News


ఎకానమీపై ఉదయ్‌ కోటక్‌ ఆందోళన

Friday 15th February 2019
Markets_main1550212818.png-24209

దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదని ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ అభిప్రాయపడ్డారు. కానీ సరైన చర్యలు తీసుకుంటే ఈ సమస్య వ్యవస్థీకృతం కాకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. కంపెనీల బాలెన్స్‌ షీట్లు బాగుపడి, వాటిపై నమ్మకం కలిగే వరకు ఇన్వెస్టర్లలో భయం పోదన్నారు. ఇప్పటివరకు స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు విస్తృత బాధను చవిచూశాయని చెప్పారు. ఇకపై వీటి కష్టాలు కాస్త గట్టెక్కుతాయని అంచనా వేశారు. చిన్న షేర్లకు ఇబ్బందులున్నా గతేడాది ఉన్న ఇబ్బందులుంటాయనుకోవడంలేదన్నారు. లార్జ్‌క్యాప్స్‌లో కనిపించే స్థాయి సర్దుబాటు చిన్నస్టాకుల్లో కూడా కనిపించిందన్నారు. చిన్నస్టాకుల్లో కరెక‌్షన్‌ కారణంగా గతేడాది చాలా మొత్తం లార్జ్‌క్యాప్స్‌వైపు మరలిందన్నారు. ఇకపై క్రమంగా చిన్నస్టాకులకు ఆదరణ పెరిగే ఛాన్సులున్నాయని చెప్పారు. రెసిడెన్షియల్‌ రియల్టీ విభాగంపై ఇంకా ఒత్తిళ్లు కొనసాగుతున్నాయని ఉదయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం డౌన్‌..!

Friday 15th February 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాంక్‌ షేర్లు శుక్రవారం భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో​బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిప్టీ 1.30శాతం నష్టపోయింది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(26,970.60)తో పోలిస్తే 1శాతం నష్టంతో 26,687.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక ఇండెక్స్‌లో మొత్తం 12 షేర్లకు గానూ అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌

డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లకు బ్రోకరేజ్‌ జెఫ్పారీస్ షాక్‌

Friday 15th February 2019

డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లకు జెఫ్పారీస్ బ్రోకరేజ్‌ సం‍స్థ షాక్‌నిచ్చింది. హైదరాబాద్‌లో బూచుపల్లి యూనిట్‌ అబ్జర్వేషన్‌ అంశంపై రేటింగ్‌ సంస్థ ఆందోళన వ్యక్తం చేయడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో ఏకంగా 30 శాతం కుప్పకూలాయి. బూచుపల్లి యూనిట్‌లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ తనిఖీలు నిర్వహించి 11 లోపాలున్నట్లు ఫామ్‌ - 483ను జారీ చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫిబ్రవరి 8వ తేదీన సమాచారం ఇచ్చింది.

Most from this category