STOCKS

News


సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ దీర్ఘకాలానికి కాదు

Thursday 22nd November 2018
Markets_main1542863851.png-22291

డిస్కౌంట్‌ను రాబడిలా పొందాలనుకునే వారు ఈ ఫండ్‌ చూడొచ్చు. షార్ట్‌, మీడియం టర్మ్‌ వరకు పర్వాలేదు. ఇంతే తప్పించి మరీ దీర్ఘకాలానికైతే మాత్రం సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఏమంత లాభదాయకం కాదని వ్యాఖ్యానించిన ధీరేంద్ర కుమార్‌.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వచ్చే వారంలో విడుదలచేయనున్న నాలుగో విడత సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (సీపీఎస్ఈ ఈటీఎఫ్) దీర్ఘకాల పెట్టుబడికి ఏమంత సూచించదగినది కాదని వ్యాల్యూ రీసెర్చ్‌ సీఈఓ ధీరేంద్ర కుమార్‌ అన్నారు. లాంగ్‌టర్మ్‌ ఉద్దేశ్యంతో అయితే, పోర్ట్‌ఫోలియోలో నిర్వహించడం లాభదాయకంగా ఉండకపోవచ్చని సూచించిన ఆయన.. షార్ట్‌, మీడియం టర్మ్‌ ఆలోచనతో ఈ ఫండ్‌ను చూడవచ్చన్నారు. ఈ ఫండ్‌లో 82 శాతం ఎనర్జీ రంగానికి చెందిన షేర్లే ఉన్నాయి. ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ, ఓఎన్‌జీసీ షేర్ల వాటానే మొత్తం ఫండ్‌లో 80 శాతం ఉంది. ఈ నేపథ్యంలో పేరుకు పెద్ద ఫండ్‌ లానే కనిపిస్తున్నప్పటికీ, పనితీరు మాత్రం స్మాల్‌క్యాప్‌ మాదిరిగానే ఉంటుందని విశ్లేషించారు. ఇంతకుముందు ప్రతి విడతలోనూ డిస్కౌంట్‌ ఉంది కనుక ఈసారి 4.5 శాతం వరకు ఆశించవచ్చన్నారు. ఈటీఎఫ్‌లు అన్నివేళల అనుకూలంగా ఉంటాయని తాను అనుకోవడం లేదని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆయన.. కొన్ని ఈటీఎఫ్‌లు మాత్రమే ఎందుకు అధిక మొత్తంలో రాబడిని ఇస్తున్నాయంటే, కేవలం వాటికి ఉన్నటువంటి ప్రత్యేకతల వల్లనే అని విశ్లేషించారు. ఇందుకు ఉదాహరణ చెప్పాలంటే.. నిఫ్టీ ఈటీఎఫ్‌ దేశంలోనే అతిపెద్ద ఈక్విటీ ఫండ్‌గా మారిన విషయం తెలిసిందే కాగా, అతికొద్ది సమయంలోనే అంతలా పెరగడానికి కారణం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) అని తెలిపారు. ఈ సంస్థ నిఫ్టీ ఈటీఎఫ్‌ను ఎంచుకుంది కనుకనే అంతలా పెరిగిందన్నారు. అయితే, ఈ విషయంలో ఈపీఎఫ్‌ఓ నిర్ణయం కూడా సమంజసంగానే ఉందని ఆయన వివరించారు. ఇలా అన్ని లార్జ్‌క్యాప్‌లు ఫలించే అవకాశం లేదని, ప్రత్యేకతల వల్లనే రాబడి ఉంటుందని సూచించారు. ప్రభుత్వం భారత్‌22 ఈటీఎఫ్‌ విడుదల చేసినా,  సీపీఎస్ఈ ఈటీఎఫ్ నాలుగో విడత ప్రకటించినా కేవలం వీలైనంత త్వరగా నిధులను సమీకరించుకోవడమే ప్రధాన ఉద్యేశ్యమని వ్యాఖ్యానించారు. తాజా ఫండ్‌లోని ఓఎన్‌జీపీ, కోల్ ఇండియా, ఐఓసీ, ఎన్‌టీపీసీ, పీఎఫ్‌సీ, ఆర్ఈసీ, బీఈఎల్‌, ఆయిల్ ఇండియా షేర్లన్నీ మంచివే అయినప్పటికీ.. ఒక సామాన్య ఇన్వెస్టర్‌గా చేసేదేమీ ఉందన్నారయన. కేవలం 4.5 శాతం డిస్కౌంట్‌లో వస్తుందనే యోచనలో కొనుగోలు చేసి.. ఆ తరువాత అమ్మివేయడం ద్వారా కనీసం ఈమేరకు లాభాన్నైనా పొందవచ్చని సూచించారు. You may be interested

2019లో ఫార్మా పనితీరు భేష్‌!

Thursday 22nd November 2018

న్యూఢిల్లీ: గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పేలవమైన పనితీరు చూపించిన ఫార్మా రంగం ఈ ఏడాది 20 శాతం రాబడులనిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు చూపించిన రంగాల్లో ఇది కూడా ఒకటి. ఇక ముందూ ఫార్మా మంచి పనితీరు చూపిస్తుందన్న అంచనాను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫార్మా కంపెనీల షేర్ల ర్యాలీకి ప్రధానంగా తోడ్పడినది డాలర్‌తో రూపాయి 15 శాతం మేర విలువను కోల్పోవడం.

వాట్సాప్‌ భారత్ చీఫ్‌గా అభిజిత్ బోస్‌

Thursday 22nd November 2018

న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ భారత విభాగం చీఫ్‌గా అభిజిత్‌ బోస్‌ను నియమించింది. వచ్చే ఏడాది తొలి నాళ్లలో ఆయన బాధ్యతలు చేపడతారని, గురుగ్రామ్ కేంద్రంగా ఆయన టీమ్ పనిచేస్తుందని వాట్సాప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్న, పెద్ద సంస్థలను వాటి కస్టమర్లతో అనుసంధానించడంపై బోస్ టీమ్ ప్రధానంగా దృష్టి పెడుతుందని వాట్సాప్ సీవోవో మాట్ ఇడెమా తెలిపారు. 2011లో ఏర్పాటైన ఎలక్ట్రానిక్ పేమెంట్స్ కంపెనీ ఈజీట్యాప్ వ్యవస్థాపకుల్లో

Most from this category