STOCKS

News


నిలిచిపోయిన జెబ్‌పే సేవలు

Saturday 29th September 2018
Markets_main1538160224.png-20683

ఎట్టకేలకు దేశీయ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌ జెబ్‌పే తన సేవల్ని నిలిపివేసింది. ట్రేడింగ్‌ సేవలను నిలిపివేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అహ్మదాబాద్‌ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఎక్సేంజ్‌కు సంబంధించి అన్ని రకాల సేవలను నిలిపివేస్తున్నామని, పూర్తి కాని అన్ని ఆర్డర్లు రద్దవుతాయని, ఆయా ఫండ్స్‌ను కస్టమర్ల జెబ్‌పే వ్యాలెట్లకు క్రెడిట్‌ చేయడం జరుగుతుందని సంస్థ తెలిపింది. 

 

బ్యాంకు అకౌంట్లపై నియంత్రణలతో తమ, తమ కస్టమర్ల వ్యాపార నిర్వహణ సామర్థ్యాన్ని కట్టేసినట్టయిందని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ నిషేధం తర్వాత తమ సేవలను కస్టమర్లకు అందించేందుకు పలు ప్రత్యామ్నాయాలను పరిశీలించామన్న సంస్థ, ఇటీవలి కొన్ని నెలలను మరీ గడ్డుకాలంగా అభివర్ణించింది. ఎక్సేంజ్‌ మూసివేసినప్పటికీ తమ వ్యాలెట్‌ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. చట్టవిరుద్ధమైన క్రిప్టోకరెన్సీల్లో లావాదేవీల నిర్వహణకు ఏ వ్యక్తికి కానీ, సంస్థకు కానీ బ్యాంకులు సేవలు అందించకుండా దేశీయ బ్యాంకులను ఆర్‌బీఐ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆదేశించింది. దీంతో జెబ్‌పే తన ప్రధాన కార్యాలయాన్ని క్రిప్టోకరెన్సీలకు అనుకూలంగా ఉన్న సింగపూర్‌, బెలారస్‌ లేదా అమెరికాకు తరలించాలని ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయింది.



You may be interested

ఈ ప్రమోటర్లకు తమ షేర్లపై నమ్మకమెక్కువ!

Saturday 29th September 2018

ప్రమోటర్లు తమ కంపెనీ స్టాక్స్‌ను స్వయంగా కొనుగోలు చేశారంటే...? అది భవిష్యత్తు వృద్ధిపై నమ్మకానికి నిదర్శనంగానే చూస్తారు మార్కెట్‌ నిపుణులు. ఇటీవలి కాలంలో చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో పేరున్న కంపెనీల షేర్లు సైతం ఎవరూ ఊహించని కనిష్ట ధరలకు పడిపోయాయి. ఆర్థిక ప్రతికూల అంశాల మధ్య ఒక విధమైన విచక్షణారహిత అమ్మకాల ఒరవడితోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితితో చాలా ఆకర్షణీయమైన విలువలకు చాలా

3 నెలల వరకూ పాజిటివ్‌ రిటర్న్స్‌కు నో ఛాన్స్‌..

Friday 28th September 2018

ఈక్విటీ మార్కెట్లు వచ్చే మూడు నెలలపాటు పాజిటివ్‌ రిటర్న్స్‌ అందించకపోవచ్చని ఇండియా జెన్‌ ఫండ్‌ డైరెక్టర్‌/ సీఐవో, పీఎంఎస్‌ హెడ్‌ (ఈక్విటీస్‌) మనీశ్‌ సంతాలియా తెలిపారు. ఆగస్ట్‌ 28 నాటి రికార్డ్‌ గరిష్ట స్థాయి నుంచి చూస్తే సెన్సెక్స్‌ 2,500 పాయింట్లకుపైగా పతనమైందని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ కారణంగా తలెత్తిన లిక్విడిటీ భయాలు, రూపాయి అస్థిరత, క్రూడ్‌ ధరల పెరుగుదల వంటి అంశాలు ఇందుకు కారణమని తెలిపారు. ‘ప్రస్తుత పతనం

Most from this category