STOCKS

News


ఆర్‌బీఐ, ఒపెక్‌ సమావేశాలపై మార్కెట్‌ దృష్టి..!

Thursday 29th November 2018
Markets_main1543489044.png-22493

ముంబై: వచ్చే వారంలో వెల్లడికానున్నటువంటి కీలక అంశాల నేపథ్యంలో దేశీ మార్కెట్లు రేంజ్‌ బౌండ్‌లో ఉండేందుకు అవకాశం ఉందని ఆనంద్ రాఠీ బ్రోకింగ్‌ సంస్థలో ఈక్విటీ అడ్వైజరీ విభాగానికి చెందిన సిద్ధార్థ్ సెడాని వ్యాఖ్యానించారు. ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ ద్వారా ద్రవ్య లభ్యతను ఆర్బీఐ పెంచిన కారణంగా బాండ్‌ ఈల్డ్‌ 8.2 నుంచి 7.65 శాతానికి తగ్గినప్పటికీ.. ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్‌ రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న రిస్క్‌ ఇన్వెస్టర్లను కాస్త వెనకడుగు వేసేలా చేస్తుందన్నారు. వచ్చేవారంలో సమావేశంకానున్న ఆర్బీఐ నిర్ణయాలు, ఒపెక్‌ దేశాల నిర్ణయం, సాధారణ ఎన్నికల ఫలితాలు మార్కెట్‌ దిశను నిర్ధేశించనున్నాయని విశ్లేషించారు. ఫండమెంటల్‌గా ఆకర్షణీయంగా ఉన్నటువంటి 3 షేర్లను సిఫార్సుచేశారు.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్ | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.239
ఈఏడాది తొలి అర్ధభాగంలో కంపెనీ రూ.48.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే సమయానికి రూ.30.3 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన ఈ సంస్థ టర్న్‌అరౌండ్‌ అయ్యిందని విశ్లేషించారు. క్యూ2 ఆదాయం ఏడాది ప్రాతిపదికన 11 శాతం వృద్ధి చెంది రూ.2,000 కోట్లకు చేరుకోగా.. ఎబిటిడా 54 శాతం పెరిగి రూ.143 కోట్లుగా నమోదైంది. మధుర లైఫ్‌స్టైయిల్ బ్రాండ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ, పాంటలూన్స్‌ విక్రయాలు మెరుగుపడడం వంటి అంశాలు స్థూల మార్జిన్ల వృద్ధికి దోహదపడినట్లు వివరించారు. ప్రస్తుత త్రైమాసికంలో ఆరు పాంటలూన్స్‌ స్టోర్లు ప్రారంభించగా వీటి సంఖ్య ప్రస్తుతానికి 288గా ఉంది. 59 మధుర లైఫ్‌స్టైయిల్ బ్రాండ్‌ స్టోర్స్‌ చేరికతో వీటి సంఖ్య 1,897గా ఉన్నట్లు వెల్లడించారు.

ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.1,940
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ ఆదాయం 27.1 శాతం పెరిగింది. తమ క్లౌయింట్లకు డిజైన్‌, డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌లో పూర్తిస్థాయి సేవలను అందిస్తోంది. ప్రస్తుత ఏడాది మొత్తానికి సైతం ఆదాయం 20 శాతానికి మించి ఉండనుందని యాజమాన్యం ధీమా వ్యక్తం చేసినట్లు వివరించారు.

ఆర్తి ఇండస్ట్రీస్ | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.1,600
స్పెషాలిటీ కెమికల్స్‌ రంగంలోని ఈ సంస్థ బెంజీన్ ఆధారిత కెమిస్ట్రీలో గ్లోబల్‌ లీడర్లలో ఒకటిగా కొనసాగుతోంది. వచ్చే రెండేళ్ల పాటు ఆదాయం ఏటా 20 శాతం, నికర లాభం 22 శాతం చొప్పున వృద్ధిచెందనుందని అంచనావేశారు.

ఇవి కేవలం విశ్లేషకులు అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.



You may be interested

పెరిగిన డిఫాల్ట్‌ రిస్క్‌ కంపెనీల జాబితా

Thursday 29th November 2018

default ముంబై: రుణాలను చెల్లించడంలో వైఫల్యం చెంది చివరకు దివాళ దశ వరకు కూడా చేరుకోదగిన కంపెనీల జాబితా ఈ ఏడాదిలో మరింత పెరిగింది. బీఎస్‌ఈ 500 కంపెనీలలో ఈ ఏడాది ప్రారంభంలో కేవలం 24 సంస్థలు మాత్రమే 0.52 శాతం డిఫాల్ట్‌ రిస్క్‌ దాటిన సంస్థల ఈ జాబితాలో ఉండగా.. ఇప్పుడు వీటి సంఖ్య ఏకంగా 77కు చేరుకుంది. వోడాఫోన్ ఐడియా, దీవాన్ హౌసింగ్, బొంబే డైయింగ్, శ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,

ఫండ్‌ హౌస్‌లకు రూ.700 కోట్లు చెల్లించిన రాణా కపూర్‌..!

Thursday 29th November 2018

ముంబై: ప్రైవేట్ రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ షేరు ధర గడిచిన రెండు రోజుల్లోనే 20 శాతానికి మించి నష్టపోయింది. గురువారం ట్రేడింగ్‌లో రూ.146.75 వద్దకు క్షీణించి 52 వారాల కనిష్టస్థాయిని తిరగరాసింది. ఇంతటి భారీ స్థాయిలో షేరు ధర పతనం కావడంతో బ్యాంకు డిబెంచర్లను కొనుగోలుచేసిన మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌ల నుంచి ప్రమోటర్లపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. యస్‌ బ్యాంక్‌ హోల్డింగ్‌ కంపెనీలైన యస్‌ సెక్యూరిటీస్‌, మోర్గాన్‌ క్రెడిట్స్‌

Most from this category