నిఫ్టీ కీలక నిరోధస్థాయి 10740-10750..!
By Sakshi

ముంబై: నిఫ్టీ 200-రోజుల సాధారణ సగటు కదిలికల స్థాయి 10,753 పాయింట్ల వద్ద ఉండగా.. ఈ స్థాయిని అధిగమించిన పక్షంలో 10,850-10,980 పాయింట్ల వరకు ర్యాలీ కొనసాగుతుందని ఎస్ సెక్యూరిటీస్ (ఇండియా) లిమిటెడ్ టెక్నికల్ అనలిస్ట్ ఆదిత్య అగర్వాలా విశ్లేషించారు. బుధవారం ఉదయం సెషన్లో సూచీ 10,742 పాయింట్లను చేరుకోగా.. ఈ స్థాయి 50-డబ్ల్యూఎంఏ (వీక్లీ మూవింగ్ యావరేజ్) అని.. ఈ సగటు ప్రకారం, 10740-10750 స్థాయిని సూచీ అధిగమించలేపోతే ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ ట్రిగ్గర్ అవ్వడం వల్ల 10,425-10,150 స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషించారు. టెక్నికల్ అంశాల ప్రకారం 21 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన 3 షేర్లను సిఫార్సుచేశారు. వీటిలో రెండు బై కాల్స్ ఉండగా.. ఒక సెల్ కాల్ ఉన్నాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర రూ.887 | టార్గెట్ ధర: రూ.1,070 | స్టాప్ లాస్ రూ.810 | రాబడి అంచనా: 21 శాతం యునైటెడ్ స్పిరిట్స్ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర రూ. 646 | టార్గెట్ ధర: రూ. 745 | స్టాప్ లాస్ రూ. 608 | రాబడి అంచనా: 15 శాతం బయోకాన్ | సిఫార్సు: సెల్ | ప్రస్తుత ధర రూ.609 | టార్గెట్ ధర: రూ. .570 | స్టాప్ లాస్ రూ. 625 | రాబడి అంచనా: 7 శాతం ఇవి కేవలం విశ్లేషకులు అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్ సూచన.
You may be interested
ఈ స్టాక్స్‌పై సెంట్రమ్ బుల్లిష్
Wednesday 28th November 2018ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ తాజాగా మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం.. టాటా స్టీల్ టాటా స్టీల్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. బై రేటింగ్ ఇస్తున్నాం. టార్గెట్ ప్రైస్‌ను రూ.790గా నిర్ణయిస్తున్నాం. దేశీయంగా బలమైన క్యాష్ ఫ్లో ఉండటం, కొనుగోళ్లు వంటివి సానుకూల అంశాలు. కంపెనీ క్యూ2 ఫలితాలు అంచనాలు మించాయి. రుణ భారం తగ్గించుకోవాలనే లక్ష్యం, తన సబ్సిడరీ ద్వారా ఉషా మార్టిన్ కొనుగోలు ప్రకటన వంటి వాటి వల్ల
35% వరకు రాబడికి 5 సిఫార్సులు
Wednesday 28th November 2018ముంబై: ఫండమెంటల్స్ పరంగా బలంగా ఉన్నటువంటి ఐదు షేర్లను పలు బ్రోకింగ్ సంస్థలు సూచిస్తున్నాయి. ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 35 శాతం వరకు రాబడిని పొందవచ్చని సిఫార్సుచేస్తున్నాయి. ఆటోమోటివ్ యాక్సిల్స్ | సిఫార్సు : కొనొచ్చు | ప్రస్తుత ధర రూ.1,415 | టార్గెట్ : రూ.1,838 | రాబడి అంచనా: 30 శాతం మధ్యస్థ, భారీ వాణిజ్య వాహన విడిభాగాల ఉత్పత్తిలో ఉన్నటువంటి ఆటోమోటివ్ యాక్సిల్స్.. దేశీ మార్కెట్లో