STOCKS

News


నిఫ్టీకి ఇదే కీలక స్థాయి..

Friday 30th November 2018
Markets_main1543567469.png-22524

 నిఫ్టీ నవంబర్‌ సిరీస్‌ను 10,100 స్థాయి వద్ద ప్రారంభించిందని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (డెరివేటివ్స్‌ రీసెర్చ్‌) సహజ్‌ అగర్వాల్‌ తెలిపారు. 10,004 కనిష్ట స్థాయిని తాకిన తర్వాత మళ్లీ పుంజుకుందని, ఇప్పుడు 10,800 మార్క్‌కు అటుఇటుగా ట్రేడవుతోందని పేర్కొన్నారు. సిరీస్‌ ప్రారంభంలో నిఫ్టీ లాభాల్లో ఉన్నా కూడా, మధ్యలో కన్సాలిడేషన్‌ చోటుచేసుకుందని, అటుపై మళ్లీ పెరుగుదల కనిపించిందని, ముగింపునకు వచ్చేసరికి దాదాపు 7 శాతం మేర ఎగసిందని వివరించారు. క్రూడ్‌ ధరలు భారీగా పడిపోవడం, రూపాయి బలపడటం వల్ల మార్కెట్లు పెరిగాయని తెలిపారు. అలాగే ఎన్‌బీఎఫ్‌సీ ఆందోళనలు తగ్గడంతో లాభాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. 
డిసెంబర్‌ సిరీస్‌ ఫ్లాట్‌గా లేదా పాజిటివ్‌గా ప్రారంభం కావొచ్చని అంచనా వేశారు. డిసెంబర్‌ సిరీస్‌ తొలి అర్ధ భాగంలో దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రభావం చూపే అంశాలున్నాయని పేర్కొన్నారు. 10,900-11,000 స్థాయిలో గట్టి నిరోధాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ట్రెండ్‌ కొనసాగించాలంటే నిఫ్టీ ఈ నిరోధ స్థాయిని అధిగమించడం కీలకమని పేర్కొన్నారు. ఒకవేళ అధిగమించలేకపోతే కరెక‌్షన్‌ ఉంటుందని తెలిపారు. అలాంటప్పుడు 10,400 స్థాయికి పడిపోవచ్చని పేర్కొన్నారు. మధ్యస్థ కాలంలో పాజిటివ్‌గా ఉన్నామని, అయితే స్వల్ప కాలంలో కరెక‌్షన్‌ ఉండొచ్చని తెలిపారు. ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. 
బుధవారం నాటి వరకు చూస్తే.. మార్కెట్‌ వైడ్‌ రోలోవర్‌ 66 శాతంగా, నిఫ్టీ రోలోవర్‌ 49 శాతంగా ఉందని తెలిపారు. ఐటీ, ఫార్మా విభాగాల్లో అధిక రోలోవర్‌ ఉందని, మెటల్స్‌లో తక్కువ రోలోవర్‌ ఉందని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగాలు ఔట్‌పర్ఫార్మ్‌ కనబర్చవచ్చని అంచనా వేశారు. 
ఆప్షన్స్‌ డేటాను గమనిస్తే.. 10,500 వద్ద పుట్స్‌కు ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ ఎక్కువగా ఉందని, 11,000 వద్ద కాల్స్‌కు ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ ఎక్కువగా ఉందని తెలిపారు. అందువల్ల మార్కెట్‌ 10,500- 11,000 రేంజ్‌లో కదలాడవచ్చని పేర్కొన్నారు. టెక్నికల్‌గా చూసినా కూడా నిఫ్టీకి 11,000 వద్ద గట్టి నిరోధముందని తెలిపారు. You may be interested

ఎఫ్‌ఐఐలు కొన్న షేర్లలో 50% వరకు ర్యాలీ

Friday 30th November 2018

ముంబై: గతకొద్దికాలంగా భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను క్రమంగా వెనక్కి తీసుకుంటూ నెట్‌ సెల్లర్లుగా నిలుస్తూ వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ)లు ఈనెలలో పంథా మార్చారు. వరుసగా ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మార్కెట్‌ నుంచి తమ సొమ్మును ఉపసంహరించుకున్న వీరు.. నవంబర్‌లో ఇప్పటివరకు  ఈక్విటీ, డెట్‌లో కలిపి రూ.10,000 కోట్లను కుమ్మరించారు. అంతకుముందు మూడు నెలల్లో రూ.60,000 కోట్లను వెనక్కుతీసుకున్న ఎఫ్‌ఐఐలు.. ఒక్కసారిగా పతనమైన

టాటామోటర్స్‌ రివర్స్‌ గేర్‌..!

Friday 30th November 2018

4శాతం నష్టపోయిన టాటామోటర్స్‌ షేరు దేశీయ ఆటోరంగ దిగ్గజం టాటామోటర్స్‌ షేరు శుక్రవారం 4శాతం నష్టపోయింది. చైనాలో డిజిల్‌ కార్ల డిమాండ్‌ తగ్గడం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం తదితర అంశాలతో టాటామోటర్స్‌ యూకే అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ మోటర్స్‌ తమ ఉత్పత్తులను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఇంగ్లాండ్‌లోని తన ప్రధాన తయారీ ఇంజన్ల కార్మాగారం వోల్వెర్హాంప్టన్ యూనిట్‌ నుంచి 500 మంది ఉద్యోగులకు తాత్కలిక ఉద్వాసన

Most from this category