STOCKS

News


ఏడాదిన్నర కనిష్టానికి క్రూడాయిల్‌

Tuesday 25th December 2018
Markets_main1545727643.png-23224

ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో పాటు క్రూడ్‌ ఉత్పత్తి పెరుగుదలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర ఏడాదిన్నర కనిష్టానికి పతనమయ్యింది. గతరాత్రి అమెరికా మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 6.50శాతం క్షీణించి 50.47 డాలర్ల వద్ద ముగిసింది. క్రూడ్ ఉత్పత్తిదారులు తన ఉత్పత్తులను భారీగా పెంచడంతో క్రూడాయిల్‌ ధర వారంలో రోజుల్లోనే ఏకంగా 11శాతం క్షీణించగా, ఈ త్రైమాసికంలో 40శాతానికి పైగా దిగివచ్చింది. మరోవైపు ఒపెక్ దేశాలు ఇంధన ఉత్పత్తిలో కోత విధింపుపై సందేహాలు తలెత్తడం కూడా క్రూడాయిల్‌ ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. భారీగా క్షీణించిస్తున్న క్రూడాయిల్‌ ధరలను అదుపులో తెచ్చేందుకు ఒపెక్‌ దేశాలు జనవరి నుంచి రోజుకు 1.2 మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించుకోవడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘‘ప్రపంచదేశాల సూక్ష్మఆర్థిక వ్యవస్థ గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడంతో క్రూడాయిల్‌కు డిమాండ్‌కు తగ్గుతోంది.  ఈ డిసెంబర్‌లో ఈక్విటీ మార్కెట్లు 9.5శాతం క్షీణించాయి. యూరోజోన్‌ రుణ సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ అంశాలన్నీ క్రూడాయిల్‌ ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి.’’ అని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు.



You may be interested

వచ్చే ఏడాదికి ఎస్‌ఎంసీ గ్లోబల్‌ 10 సిఫార్సులు

Tuesday 25th December 2018

అధిక క్రూడ్‌ ధరలు, విదేశీ ఇన్వస్టర్ల అమ్మకాలతో ఈ ఏడాది  సతమతమైన మార్కెట్‌ వచ్చే ఏడాది మెరుగైన రాబడుల్ని ఇవ్వవచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ అంచనావేసింది.  అయితే ఇటీవల క్రూడ్‌ ధర దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు మొదలుపెట్టడం సానుకూలమయ్యింది.  ఈ ఏడాదిలో ఇతర వర్థమాన దేశాల మార్కెట్లతో పోలిస్తే మనదేశీయ మార్కెట్‌ ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. ఆర్థిక వృద్ధి మందగమనం, వాణిజ్య యుద్ధ భయాలు, పలు దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకుల

అల్టోను అధిగమించిన స్విఫ్ట్‌

Tuesday 25th December 2018

బాగా అమ్ముడైన టాప్‌-10లో ఆరు మారుతీవే చివరి నాలుగు స్థానాలను సాధించిన హ్యుందాయ్‌ సియామ్‌ వెల్లడి న్యూఢిల్లీ: అధికంగా అమ్ముడవుతున్న ప్రయాణికుల కారుగా మారుతీ ఆల్టోను తోసిరాజని అదే కంపెనీకి చెందిన స్విఫ్ట్‌ నిలిచింది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ప్రయాణికుల కారుగా మారుతీ సుజుకీ ఇండియాకు చెందిన స్విఫ్ట్‌ రికార్డ్‌ను సాధించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాల పరంగా అగ్రస్థానంలో నిలిచిన మారుతీ ఆల్టో కారు ఈ ఏడాది నవంబర్‌ నెలలో

Most from this category