STOCKS

News


డీమార్ట్‌ ఎర్నింగ్స్‌పై క్రెడిట్‌ సూసీ అప్రమత్త స్వరం

Friday 31st August 2018
Markets_main1535701921.png-19832

డీమార్ట్‌ ఆపరేటర్‌ ఎవెన్యూ సూపర్‌ మార్కెట్‌ షేరుకు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ దిగ్గజం క్రెడిట్‌ సూసీ అండర్‌పెర్ఫామ్‌ రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌ ధర రూ. 1150గా నిర్ణయించింది. ప్రస్తుత ధరతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం తక్కువ. కంపెనీ ఎర్నింగ్స్‌పై పెద్దగా పాజిటివ్‌ అంచనాలు లేవని క్రెడిట్‌ సూసీ తెలిపింది. తోటి కంపెనీలతో పోలిస్తే ఎవెన్యూ రిటర్న్‌ రేషియో తక్కువని తెలిపింది. అంతేకాక కంపెనీ ఎర్నింగ్స్‌ వృద్ధి మందగిస్తోందని, మరోవైపు వాల్యూషన్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. తోటి కంపెనీలు పుంజుకున్నా, ఎవెన్యూ మాత్రం పెద్దగా వృద్ది చూపలేకపోవచ్చని అంచనా వేసింది. వచ్చే మూడేళ్లకు ఎర్నింగ్స్‌ వృద్ధి కనిష్ఠంగా ఉండొచ్చని పేర్కొంది. క్రెడిట్‌ సూసీ నివేదికతో శుక్రవారం ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ఆరంభ లాభాలను కోల్పోయింది. 
మరోవైపు ఇంకో అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మాన్‌ సాక్స్‌ మాత్రం ఎవెన్యూపై పాజిటివ్‌ అంచనా ఇచ్చింది. ఎవెన్యూ సూపర్‌ మార్ట్‌ షేరుకు కొనొచ్చు రేటింగ్‌తో రూ. 1965 టార్గెట్‌నిచ్చింది. నిర్వహణ వ్యయాల పరంగా తోటి కంపెనీలతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందని తెలిపింది. రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టెడ్‌ బాగుందని తెలిపింది. జర్మన్‌ కంపెనీలతో పోలిస్తే వర్కింగ్‌ క్యాపిటల్‌ కూడా అధికమని తెలిపింది. 



You may be interested

రూపీ పతనంతో ఐటీ షేర్ల ర్యాలీ

Friday 31st August 2018

కొత్త గరిష్టానికి నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఏడాది గరిష్టానికి ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ డాలర్‌ మారకంలో రూపాయి పతనంతో శుక్రవారం ఐటీ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. కొంతకాలంగా డాలర్‌ మారకంలో రూపాయి కొత్త జీవితకాల కనిష్టాలకు చేరుకుంటున్న నేడు తొలిసారిగా 71 స్థాయికి పడిపోయింది. ఫలితంగా ఎగుమతులపై ఆధారపడే ఐటీ కంపెనీ షేర్లు భారీ ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతానికి పైగా లాభపడి కొత్త

ఆగస్టు ఆటో అమ్మకాలు అంతంతే?!

Friday 31st August 2018

వివిధ కారణాలతో ఆగస్టు నెల్లో ఆటో అమ్మకాలు పేలవంగా ఉంటాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేరళ వరదలు, పండుగల సీజన్‌ ఆలస్యం కావడం, కమోడిటీల ధరల పెరుగుదల, రూపీ క్షీణత, ఉత్పత్తుల ధరలు పెంచడం తదితర కారణాలు ఆటో అమ్మకాలకు భారంగా మారాయని బ్లూమ్‌బర్గ్‌ సర్వేలో పాల్గొన్న డీలర్లు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పాసింజర్‌ వాహనాలైన కార్లు, యుటిలిటీ వాహనాల విక్రయాలు బాగా దెబ్బతినవచ్చన్నారు. దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు

Most from this category