News


ఇలాంటప్పుడు డిఫెన్సివ్‌ స్టాకులతోనే రక్షణ!

Saturday 22nd September 2018
Markets_main1537602744.png-20481

పతనం ఇస్తున్న సంకేతాలు
గతంలో నిఫ్టీ పలుమార్లు భారీ పతనాలను చవిచూసిందని, అందువల్ల శుక్రవారం సడన్‌ పతనానికి కారణాలు అన్వేషించడం మాని తర్వాత ఏమి చేయాలో ఆలోచించుకోవాలని మార్కెట్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి పతనాల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఇక మీదట పోర్టుఫోలియోలో డిఫెన్సివ్‌ స్టాక్స్‌ను పెంచువాలని ఈ అనూహ్య పతనం సంకేతాలు ఇస్తోందన్నారు. జీడీపీ నెంబర్లు ప్రకటించినప్పటినుంచి సూచీలు బలహీనంగా కొనసాగిస్తున్నాయి. ‘రూమర్లున్నప్పుడు కొనండి.. వార్తలను బట్టి అమ్మండి’’అనే సూక్తి ప్రస్తుతం అక్షరాలా అమలవుతున్నట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్‌లో సూచీలు దాదాపు 5 శాతం పడిపోగా బడా స్టాకులు దాదాపు 10- 15 శాతం వరకు క్షీణించాయి. శుక్రవారం నిఫ్టీ చూసిన కనిష్ఠస్థాయి కొన్నాళ్లపాటు ప్రధాన మద్దతు స్థాయిగా కొనసాగనుంది. గత ర్యాలీకి ఈ స్థాయి 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్ధాయి. ఒక వేళ నిఫ్టీ సోమవారం 10865 పాయింట్లను కూడా పోగొట్టుకుంటే మరో దఫా క్షీణత తప్పదని, ఆ పరిస్థితుల్లో 10550 వరకు పతనం ఉండొచ్చని నిపుణుల అంచనా. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో రక్షణాత్మక రంగాల స్టాకులే సేఫ్‌ అని సూచిస్తున్నారు. నిఫ్టీ తిరిగి తన ఆల్‌టైమ్‌ హై 11760 పాయింట్లను దాటే వరకు పోర్టుఫోలియోలో డిఫెన్సివ్‌ స్టాకులను ఉంచుకోవడం బెటర్‌. రాబోయే రోజుల్లో మరింత అస్థిరతకు దారితీసే అంశాలు(ఆర్‌బీఐ సమావేశం, ఫెడ్‌ సమావేశం, త్రైమాసిక ఫలితాలు, రాష్ట్రాల ఎన్నికలు) లైన్లో ఉన్నాయి. అందువల్ల వచ్చే సంవత్సరం పాటు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. 
- ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాలతో పోలిస్తే ఫార్మా రంగాన్ని ఎంచుకోవాలి. ఐటీ స్టాకుల్లో బాటమ్‌ అప్‌ సూత్రాన్ని పాటించి ఎన్నుకోవచ్చు. ఫార్మా స్టాకుల్లో టాప్‌డౌన్‌ విధానం అవలంబించి స్టాకులను ఎంచుకోవాలి. ఫార్మాలో సన్‌ఫార్మా, డా.రెడ్డీస్‌ స్టాకులను పరిశీలించవచ్చు. ఐటీ స్టాకుల్లో విప్రో ఇటీవలే భారీ పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. You may be interested

అవెన్యూస్‌ పేమెంట్స్‌లో వాటా కొనుగోలు చేసిన ఐసీఐసీఐ

Saturday 22nd September 2018

ముంబై:- ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు ఈ-కామర్స్‌ సంస్థ అవెన్యూస్‌ పేమెంట్స్‌లో వాటా కొనుగోలుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా బీ2బీ, బీ2సీ చెల్లింపుల మార్కెట్‌లో సేవలు అందిస్తున్న అవెన్యూస్‌ పేమెంట్స్‌లో 8.9శాతం వాటాను రూ.10కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు శుక్రవారం ఐసీఐసీఐ బ్యాంకు రెగ్యూలేటరీకి సమాచారం ఇచ్చింది. ఈ వాటా కొనుగోలు ప్రక్రియను అక్టోబర్‌ చివరినాటికి పూర్తి చేస్తామని ఐసీఐసీఐ తెలిపింది. వాటా కొనుగోలు 10శాతానికి తక్కువ ఉన్నందున్న రెగ్యూలేటరీల

ఈ వారం పిక్‌: మహీంద్రా లైఫ్‌స్పేస్‌

Saturday 22nd September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ను ఈ వారం స్టాక్‌ పిక్‌గా సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ ఇండస్ట్రీ: రియల్‌ ఎస్టేట్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.466 టార్గెట్‌ ప్రైస్‌: రూ.565 బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. రియల్టీ కంపెనీ మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బై రేటింగ్‌ ఇచ్చింది. వచ్చే 4-6 త్రైమాసికాల్లో

Most from this category