News


భారత్‌ ఫోర్జ్‌ డౌన్‌గ్రేడ్‌

Thursday 14th February 2019
Markets_main1550132018.png-24197

  • 2.50శాతం నష్టపోయిన షేరు

బ్రోకరేజ్‌ సంస్థలు షేరు టార్గెట్‌ ధరను తగ్గించడంతో ఆటో విడిభాగాల కంపెనీ భారత్‌ ఫోర్జ్‌ షేరు గురువారం 2.50శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.475.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారభించింది. వచ్చే ఏడాదిలో కమర్షియల్‌ వాహన అమ్మకాలు క్షీణించడంతో కంపెనీ మార్జిన్లు మార్జిన్లు తగ్గవచ్చనే అంచనాలతో పాటు రాబోయే రోజుల్లో కంపెనీ వృద్ధి అంచనాలు అధికంగా ఉండటంతో షేరు టార్గెట్‌ ధరును తగ్గిస్తున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థలు చెప్పుకొచ్చాయి.
క్రెడిట్‌ సూసీ :- ప్రస్తుతం షేరుపై ఉన్న అవుట్‌ఫెర్మ్‌ఫామింగ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అయితే గతంలో తాము షేరుకు కేటాయించిన రూ.690ల టార్గెట్‌ ధరను రూ.570లకు తగ్గిస్తున్నట్లు ప్రలించింది. 
సిటీ గ్రూప్‌:- కంపెనీ క్యూ3లో సాధించిన ఆశాజనకమైన ఫలితాల దృష్టా‍్య ప్రస్తుతం షేరుపై ఉన్న ‘‘న్యూట్రల్‌’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. అయితే షేరు టార్గెట్‌ ధరను మాత్రం రూ.670ల నుంచి రూ.540లకు తగ్గిస్తున్నామని తెలిపింది. 
బ్రోకరేజ్‌ సంస్థలు షేరు టార్గెట్‌ ధరను తగ్గించడంలో ఇన్వెస్టర్లు షేరు అ‍మ్మకాలను మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 2.50శాతం నష్టపోయి రూ.466.25ల కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.1:30లకు షేరు గత ముగింపు ధర(రూ.477)తో పోలిస్తే 1శాతం నష్టంతో రూ.460ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.463.70 రూ.799.65లుగా నమోదయ్యాయి. 



You may be interested

యస్‌ బ్యాంకును ‘నో’ అనుకున్నాం..

Thursday 14th February 2019

బ్రోకరేజ్‌ల అభిప్రాయం దాదాపు 14 సంవత్సరాల తర్వాత యస్‌ బ్యాంకు షేరు అత్యధిక ఇంట్రాడే లాభాలు చవిచూసింది. ఒకదశలో దాదాపు 30 శాతం వరకు షేరు దూసుకుపోయింది. బ్యాంకు అసెట్స్‌ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్న వార్తలు షేరు కౌంటర్లో జోరు నింపాయి. దీంతో ఇప్పటివరకు షేరుపై నెగిటివ్‌ భావనతో ఉన్న బ్రోకింగ్‌ సంస్థలు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నాయి. యస్‌బ్యాంకును తప్పుగా అర్ధం చేసుకున్నామని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. దీంతో షేరు

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాలు

Thursday 14th February 2019

గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ లాభం రెండు రెట్లు న్యూఢిల్లీ: గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రెండు రెట్లకు పైగా పెరిగింది. గత క్యూ3లో రూ.51 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.121 కోట్లకు ఎగసిందని గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,169 కోట్ల నుంచి రూ.2,576 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.2,197 కోట్ల నుంచి 17

Most from this category