STOCKS

News


ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Wednesday 14th November 2018
Markets_main1542191497.png-22005

ఐటీ, పార్మా రంగ షేర్ల పతనంతో మార్కెట్‌ బుధవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ 2.50 పాయింట్ల నష్టంతో 35,142 వద్ద, నిఫ్టీ 6.20 పాయింట్లను కోల్పోయి 10,576 వద్ద ముగిసింది. ముడిచమురు పతనంతో ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీ లాభాలను ఆర్జించిన సూచీలు చివరి వరకు లాభాలను నిలుపుకోవడంతో విఫలమయ్యాయి. రూపాయి బలపడంతో ఐటీ, ఫార్మా షేర్ల పతనం సూచీల లాభాలను హరించివేశాయి. బ్యాంకింగ్‌,  ఫైనాన్స్‌ రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మా, మెటల్‌, అటో, రియల్టీ రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 161 పాయింట్ల లాభపడి 25,930ల వద్ద ముగిశాయి.  సెన్సెక్స్‌ 34,986.86 -  35,351.88 రేంజ్‌లో ట్రేడైంది. నిఫ్టీ 10,532.70 - 10,651.60 స్థాయిలో కదలాడింది.
నిఫ్టీ 10600పైన ప్రారంభం:-
ప్రపంచమార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ., నేడు దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గతరాత్రి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం ఇందుకు కారణమైంది. చమురు ధరల పతనంతో దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 2నెలల గరిష్టానికి బలపడింది. రూపీ ర్యాలీతో బ్యాంకింగ్‌, ఇంధన, మెటల్‌, వినిమయ రంగాలకు చెందిన మిడ్‌క్యాప్‌ షేర్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 186 పాయింట్ల పెరిగి 35,330 వద్ద ప్రారంభమైంది. నిప్టీ 52 పాయిం‍ట్ల లాభంతో 10600 పైన 10,634 వద్ద ప్రారంభమైంది.
గంటలో లాభాల్ని కోల్పోయిన సూచీలు
భారీ గ్యాప్‌ అప్‌తో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీల లాభాలు గంటలో హరించుకుపోయాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 2నెలల గరిష్టానికి బలపడటంతో ఐటీ షేర్లు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భారీ వెయిటేజీ కలిగిన ఐటీ షేర్ల పతనం సూచీలను నష్టాల్లోకి లాగింది. సూచీల భారీ ఓపెనింగ్‌ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత లాభాల స్వీకరణకు పూనుకోవడం కూడా సూచీలకు ప్రతికూల అంశం మారింది. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన గంట వ్యవధిలోనే సూచీలు ఆరంభలాభాలను కోల్పోయాయి. నిఫ్టీ 10600ల దిగువకు చేరుకుంది. సెన్సెక్స్‌ 100 పాయింట్లను కోల్పోయింది. సెన్సెక్స్‌ 158 పాయింట్ల నష్టంతో 34987 పాయింట్ల వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 10,532 వద్ద చేరుకున్నాయి.

ఒడిదుడుకుల ట్రేడింగ్‌:-
బ్యాంకింగ్‌, ఆయిల్‌ మార్కెటింగ్‌ రంగ షేర్ల ర్యాలీ సూచీల నష్టాల ట్రేడింగ్‌ నుంచి ఆదుకుంది. బ్యాంక్‌ నిఫ్టీ సాంకేతికమైన 26000 పాయింట్లను అందుకోవడంతో బ్యాంకు షేర్లు రిలీఫ్‌ ర్యాలీ చేశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో హెవీవెయిట్‌ షేర్లైన ఐసీఐసీఐ బ్యాంక్‌ సూచీ ఏడాది గరిష్టానికి చేరుకోవడం, ఎస్‌బీఐ షేరు 3శాతం, హెచ్‌డీఎఫ్‌సీ షేరు 1.50శాతం ర్యాలీ చేయడంతో సూచీలకు నష్టాల్లోంచి క్రమంగా లాభాల్లోకి మళ్లాయి. మరోవైపు ముడిచమురు ధరల పతనంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లైన హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ షేర్ల ర్యాలీ కూడా సూచీల ర్యాలీకి సహకరించాయి. ట్రేడింగ్‌ సమయంలో అక్టోబర్‌ నెల సంబంధించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయాయి. ఫలితంగా సూచీలు ట్రేడింగ్‌ మిడ్‌సెషన్‌ నుంచి లాభ, నష్టాల మధ్య దోబూచులాడి చివరకు స్వల్ప నష్టంతో ముగిశాయి.
హెచ్‌సీఎల్‌ టెక్‌, కోటక్‌ బ్యాంక్‌, గెయిల్‌, టెక్‌మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు 3.50శాతం నుంచి 7శాతం నష్టపోయాయి. ఐఓసీ, మారుతి, యూపీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి.



You may be interested

భారత మార్కెట్‌లో ఇంకా రిస్క్‌ ఉంది..!

Wednesday 14th November 2018

సీఎల్‌ఎస్‌ఏ ఇండియా స్ట్రాటజిస్ట్ మహేష్ నందూర్కర్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత మార్కెట్‌లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించిన సీఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌, ఇండియా స్ట్రాటజిస్ట్ మహేష్ నందూర్కర్.. వచ్చే కొద్ది నెలల్లో ద్రవ్య లోటు, వడ్డీ రేట్లు అంశాలు మార్కెట్‌కు అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయని వివరించారు. సంస్థ 21వ ఇండియా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మార్కెట్ల భవిష్యత్తుపై

ఆకర్షణీయమైన 5 బ్యాంక్‌ స్టాక్స్‌..

Wednesday 14th November 2018

అసెట్‌ క్వాలిటీ బాగలేకపోవడం, అధిక కార్పొరేట్‌ రుణాలు, ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, డిఫాల్ట్‌ సమస్యలు, ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు చర్యలు వంటివాటి వల్ల ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పీఎస్‌యూ బ్యాంకులు) షేర్లు ఇన్వెస్టర్ల ఆదరణ పొందలేకపోతున్నాయి. రుణాల్లో వృద్ధి మోస్తారుగా ఉన్నా కూడా పీఎస్‌యూ బ్యాంకులు డిపాజిట్లు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఈడీ, సీఐవో ప్రశాంత్‌ జైన్‌ తెలిపారు. క్రెడిట్‌ సైకిల్‌ టర్న్‌అరౌండ్‌ అయితే పలు బ్యాంకులు మంచి పనితీరు

Most from this category