STOCKS

News


క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీవో.. సబ్‌స్క్రైబ్‌ చేయొచ్చా?

Wednesday 8th August 2018
Markets_main1533715890.png-19050

నెదర్లాండ్స్‌కు చెందిన క్రెడిట్‌యాక్సెస్‌ ఆసియా ఎన్‌ఈ సంస్థకు చెందిన మైక్రోఫైనాన్స్‌ రంగంలోని క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ కంపెనీ ఆగస్ట్‌ 8న (బుధవారం) ఐపీవోకు వస్తోంది. దీని ద్వారా రూ.1,131 కోట్ల మేర నిధులు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవో ప్రైస్‌బాండ్‌ రూ.418-422గా ఉంది. ఐపీవో ఆగస్ట్‌ 10న ముగుస్తుంది. 
ఐపీవోలో భాగంగా కంపెనీ రూ.630 కోట్ల విలువైన తాజా షేర్లతోపాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో కింద రూ.510 కోట్ల విలువైన మరిన్ని షేర్లను విక్రయించనుంది. ఐపీవో అనంతరం కంపెనీలో ప్రమోటర్ల వాటా 98.9 శాతం నుంచి 80.3 శాతానికి తగ్గుతుంది. ఐపీవో నేపథ్యంలో కంపెనీ స్థితిగతులు పరిశీలిస్తే..
కంపెనీ గురించి 
క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ మన దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో 132 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంస్థలకు 516 బ్రాంచ్‌లున్నాయి. యాక్టివ్‌ కస్టమర్ల సంఖ్య 18.5 లక్షలుగా ఉంది. జాయింట్‌ లెండింగ్‌గ్రూప్‌ మోడల్‌లో మహిళలకు ఎక్కువగా రుణాలను అందిస్తుంది. కర్నాటక, మహారాష్ట్రా ప్రాంతాలే కంపెనీ లోన్‌ బుక్‌లో 86 శాతం వాటా ఆక్రమించాయి. దీని వల్ల స్థానిక రాజకీయ పరిస్థితుల్లో మార్పు, ఇతరత్రా అంశాల వల్ల కంపెనీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌కేఎస్‌ మైక్రోఫైనాన్స్‌ ఉదంతాన్ని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఆర్థికాంశాలు..
కంపెనీ నిర్వహణ ఆస్తులు గత ఐదేళ్ల కాలంలో ఆరు రెట్లకుపైగా పెరిగాయి. 2014-18 ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ నికర లాభం వార్షికంగా 65.5 శాతం పెరుగుతూ వచ్చింది. 2014-17 ఆర్థిక సంవత్సరాల్లో స్థూల ఎన్‌పీఏలు 0.1 కన్నా దిగువునే ఉన్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో 1.97 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం 12.7 శాతంగా ఉంది. 
వ్యాల్యుయేషన్‌
కంపెనీ షేరు ఇష్యూ తర్వాత 2017-18 పుస్తక విలువకు 2.9 రెట్లు అధిక ధరకు లభించొచ్చు. భారత్‌ ఫైనాన్షియల్‌ 2017-18 బుక్‌ వ్యాల్యుకు 5.1 రెట్లు వద్ద, సతిన్‌ క్రెడిట్‌కేర్‌ 2017-18 బుక్‌ వ్యాల్యుకు 1.7 రెట్లు వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 
ఐపీవోపై బ్రోకరేజ్‌ సంస్థల స్పందన
యాంటిక్యూ బ్రోకింగ్‌, ఎమ్‌కాయ్‌ గ్లోబల్‌ సంస్థలు ఐపీవో సబ్‌స్క్రైబ్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నాయి. దీనికి స్వల్ప ఆర్‌వోఈ (రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ), బిజినెస్‌ రిస్క్‌, కొన్ని ప్రాంతాలకు పరిమితం కావడం వంటి పలు అంశాలను కారణంగా చూపాయి. మరోవైపు ఎస్‌ఎంసీ గ్లోబల్‌, ప్రభుదాస్‌ లీలాధర్‌ ఈ ఐపీవోను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చని సిఫార్సు చేశాయి. ఆర్‌వోఈలో ఏ కొద్దిగా మెరుగుదల కనిపించినా వ్యాల్యుయేషన్స్‌ పెరుగుతాయని, దీర్ఘకాలం లక్ష్యంతో సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చని తెలిపాయి.  

 You may be interested

ఇంట్రాడే కోసం రికమండేషన్లు

Wednesday 8th August 2018

బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌ కోసం ప్రముఖ అనలిస్టులు కొన్ని స్టాకులను సిఫార్సు చేస్తున్నారు.  - జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌: కొనొచ్చు. అనలిస్టు- మానస్‌ జైస్వాల్‌. టార్గెట్‌ రూ. 235. స్టాప్‌లాస్‌ రూ. 204. - ఎన్‌సీసీ: కొనొచ్చు. అనలిస్టు- కునాల్‌ బత్రా. టార్గెట్‌ రూ. 100. స్టాప్‌లాస్‌ రూ. 91.5 - టాటాస్టీల్‌: కొనొచ్చు. అనలిస్టు- కునాల్‌ బత్రా. టార్గెట్‌ రూ. 605. స్టాప్‌లాస్‌ రూ. 560. - టాటాస్టీల్‌: కొనొచ్చు. అనలిస్టు-

అంచనాల్ని మించిన మార్కెట్‌ ర్యాలీ

Wednesday 8th August 2018

దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు మీదున్నాయి. జీవిత కాల గరిష్ట స్థాయిల్లో కదలాడుతున్నాయి. అయితే ఇక్కడ మార్కెట్‌పై నిపుణుల అంచనాలు తప్పాయి. ట్రెండ్‌ను కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. మార్కెట్‌ పెరుగుదల వీరి అంచనాల కన్నా అధిక స్థాయిలో ఉంది. బ్లూమ్‌బర్గ్‌ మార్కెట్‌ విశ్లేషకుల ప్యానల్లో అతి కొద్ది మంది మాత్రమే స్టాక్‌ ధరలు ఈ స్థాయిలో పెరగొచ్చని అంచనా వేశారు. ఎక్కువ మంది మార్కెట్‌ ట్రెండ్‌ను పట్టుకోలేకపోయారు. కేవలం కొన్ని

Most from this category