News


మార్కెట్‌ ప్రస్తుత ఆశావాదం మోసపూరితం..!

Saturday 1st December 2018
Markets_main1543660447.png-22571

సామ్‌కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకులు, సీఈఓ జమీత్ మోడీ వ్యాఖ్య

ముంబై: కొనసాగుతున్న ఎన్నికల అంశాలను పక్కన పెట్టి దేశీ స్టాక్‌ సూచీలు గడిచిన వారం రోజుల్లో క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అమెరికా వడ్డీ రేట్లు చారిత్రక ప్రమాణాల కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సూచీలు వరుసగా 5 రోజులపాటు లాభాలను నమోదుచేశాయి. వడ్డీ రేట్లకు సంబంధించి ఈయన కీలక వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రపంచవ్యాప్త మార్కెట్లలో ఇదే ట్రెండ్‌ కొనసాగింది. ఆర్థిక వ్యవస్థ తటస్థ స్థాయిలో ఉందన్న అంచనాలు విస్తృత పరిధిలో ఉండగా.. వడ్డీ రేట్లు ఇంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయన్న ఆయన కామెంట్‌తో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ)లు భారత మార్కెట్లలో పెట్టుబడులను కుమ్మరించారు. వరుసగా ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మార్కెట్‌ నుంచి తమ సొమ్మును ఉపసంహరించుకున్న వీరు.. నవంబర్‌లో ఇప్పటివరకు  ఈక్విటీ, డెట్‌లో కలిపి రూ.10,000 కోట్లను పెట్టుబడి పెట్టారు. 10-15 శాతం ది‍ద్దుబాటు తరువాత వాల్యుయేషన్స్‌ చౌకగా ఉన్నందున ఎఫ్‌ఐఐల పెట్టుబడులు మరింత కొనసాగయని వెల్లడైందని సామ్‌కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకులు, సీఈఓ జమీత్ మోడీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సానుకూల అంశాల కారణంగా ఎన్నికల వేడి నుంచి పక్కకు తప్పుకుని ఆకస్మిక ఉత్సాహకర వాతావరణం మార్కెట్లలో నెలకొందని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. నిఫ్టీ డైలీ చార్టులో డోజీ పాట్రన్‌ ఏర్పడిందని.. 10,950 పాయింట్ల వద్ద బలమైన నిరోధం ఉందని విశ్లేషించారు. తానైతే.. లాంగ్‌ పొజిషన్లలో ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోమని సూచిస్తానని చెప్పారు. మార్కెట్లలో బలహీనత వచ్చిన తరువాత షార్ట్‌ చేయవచ్చని సూచించారు. You may be interested

బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె సైరన్‌!!

Saturday 1st December 2018

బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, దేనా బ్యాంక్‌, విజయ బ్యాంక్‌ విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్‌ 26న దేశవ్యాప్తంగా సమ్మె చేపడతామని బ్యాంకు యూనియన్లు తాజాగా హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే ఈ మూడు ‍ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయించుకుంది. అలాగే ఆయా బ్యాంకులు బోర్డులు కూడా విలీనానికి అంగీకారం తెలిపాయి.  యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు నేతృత్వం వహించనుంది. కేంద్ర

యాపిల్‌కు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్‌

Saturday 1st December 2018

దాదాపు ఎనిమిదేళ్ల తరువాత యాపిల్‌ను వెనక్కి నెట్టి అత్యంత విలువైన అమెరికా కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ అవతరించింది. గతరాత్రి అమెరికా మార్కెట్లో 851.2 బిలియన్‌ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఒక ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా అవతరించిన యాపిల్‌ తాజాగా 847.4 మిలియన్‌ డాలర్లకు దిగివచ్చింది. ‘‘రానున్న రోజుల్లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యాపార వృద్ధి అంచనాలతో మైక్రోసాఫ్ట్‌ షేరు 0.60 శాతం ర్యాలీ చేసి 110.89

Most from this category