షేర్లు నష్టపోయాయి. డిసెంబర్‌లో దేశీయ వాహన విక్రయాలు డిసెంబర్‌లో మందకొడిగా నమోదు కావడంతో అటో షేర్లలోనూ, అంతర్జాతీయంగా మెటల్‌ షేర్ల పతన ప్రభావంతో దేశీయంగా మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. రూపాయి నాలుగురోజుల ర్యాలీకి బ్రేక్‌ పడటంతో డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లు తక్కువగా నష్టపోయాయి.You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Wednesday 2nd January 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా బుధవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 1శాతానికి పైగా నష్టపోయింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల పతనం ఇండెక్స్‌ను దెబ్బతీసింది. మధ్యాహ్నం గం.2:45ని.కు ఇండెక్స్‌ గత ముగింపు(27,392.40)తో పోలిస్తే అరశాతానికి పైగా నష్టపోయి 27,190.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.50శాతం నష్టపోయింది.

అటో షేర్లకు అమ్మక గణాంకాల పోటు

Wednesday 2nd January 2019

7శాతం నష్టపోయిన ఐషర్‌ మోటర్స్‌ ఆటో షేర్లను డిసెంబర్‌ విక్రయ గణాంకాలు నష్టాల బాట పట్టించాయి. పరిశ్రమలో నగదు కొరత, స్థూల ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో డిసెంబరులో దేశీయ వాహన విక్రయాలు మందకొడిగా నమోదయ్యాయి. ఫలితంగా నేటి ఇంట్రాడే అటోరంగ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2.65శాతం నష్టపోయింది. అటో ఇండెక్స్‌ మధ్యాహ్నం

Most from this category