11700ను తాకిందోచ్!
By Sakshi

ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల ప్రభావంతో మార్కెట్లో బుల్స్ హల్చల్ చేశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆర్థికరంగ షేర్లలో కొనుగోళ్ల వెల్లువతో సూచీలు సోమవారం మరో కొత్త రికార్డుస్థాయి వద్ద ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 442పాయింట్ల లాభంతో 38694 వద్ద, నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 11,692 వద్ద ముగిశాయి. ఈ స్థాయిలో సూచీలు ముగియడం ఇదే ప్రధమం. ఇంట్రాడేలో నిఫ్టీ సూచీ 10,701 వద్ద, సెన్సెక్స్ 38,736.88 వద్ద తమ కొత్త జీవితకాల గరిష్టాలను నమోదుచేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 38,416.73 - 38,736.88 పాయింట్ల రేంజ్లో కదలాడింది. నిప్టీ సూచీ 11,595.60- 11,700.95 పాయింట్ల స్థాయిలో కదలాడింది. ఎన్ఎస్ఈలోని కీలక అన్ని రంగాలకు చెందిన సూచీలన్నీ లాభపడగా, ప్రభుత్వరంగబ్యాంకు ఇండెక్స్ అత్యధికంగా 2.66శాతం శాతం లాభపడింది. కీలకమైన నిఫ్టీ బ్యాంకు 1.54శాతం(430 పాయింట్లు) లాభపడి 28,264 వద్ద ముగిసింది. ఆ ఐదే కారణం.. ప్రపంచమార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితులు... వడ్డీరేట్లపై ఫెడ్ ఛైర్మన్ మెతక వైఖరి... ఆగస్ట్‌లో విదేశీపోర్ట్ఫోలియో నిధుల ప్రవాహం.... డాలర్ మారకంలో రూపాయి షార్ప్ రికవరీ, టెక్నికల్ చార్టుల్లో బుల్లిష్ సంకేతాలతో సూచీలు ఉరుకులు పెట్టాయి. సూచీల్లో ప్రధాన వెయిటేజ్ ఉన్న బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆర్థికరంగాలకు చెందిన షేర్లు లాభాల బాటపట్టాయి. సోమవారం ట్రేడింగ్‌లో ఐసీఐసీఐబ్యాంకు, టెక్‌మహీంద్రా, పవర్‌గ్రిడ్, భారతీఎయిర్‌టెల్, హిందాల్కో షేర్లు 3నుంచి 4శాతం లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, సన్‌ఫార్మా షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి.
You may be interested
సాక్షి బిజినెస్ క్విజ్ - 21 "FIFA ప్రపంచ కప్ 2018"
Monday 27th August 20181. FIFA ప్రపంచ కప్ 2018 సమూహ దశలో ఓడిపోయి తొలిగిపోయిన ప్రతి జట్టుకి కనీస బహుమతి లేదా పారితోషకం చెల్లింపు ఎంత? ఎ) $ 2.5 మిలియన్లు బి) $ 4 మిలియన్లు సి) $ 8 మిలియన్లు డి) $ 10 మిలియన్లు 2. 2018 FIFA ప్రపంచ కప్‌లో 32 జట్లు ఉన్నాయి. ప్రాక్టీస్, తయారీ ఖర్చుల కోసం ప్రతి జట్టుకి ఫిఫా ఎంత చెల్లించింది? ఎ) $ 0.5 మిలియన్లు బి) $ 1.5
హెచ్‌సీఎల్ టెక్కు కలిసిరాని రూపీ పతనం
Monday 27th August 2018రూపాయి జూలైలో 69 స్థాయికి పడిపోయింది. ఇక ఆగస్ట్‌లో 70 దిగువకు క్షీణించి జీవిత కాల కనిష్ట స్థాయిని తాకింది. రూపాయి పతనం ఐటీకి కలిసొచ్చే అంశం. రూపాయి క్షీణించినప్పుడు ఐటీ స్టాక్స్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలోనూ ఇదే జరిగింది. అయితే దీనికి ఒక స్టాక్‌ను మినహాయింపు ఇవ్వాలి. అదే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్. మ్యూచువల్ ఫండ్స్ హెచ్‌సీఎల్ టెక్ స్టాక్‌కి దూరం జరుగుతున్నాయి. జూలైలో దాదాపు 13 ఎంఎఫ్