STOCKS

News


10100 పాయింట్ల వద్ద కీలక మద్దతు

Tuesday 9th October 2018
Markets_main1539065789.png-20972

గతవారమంతా నేల చూపులు చూస్తున్న సూచీలు సోమవారం కాస్త ఊపిరితీసుకున్నాయి. అయితే గతవారం ప్రధాన సూచీలు తమ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. రూపీలో బలహీనత, క్రూడాయిల్‌ ధర పెరుగుదల, ఎన్‌బీఎఫ్‌సీల గోల, ఆర్‌బీఐ రేట్లు యథాతధంగా ఉంచడం.. మార్కెట్లను కుంగదీశాయి. అది, ఇది అని తేడా లేకుండా అన్ని రంగాలు పతనాన్ని నమోదు చేశాయి. ఈ వారం నుంచి కంపెనీల క్యు2 ఫలితాల సీజన్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో సూచీలు కాస్త కుదురుకుంటాయని నిపుణులు ఆశిస్తున్నారు. ఈ నెల 11న టీసీఎస్‌ ఫలితాల ప్రకటనతో రిజల్ట్స్‌ సీజన్‌ మొదలవుతుంది. ఫలితాలతో పాటు ఈ నెల 12న విడుదలయ్యే ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాలను కూడా మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయి. నిఫ్టీలో తాజా పతనం గత నాలుగు నెలల లాభాలను ఆవిరి చేసింది. కంపెనీల ఎర్నింగ్స్‌ ఇకపై సూచీలను నడిపిస్తాయని, నిఫ్టీకి 10100 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ స్థాయికి పైన ఉన్నంత వరకు కొంత పుల్‌బ్యాక్‌ ర్యాలీలకు అవకాశం ఉంటుందని, దీన్ని కోల్పోతే మరోమారు 9950, 9500, 9300 పాయింట్ల వరకు దిగజారవచ్చని అంచనా వేశారు. 



You may be interested

నిఫ్టీకి తగిన విలువ 9600-9800

Tuesday 9th October 2018

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిప్టీ సరైన విలువ ఎంతో తెలుసా? 9,600-9,800 స్థాయి సరైన విలువ అని చెబుతోంది ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌. ప్రఖ్యాత ఇన్వెస్టర్‌ బెంజమిన్‌ గ్రాహామ్‌ తన సెక్యూరిటీ అనాలసిస్‌ పుస్తకంలో ఉపయోగించిన రెండు పద్ధతుల ప్రేరణతో ఈ విలువ లెక్కించినట్లు తెలిపింది. నాన్‌-బ్యాకింగ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో లిక్విడిటీ ఆందోళనలు, స్థూల ఆర్థికాంశాలు క్షీణించడం వంటి అంశాల కారణంగా ఇటీవల మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొందని, దీంతో బుల్‌ మార్కెట్‌

ఏడేళ్ల కనిష్టానికి టాటా మోటార్స్‌

Tuesday 9th October 2018

తగ్గిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ అమ్మకాలు టాటా మోటార్స్‌ షేరు మంగళవారం ఏడేళ్ల కనిష్టానికి చేరుకుంది. తన అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ సెప్టెంబర్‌ అమ్మకాలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. ఈ సెప్టెంబర్‌లో జేఎల్‌ఆర్‌ ప్రపంచ అమ్మకాలు 12.3శాతానికి క్షీణించాయి. మరోవైపు ఇటీవల కాలంలో అటోరంగ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు టాటామోటర్స్‌ షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే

Most from this category